తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టతనాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిస్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.


 

విశిష్ట ధాతుసాధన శాస్త్రజ్ఞుడు - పద్మ విభూషణ్ ఆచార్య డాక్టర్ పల్లె రామా రావు

భారత కేంద్రం ప్రభుత్వం డాక్టర్ పల్లె రామా రావు గారిని దేశ " నేషనల్ మెట్లర్జిస్ట్ " గా (ధాతుసాధన శాస్త్రజ్ఞుడిగా) గుర్తించింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ " లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు " అందుకున్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ మెటీరియల్స్ (ఏ ఎస్ ఎం), " విశిష్ట జీవిత సభ్యత్వ " పురస్కారం అందించింది. ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయుడు - ఆచార్య పల్లె రామా రావు గారు. భారత ప్రబుత్వం - పద్మశ్రీ, పద్మ విభూషన్ గౌరవాలు అందుకున్న విశిష్ట, యోగ్య ధాతుసాధనా శాస్త్రవేత్త పల్లె రామరావు గారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ మెటీరియల్స్ (ఏ ఎస్ ఎం) సంస్థ " విశిష్త జీవిత సభ్యత్వ " పురస్కారం పొందిన తొలి భారతీయుడు. భారత దేశ అత్యుత్తమ శాస్త్రవేత్తలలో ఒకరు.
డి ఆర్ డి ఓ, కేంద్ర అణు ఇందన సంస్థలలో కీలక పాత్ర నిర్వహించారు; ఈ శాఖకు అనుభందమైన " అంటీ టాంక్ అమునిషన్ " ప్లాంట్ నెలకల్పనలో, "సేఫ్ టీ రిసర్చ్ ఇంటిట్యూట్ (కల్పక్కం) స్థాపనలో కీలక పాత్ర పోషించారు; భారత దేశ ప్రయోజనాలు సమకూర్చారు. " నేష్నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ " ప్రతిష్టాపనలో ప్రధాన పాత్ర పోషించారు. " సర్ఫేస్ టెక్నాలజీస్ ", " అత్యంత ఉష్ణోగ్రత కలిగిన సెరమిక్ పదార్ధాల ఆధారముతో ధాతు, మిశ్రధాతువులతో రూపొందించే " ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రిసర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెట్లర్జీ అండ్ న్యు మెటీరియల్స్ " సంస్థ నెలకొల్పారు. ఇలాటి అపూర్వ ఘట్టాలను తన సుదీర్ఘ ప్రవాసంలో సాధించారు - డాక్టర్ పల్లె రామారావు గారు. ఈ సంస్థలు భారత దేశానికి క్షేత్ర రంగం సంపదలుగా నిలిచాయి.

బాల్యం, చదువు, ఉద్యోగం, కుటుంబం

1937 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, కర్నూల్ లో జన్మించారు. వీరి తండ్రి, కర్నూల్ బార్ లో ప్రముఖ న్యాయవాదిగా ఉండే వారు. కట్టు దిట్టాలు, నియమ నిష్టలు ఉన్న బ్రాహ్మణ కుటుంబం; డబ్బు ఉన్నా డాబు లేదు; విలువ తెలుసు; " దుబారా " ఎరుగరు. క్రమశిక్షణ చిన్న తనం నుండి అలవాటైంది. కర్నూల్ మునిసిపల్ హై స్కూల్ లో తెలుగు మాధ్యమం లో చదివారు. తన పదనాల్గవ ఏడు నిండకండా ఎస్ ఎస్ ఎల్ సి పరీక్షలు ఉతీర్నులై, బెంగళూరు లోని సెంట్ జోసెఫ్ కాలేజిలో చేరారు. ఇది వీరి జీవితానికి ఒక దిశామార్గం ఇచ్చింది. తరువాత మద్రాసు లోని ప్రెసిడెన్సి కాలేజిలో బి ఎస్ సి (భౌతిక శాస్త్రం) పట్టా సాధించి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రప్రధముగా (1956) లో ప్రారంభించిన ఎం ఎస్ సి - అణు భౌతిక సాస్త్రం (న్యుక్లియర్ ఫిజిక్స్) డిగ్రీ పూర్తి చేసి ప్రతిష్టాత్మకమైన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి (1964) నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. అమెరికా పెన్సల్వేనియా విశ్వవిద్యాలయం లో మెటీరియల్ సైన్స్ లో పోస్ట్ డాక్టరల్ రిసర్చ్ నిర్వహించారు. ఈ తరుణంలో ఎల్ ఆర్ ఎస్ ఎం (తిన్ ఫిలంస్) లో ప్రయోగాలు చేశారు.

బి హెచ్ యు లో ధాతుసాధనా శాస్త్ర ఆచార్యుడిగా ఉన్న టి ఆర్ అనంతరామన్ గారితో ఏర్పడ్డ పరిచయం రామారావు గారి జీవితానికి ఓ కొత్త మళుపునిచ్చింది. డాక్టర్ రామా రావు గారు ఇక్కడ ఫిజిక్స్ ఆఫ్ మెటల్స్, డిస్లొకేషన్ థీరీ, మెకానికల్ బిహేవియర్ ఆఫ్ మెటల్స్ అండ్ మెటల్ ఫామింగ్ అంశాలు బోధించారు.

కొంత కాలం ఐ ఐ ఎస్ సి (బెంగళూరు) లో పనిచేశారు. తరువాత వారణాశి లోని బి హెచ్ యు, ధాతుసాధనా విభాగంలో (1975-82) ఆచార్యుడిగా పనిచేశారు. అటుపిమ్మట హైద్రాబాదులోని డి ఎం ఆర్ ఎల్ సంస్థ సంచాలకుడిగా ఉన్నారు. ఆతరువాత భారత ప్రభుత్వ సాంకేతిక కార్యదర్శిగా పనిచేశారు. అటామిక్ ఎనర్జి రెగ్యులేటరీ సంస్థ అధ్యక్షుడిగా, హైద్రాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ఉప-కులపతిగా పనిచేశారు. ఇస్రో - విక్రం సారాభాయి విశిష్ట ఆచార్యుడిగా ఉన్నారు. ఏ సి ఆర్ ఐ కార్యనిర్వాహక పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నారు.
డాక్టర్ రామారావు గారి భార్య రేఖ; వీరికి ఇద్దరు పిల్లలు - కొడుకు నరేంద్ర (పాలో ఆల్టొ, కాలిఫోర్నియా), కూతురు సుమన్ (న్యు జర్సీ).

డాక్టర్ రామారావు గారు శాస్త్ర, సాంకేతిక సంస్థలకు తన వంతు సహాయం అందిస్తున్నారు. హైద్రాబాదులో టి ఆర్ అనంతరామన్ ఎడ్యుకేషనల్ అండ్ రిసర్చ్ ఫౌండేషన్ సంస్థ నెలకొల్పి దాని అభివృద్ధికి పాటుపడుతున్నారు.

రామారావు గారి కృషి - సాధించిన ఫలితాలు:
డాక్టర్ రామారావు గారు, ఐదు దశాబ్దాల పాటు చేసిన అవిరళ కృషితో భారత దేశం కీలకమైన మిశ్ర ధాతుసాధనా శాస్త్ర క్షేత్రాలలో ఎంతో ముందజ వేసింది. హెవీ అల్లోయ్ పెనిట్రేటర్ ప్లాంట్, ఏ ఆర్ సి ఐ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వీరందించిన మాణిక్యాలే. ఇవి నేడు భారతావని సంపదలుగా నిలిచాయి అంటే దీనికి డాక్టర్ రామారావు గారే కారణం అంటే అతిసయోక్తికాదు. వీరి కృషి, మేధా సంపత్తి, దేశాభివృద్ధి కోసం పడ్డ శ్రమ స్లాఘనీయం.
వీరు నెలకొల్పిన సంస్థలు:
- హెవీ అల్లోయ్ పెనిట్రేటర్ ప్లాంట్ (తిరుచునాపల్లి, తామిళనాడు) - స్వదేశ సాంకేతిక నైపుణ్యంతో ప్రారంభించిన ఆర్డినెన్స్ కర్మాగారం)
- ఇంటర్నేష్నల్ అడ్వాన్స్డ్ రిసర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెట్లర్జీ అండ్ న్యు మెటీరియల్స్ (ఏ ఆర్ సి ఐ), హైద్రాబాద్
- నాన్-ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ (ఎన్ ఎఫ్ టి డి సి), హైద్రాబాద్
- నేష్నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (చెన్నై)
- సేఫ్టీ రిసర్చ్ ఇన్స్టిట్యూట్, కల్పాక్కం
- టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డ్ (టి డి బి), కొత్త ఢిల్లీ

అవార్డులు, పురస్కారాలు:
దాదాపు ఐదు దశాబ్దాలు విస్తరించిన వీరి క్షేత్రానుభందంలో 240 " పేపర్స్ " ప్రకటించారు. జాతీయ, అంతర్జాతీయ పత్రికలకి సంపాదకుడిగా వ్యవహరించారు.
ధాతుశాస్త్రం (మెట్లర్జీ) శాస్త్ర క్షేత్రంలో విశిష్ట సేవలకు గాను గుజర్ మల్ మోడి సైన్స్ ఫౌండేషన్ పురస్కారం (2010) అందుకున్నారు. తన సుదీర్ధ ప్రవాసంలో అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకున్నారు శ్రీ పల్లె రామారావు గారు. వీటిలో:

- రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ (బ్రిటన్), తర్డ్ వొల్డ్ అకాడమి ఆఫ్ సైన్సెస్ (ఇటలీ), యుక్రేన్ అకాడమి ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి, ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్సెస్, నేష్నల్ అకాడమి ఆఫ్ సైన్సెస్ లో ఫెల్లో గా ఉన్నారు.
- అధ్యక్షుడు, ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్సెస్
- ఇండియన్ నేషనల్ అకాడమి ఆఫ్ ఇంజినీరింగ్ - అధ్యక్షుడు
- ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు (1997-98)
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్, అధ్యక్షుడు (1990-91)
- మెటీరియల్ రిసర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా, అధ్యక్షుడు (1992-94)
- భారత అణు సంస్థ, అధ్యక్షుడు
- ఇంటర్నేష్నల్ యూనియన్ ఆఫ్ మెటీరియల్స్ రిసర్చ్ సొసైటీస్, ఉపాధ్యక్షుడు (2002-03)
- శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం (1979)
- భారత ప్రభుత్వ - పద్మశ్రీ (1989)
- పద్మ భూషన్ (2001)
- పద్మ విభూషన్ (2011)
- భారత ఉక్కు మంత్రిత్వ శాఖ, " లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు" (2009)
- గుజర్ మల్ మోడి ఫౌండేషన్ నుండి జి ఎం మోడి ఇన్నొవేటివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్, ప్లాటినం పతకం (1994)
- టాటా బంగారు పతకం (1992)
- హోమి బాబా పురస్కారం (1986)
- ఇండియన్ నేష్నల్ సైన్స్ అకాడమి (1996) " మెటీరియల్ సైన్స్ " పురస్కారం
- భారత ఉక్కు మంత్రిత్వ శాఖ," నేషనల్ మెట్లర్జిస్ట్ " పురస్కారం
- ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ " మిలీనియం ప్లాగ్ ఆఫ్ హానర్ " గౌరవం
- ఇండియన్ నేష్నల్ సైన్స్ అకాడమి " మేగ్ నాద్ సాహా మెడల్ " (2004)
- అమెరికన్ సొసైటీ ఆఫ్ మెటీరియల్స్ (ఏ ఎస్ ఎం), " విశిష్ట జీవిత సభ్యత్వ " పురస్కారం
- ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, " అషుతోష్ ముఖర్జీ మెమొరియల్ అవార్డు "

రామారావు గారు కనపరచిన విశేష కృషికి గాను భారత ప్రభుత్వం " నేషనల్ మెట్లర్జిస్ట్ " గౌరవం ఇచ్చింది. నిస్సంకోచముగా, డాక్టర్ రామా రావు గారు మేటి ధాతుసాధనా శాస్త్రజ్ఞుడు అని చెప్ప వచ్చు. మెట్లర్జీ క్షేత్ర రంగంలో అనేక విజయాలు సాదిస్తూ, దేశ ప్రయోజనాలను చేకూరుస్తూ, పరిపక్వం చేస్తున్న డాక్టర్ పల్లె రామారావు గారు భావితవ్యానికి స్పూర్తి గా నిలుస్తారు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech