సుజననీయం
సుజననీయం
- తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:

తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:

తమిరిశ జానకి

కస్తూరి ఫణిమాధవ్

చన్నాప్రగడ కృష్ణ

'దేవాలయాలు!

నాకిప్పటికి బాగా గుర్తు. నేను అయిదో లేక ఆరో తరగతి చదువుతున్నప్పుడు మావూళ్లో పది అడుగుల వెడల్పు, ఇరవై అడుగుల పొడవు గల గదిలో 'జిల్లా శాఖా గ్రంథాలయం' తెరిచారు. దిన, వార, మాసపత్రికలతో పాటు నవలలు, కథల పుస్తకాలు ఉండేవి. ఉదయం, సాయంత్రం మూడు గంటల సేపు తెరచేవారు. ప్రతి సోమవారం సెలవు. సభ్యత్వ రుసుము పది రూపాయలు ఉండేది. సాయంత్రం గుడి ఆవరణలో, హైస్కూలు మైదానంలో ఆడుకోవటంతో
పాటు గ్రంథాలయంలో కొద్దిసేపు గడపటం దినచర్యగా ఉండేది.

అలా మొదలైన అలవాటు అమెరికా వచ్చినా వదల్లేదు. అప్పుడప్పుడు సమయం దొరికినంత మేరకు గ్రంథాలయానికి వెళ్లవలసిందే. నేను చూసిన, నివసించిన ప్రతి పట్టణంలో లైబ్రరీ తప్పక ఉంది.

మా వూరి గ్రంథాలయం మూయబడుతు, మళ్లీ తెరవబడుతూ కొన ఊపిరిరో కొట్టుమిట్టాడుతుంటే, అమెరికాలో లైబ్రరీలు మాత్రం ప్రభుత్వ, ప్రజల సహాయంతో, ప్రోత్సహంతో కాలానుగుణంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ సంచిక ముఖచిత్రంపై ఉన్న ఫోటోలు ప్రస్తుతం నేను ఉంటున్న ఊరు లైబ్రరీ లోనివి. ఈ వూరి జనాభా 70 వేలు మాత్రమే.

బడి అయిపోగానే పిల్లలు ఇక్కడకు రావచ్చు. హోం వర్కు చేసుకోటానికి సహాయం అందుతుంది. చదువుకోటానికి ప్రత్యేకంగా గదులుంటాయి. వేసవి సెలవుల్లో పుస్తక పఠనం, చిత్రలేఖనం, కథలు చెప్పటం, కవిత్వ రచన పోటీలు ఉంటాయి. ఇవన్నీ లేకుంటే పిల్లల్లో పఠనాసక్తి తగ్గి తిరిగి బళ్ళు ప్రారంభమయ్యాకా చదువుల్లో వెనుకంజ వేస్తారని నిపుణుల ఆబిప్రాయం. ఇంగ్లీషు మాతృభాష కానివారు ఇంగ్లీషు మాట్లాడంలో శిక్షణ ఇస్తారు. కంప్యూటర్ క్లాసులు కూడా ఉంటాయి. సభ్య్తత్వం మొదలు అన్ని సౌకర్యాలు ఉచితమే.

అమెరికాలో గ్రంథాలయాలను దేవాలయాలుగా పరిగణిస్తుంటే మరి భారతదేశం సంగతి? నాకు తెలిసినంత వరకు అవి మూతబడుతున్నాయి లేదా సరైన పోషణ లేక వెలవెలబోతున్నాయి. తరగతి పుస్తకాల్లో రాసింది చదివి, మార్కులు, ర్యాంకులు కొట్టేయటమే విజ్ఞామనుకుంటే మనం పెద్దతప్పు చేస్తున్నట్టే. ప్రతి ఊళ్లో, పట్టణంలో గుళ్లతో బాటూ గ్రంథాలయాలు వెల్లివిరుస్తాయని ఆశిద్దాం.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)