నటరంజని : సకల కళా కోవిదులు, కూచిపూడి నాట్య ప్రావీణ్యులు - భాగవతుల శాస్త్రి గారు

-- కాకుళవరపు రమ

భాగవతుల శాస్త్రి గారి ప్రావీణ్యత గురించి సంధ్య గారు చెప్పగా విని చాలా ఆశ్చర్య పోయాను. ఒక మనిషికి ఇన్ని కళలలో ప్రావీణ్యత ఉండడం నిజంగా చాలా అద్భుతమైన విశేషం, ఆనందకరమైన విషయం కూడా! ఇంతటి కళా నైపుణ్యము తమలో ఉంచుకుని కూడా జనాదరణ పొందక, ప్రాముఖ్యత లేకుండా ఉండిపోయిన ఎంతో మంది కళాకారులను వెలుగు లోకి తేవాలని, సుజనరంజనిలో "నటరంజని" శీర్షిక ద్వార వారిని మా పాఠకులకు పరిచయం చేయాలని మా సంకల్పము.

ఇండియా లో ఉండి ఎన్నో కష్టాలకోరుస్తూ ఈ నాట్యకళను అభ్యసించడమే కాకుండా, అమెరికా వంటి దేశానికి వచ్చి కూడా ఈ కళను విస్మరించకుండా, తమకు చేతనైన విధంగా దాని ప్రాచుర్యం కోసం ఎంతో పాటు పడుతున్న ఈ కూచిపూడి కళాకారులందరకు నా అభినందనలు. భగవంతుడు వారి కృషికి అన్ని విధాలా సహకరించాలని నేను మనసారా కోరుకుంటున్నాను.

భాగవతుల శాస్త్రిగారు నృత్యం, మృదంగం వంటి కళలలో ప్రావీణ్యతే కాకుండా, చిన్న చిన్న భావగీతాలు రచించటము, వాటికి సంగీతం సమకూర్చి పాడడం కూడా చేస్తూ వుంటారు. వీరి నాన్న గారి ముత్తాత గారయిన భాగవతుల రామయ్య గారు కూచిపూడి నృత్యాంశాలలో విశిష్టమయిన "గొల్లకలాప" కర్తలు. నాన్న గారి పేరు భాగవతుల లక్ష్మీ నరసింహం గారు - మృదంగము, ఘటము వాయించడములో ఆరితేరిన విద్వాంసులు. తల్లి పేరు భాగవతుల సూర్యకుమారి గారు. తండ్రిగారు తెలుగు విశ్వవిద్యాలయములోని నృత్య విభాగములో నాట్య శాస్త్ర అంశాలను విద్యార్ధులకు విడమరచి భోదిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా కూచిపూడి నాట్య శాస్త్రములోని కొన్ని అంశాలను వ్యాసాలుగా రచిస్తూ ఉంటారు.

శాస్త్రిగారు పుట్టినది కూచిపూడి అగ్రహారములో అయినా నివాసము హైదరాబాదు. శాస్త్రి గారి పెదనాన్న వరసైన - భాగవతుల రామకోటయ్య గారు, కూచిపూడి నాట్యంలో విద్వాంసులు. కళాకారుల వంశములో పుట్టటం వలననేమో శాస్త్రి గారు తన అయిదవ ఏటనే పెదనాన్న గారింట్లో ఆయన విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నపుడు తనకు కూడా నాట్యము నేర్చుకోవాలున్నదని, క్లాసులో చేర్చుకోమని అడిగినప్పుడు ఆయన పెదనాన్న గారు శాస్త్రి గారిని వారి అమ్మానాన్న గార్ల అనుమతి తీసుకు రమ్మని ఇంటికి పంపివేసారు. ఎలాగయినా నాట్యము నేర్చుకోవాలన్న పట్టుదల, ఇష్టముతోనే తన అయిదవ ఏటనే పెదనాన్న వద్దనే శిక్షణ మొదలు పెట్టారు. ఆ రోజుల్లోనే, అంత చిన్న వయసులొనే శాస్త్రి గారు ప్రహ్లాద నాటకము, శశిరేఖా పరిణయము వంటి యక్ష గానాలలో చిన్న చిన్న పాత్రలు ధరించారు.

ఆయన తన ఆరవ ఏట ఐ.డి.పి.ల్. లో వుంటున్నపుడు మాస్టారు గరి ఆధ్వర్యములో ఆయన సిష్యులయిన డి.వి.స్.కుమార్ ఒక నాట్య కళాశాలలో శిక్షణ ప్రారంభించారు. అదే సమయములో ఆయన దగ్గర సిక్షణ పొందుతున్నపుడు "మోహినీభస్మాసుర" నృత్య నాటికలో "నరదడు" పాత్రను పోషించారు. ఆ సమయంలొ వేంపటి చినసత్యం మాస్టారు గారు కళాశాలను సందర్శించడానికి వచ్చినపుడు శాస్త్రి గారిని మద్రాసు అకాడెమికి రమ్మనమని పిలిచారు.

శాస్త్రి గారికి పది సంవత్సరాల వయసున్నపుడు మాస్టారు గారు అన్ని సంప్రదాయాలను కూచిపూడి నాట్యములో ఒక పద్దతిగా చూపాలని ప్రయత్నిస్తూ టీచెర్స్ అందరికీ నాట్య శిక్షణ ఇస్తున్నపుడు, తన చిన్న వయసులోనే వారితో పాటు శాస్త్రి గారికి కూడా ఒక అవకాశం లభించిందని ఆయన ఎంతో సగర్వంగా చెప్పుకున్నారు. ఇంకోసారి మాస్టారు గారు తన దగ్గర పని చేస్తున్న టీచర్స్ అందరితో క్షీరసాగర మధనం నృత్య నాటకం వేస్తున్నపుడు శాస్త్రి గారు అందులో చంద్రుడు పాత్రను పోషించారు.శాస్త్రి గారు మాస్టారు గారితో అయనకున్న అనుభవాలను, బాంధవ్యాన్ని ఎన్నో ఉదాహరణలలో ఇలా పేర్కొన్నారు.

తనకు పదమూడవ సంవత్సరంలో మాస్టారు గారు క్లాసు తీసుకొంటు పిల్లలతో పూజా నృత్యం చేయిస్తున్నపుడు, మృదంగము వాయించే ఆయన రాక పోయెసరికి శాస్త్రి గారు ఎంతో ఉత్సాహంతో మృదంగం అందుకొని మాస్టారు గారి పాటకు అనుగుణంగా మృదంగం వాయించడం మొదలు పెట్టారు. అది చూసి మాస్టారు గారు ఎంతో ముచ్చటపడి శాస్త్రి గారి వైపు ఎంతో అభిమానంతో మెప్పు దలగా చూసారని చెప్పుకున్నారు. మాస్టారు గారికి తన మీద ఉన్న అత్యంత నమ్మకంతోనే ఆ పాత్రను తనకు ఇచ్చారని ఆయన అన్నారు. శాస్త్రి గారు పదవ తరగతి చదువుతున్న సమయంలో మాస్టారు గారు కూచిపూడి అగ్రహారానికి వచ్చి సంస్క్రుతములో రామాయణ నృత్య నాటికను దూరదర్శనం వారి కోసం రూపకల్పన చేసినప్పుడు ఆయన లక్ష్మణుని పాత్రను పోషిమని అడిగారు. ఆతరువాత పదిహేదవ ఏట ఇండియ లో ఉంటున్నప్పుడు 1988 సవత్సరము "కుమారసంభవం" నాటకానికి నృత్య రూపకల్పన చేసారు. అంతే కాకుండా మాస్తారు గారి రూపకల్పనలో ప్రదర్శిమంచిన "రామాయణం" నృత్య నాటికలో లక్ష్మణుడిగా, "హరవిలాసము" లో ప్రమధ గణాలుగా, సురుడుగా, "శ్రీనివాసకళ్యానము" లో కూడా సురుడిగా, "క్షీరసాగరమధన్ము"లో అసుర్రుడిగా విభిన్న పాత్రలను పోషించారు. పసుమర్తి వెంకటేశ్వరశర్మ గారితో కలిసి "కీచకవధ" వేసినప్పుడు శాస్త్రి గారు భీముడిగా, బృహన్నల గా, మరియు "మహిషాసురమర్ధని" నృత్య నాటికలో శివుడిగా పాత్రలు ధరించారు."వేలం" దూరదర్సన్ ఎపిసోడ్ లో కూడా ఆయన నటించారు.

శాస్త్రి గారు కార్నింగ్ సాఫ్ట్ వేర్ కంపెనీ, న్యూయర్క్ లో కన్సల్టంట్ గా పనిచేస్తున్నారు. భార్య పేరు లక్స్మి జ్యొతిర్మయి, వీరికి వీణలో ప్రవేశము ఉంది, ఒక ఎనిమిది నెలల బాబు - ప్రణవ్. పాటలు రచించి వాటికి బాళి కట్టటం, మృదంగం, నృత్యం, ఏకపాత్రాభినయనం ఆయనకు ప్రియాతిప్రియమయిన అలవాట్లు. అంతే కాకుండా స్కూలులో, కాలెజీలో చదువుకుంటున్న రోజులలో వై.ఎం,సి,ఎ. వారి తరపునుండి వీటిలో ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నారు.

1998 లో అమెరికాకు వచ్చి పిట్ట్స్ బర్గ్ దేవాలయములో, ఇంకా మరి కొన్ని చోట్ల జరిగిన ఎన్నో కచేరీలలో మృదంగం వాయించారు.2001 సంవత్సరములో రేవతి గారి ఆధ్వర్యములో "మేనకావిశ్వామిత్ర" పిట్ట్స్ బర్గ్, డెట్రాయిట్, నాష్విల్ల్ పట్తణాల్లో ప్రదర్శించారు. మరియు శేషుశర్మ గారి ఆధ్వర్యములో "సప్తపది", 2004 లో "శివోహం", అలాగే 2002 లో "గంగావతరణము" కమలారెడ్డి గారితో కలిసి, శశికళ గారితో 2003 "శ్రీనివాస కళ్యాణము", 2005 లో "చండాలిక" ఇలా మాస్టారు గారు రూపకల్పన చేసిన ఎన్నో నృత్య నాటికలకు ఆయన నట్టువాంగము చేసారు. ఇంకోసారి మాస్టారు గారు తన దగ్గర పని చేస్తున్న టీచర్స్ అందరితో క్షీరసాగర మధనం నృత్య నాటకం వేస్తున్నపుడు శాస్త్రి గారు అందులో చంద్రుడు పాత్రను పోషించారు.

ప్రస్తుతము ఆయన కార్నింగ్ లో విద్యార్ధులకు మృదంగము, నాట్యము కూడ నేర్పిస్తున్నరు.