ఈ మాసం సిలికానాంధ్ర
అమెరికాలో అన్నమయ్య 607 వ జయంతి






ప్రప్రథమ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుల 607 వ జయంతి మహోత్సవాన్ని కాలిఫోర్నియాలోని సన్నివేల్ లో సిలికానాంధ్ర శనివారం అత్యంత వైభవంగా నిర్వహించింది. ఉదయం 8 గంటలకల్లా స్థానిక ప్రభుత్వం అన్నమయ్య జయంతి నగర సంకీర్తన నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ వేదిక పరిసరాలలో వాహనాల రాక పోకలను నిలిపివేసింది. సిలికానాంధ్ర కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో సంగీత విద్వాంసులు తెలుగు సంప్రదాయ వస్త్రాలను ధరించి దివ్య రధాన్ని పుర వీధులలో ఊరేగించారు. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను అద్భుతంగా అలంకరించిన రథంపై ప్రతిష్టించి పూజలు చేసారు. అన్నమ్మయ్య నిలువెత్తు చిత్రాలను ఊరేగింపు అగ్రభాగాన ప్రదర్శిస్తూ అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తూ రథోత్సవం ముందుకు సాగింది. అనంతరం జరిగిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంలో సన్నివేల్,ఫ్రీమాంట్ ,శాన్ హోసే ,శాంతా క్లారా తదితర నగరాలకు చెందిన తెలుగు వారితో పాటు తమిళులు, కన్నడిగులు సకుటుంబంగా పాల్గొని అన్నమయ్య కీర్తనలను గానం చేసారు. తర్వాత రోజంతా అనేక సంగీత శిక్షణా సంస్థలు ,గురువుల వద్ద సంగీతాభ్యాసం చేస్తున్న బాల బాలికలు అన్నమయ్య కీర్తనలను గానం చేయగా పలువురు నర్తకీమణులు అన్నమయ్య కీర్తనలపై అభినయించారు. భరత నాట్యం, ఒడిస్సీ, మోహిని అట్టం, కూచిపూడి నర్తన రీతులలో అన్నమయ్య సంకీర్తనాభినయం ప్రత్యెక ఆకర్షణగా నిలిచింది. నీహారిక, మధురి కిషోర్, బిందు, దీప మహదేవన్ తదితర నర్తకీమణులు అన్నమయ్యకు నృత్య నీరాజనం అందించారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్, దిలీప్ కొండిపర్తి, ప్రస్తుత అధ్యక్షులు సంజీవ్ తనుగుల, రత్నమాల వంకా, మృత్యుంజయుడు తాటిపాముల, రవీంద్ర కూచిభొట్ల, ప్రభ మాలెంపాటి తదితరులు పాల్గొన్నారు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)