- తల్లాప్రగడ రావు

ప్రధాన సంపాదకులు:
తల్లాప్రగడ రావు
సంపాదక బృందం:
తాటిపాముల మృత్యుంజయుడు
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
పుల్లెల శ్యామ్ సుందర్
అక్కుల కృష్ణ
శీర్షిక నిర్వాహకులు:
మువ్వల సుబ్బరామయ్య   
ప్రఖ్యా మధు
విద్వాన్ టి.పి.ఎన్.ఆచార్యులు      
ఈరంకి కామేశ్వర్
రాగధేను స్వరూప కృష్ణమూర్తి
జి.బి.శంకర్ రావు
గరికిపాటి నరసింహారావు
డా||బి.వి.పట్టాభిరాం
చొక్కాపు వెంకటరమణ
ఎం.వి.ఆర్.శాస్త్రి
చీకోలు సుందరయ్య
భండారు శ్రీనివాసరావు
తల్లాప్రగడ రామచంద్రరావు
తాటిపాముల మృత్యుంజయుడు
కూచిభొట్ల శాంతి
కస్తూరి ఫణిమాధవ్
అక్కుల కృష్ణ
వనం జ్వాలానరసింహా రావు
సరోజా జనార్ధన్
యండమూరి వీరేంద్రనాథ్
ముఖచిత్రం :
సేకర్త: అన్నమాచార్య సంకీర్తనోత్సవం
వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ
 

 

 

 

మరో గిన్నీసు రికార్డు

ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు!
అంతరాంతములు ఎంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు!

"పిండికొద్దీ రొట్టె అన్నట్లు" అని అంటూ ఈ కలియుగ వేంకటేశుని కీర్తించి తరించిన మన తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 602వ జయంతిని వైశాఖ పౌర్ణమి నాడు (భారత కాలమాన ప్రకారం మే 27, 2010) సిలికానాంధ్రులు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో సిలికానాంధ్ర నిర్వహించిన అఖండ సహస్ర సంకీర్తనార్చనలో దాదాపు వంద బృందాలు పాల్గొని తమ సంకీర్తనను 101 గంటలపాటూ నిర్విరామంగా కొనసాగించి గిన్నీసు బుక్కు కెక్కారు. గతంలో యూరప్‌లో 42 గంటలపాటూ సాగిన సామూహిక బృందగానాల రికార్డును సిలికానాంధ్రులు తమ అకుంటిత దీక్షతో అలవోకగా చేదించారు. సిలికానాంధ్రకు ఈ రికార్డుని ప్రకటిస్తూ గిన్నీస్ ప్రతినిధి అమాండా మోచెస్ సిలికానాంధ్రుల కార్యశీలతను, పద్దతులనూ నిబద్దతనూ అమితంగా ప్రసంశించారు.

ఒక ప్రక్క మన సంస్కృతి నిలబడుతోందన్న ఆనందం; మరొక ప్రక్క తెలుగువాడు గిన్నీసు బుక్కెక్కాడన్న ఆనందం; ఇంకొక పక్క భక్తిభావం పొంగి పరవళ్ళుతొక్కే ఉద్వేగం; అలాగే మరొక పక్క సంగీత సాహిత్య అభిరుచుల సంగమం; మన సాంస్కృతికసంప్రదాయ స్ఫూర్తిలోని ఆవేశం; ఒకప్రక్క అన్నికుటుంబాలు అలసి ఆనందంగా కలసి జరుపుకున్న పండుగ; మరొక ప్రక్క రాజకీయ అధికారిక ప్రతినిధుల సాన్నిధ్యం; అన్నీ ఆ వేంకటేశుని కొలువులో...  ఈ ప్రత్యేక ఎండాకాలపు రాజధానియైన విజయవాడలోనే!

ఒక పక్క రోహిణీకార్తె ఎండలు 50 డిగ్రీలు తాకుతున్నా, రాత్రిళ్ళు సైతం వేడి గాడ్పులు సాగుతున్నా, మరొక ప్రక్కన హాలులోని ఏసీ మిషినులు పనిచేయకున్నా, తమ మధురగానామృతవర్షిణితో భక్తులను పరవశంలో ముంచెత్తుతుంటే ఆ వేడిమి అస్సలు తెలియకుండా పోయింది. ఈ కార్యక్రమంలో 4000 వేలమంది గాయనీగాయకుల తో కూడిన 100 బృందాలు, 1000 పైగా అన్నమయ్య కీర్తనలను పాడి వినిపించారు. టిటిడి వారి సౌజన్యంతో స్వర పరచబడిన వేయి అన్నమాచార్యుల కీర్తనలను ముందుగానే ఈ బృందాలకు ఇవ్వడం జరిగింది. ఆయా కీర్తనలలో అనేక నెలలగా తర్ఫీదు పొందిన కళాకారులు వేదిక పై .... రాత్రనక పగలనక ... వారికి ఇచ్చిన నిర్దిష్ట సమయాలలో, దేశం నలు మూలల నుంచి తరలి వచ్చి, పాడి,.. ప్రేక్షకులను ఆనందింపజేసి, ఆ స్వామివారిని మెప్పించారు; అన్నమయ్యే గర్వపడేలా చేసారు; విజయవాడ పట్టణం తరించేలా రేయింబగళ్ళు పాడారు.   

ఇది సిలికానాంధ్ర సంపాదించిన 3వ గిన్నీసు రికార్డు. ఇలా సిలికానాంధ్ర మరెన్నో విజయాలను సాధించాలని, మరెన్నో రికార్డులను నెలకొల్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక వ్యక్తి సాధించగలిగిన విషయం కాదు. కాలేదు. అనేక స్థానిక సంస్థలు ఇచ్చిన ఆర్థిక హార్ధిక సహాయ సహకారాలతో పాటూ, అసలు నిద్రపోకుండా శ్రమించి పనిచేసిన స్వచ్చంద సేవకుల పాత్ర కూడా చాలా చెప్పుకోదగ్గవి. అనేక మంది స్థానిక కార్యకర్తలకు తోడు, పలువురు హైదరాబాదు నుంచి కూడా వచ్చి అహోరాత్రాలూ శ్రమించారు.  సిలికానాంధ్ర కేవలం నాయకత్వం వహిస్తే వీరందరూ అసలు ఏ పేరూ, డబ్బూ సంపాదించకుండా, ఏ ప్రలోభానికీ ఆశపడకుండా చేసిన ఈ ధార్మిక కర్తవ్యం కడు శ్లాఘనీయం. "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే వచ్చు" అని అనుకుంటే, పాపం చివరికి వీరికేమీ రాకపోవచ్చును;  కానీ,  ఈ గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులనే అసలు హీరోలుగా గుర్తించడం మన కనీస నైతిక కర్తవ్యం. ఈ గిన్నీసు రికార్డు వీరలకే అంకితం కావాలని కోరుకుందాం! ఇంకా క్రొత్త స్వచ్చందసేవకులు ఎందరో ఇలా మన కుటుంబంలో చేరాలని ఆశిద్దాం.


                 

ఇటీవల భాగ్యనగరంలో సుజనరంజని జరిపిన "రచయితల విశేష విశ్లేషణ సభ" దిగ్విజయంగా ముగిసింది. అనేకమంది స్థానిక కవులు/కవయిత్రులు, రచయితలు/రచయిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులు సుజనరంజని సంపాదక వర్గంతో కలసి చర్చలు జరిపారు. ఇందులో సుజనరంజని చేపట్టే కార్యక్రమాలనూ, నిర్వహించే శీర్షికలనూ, చర్చించి మున్ముంది ఎలాంటి శీర్షికలకు ప్రాధాన్యతను ఇవ్వాలో, భవిష్యత్ప్రణాళికలు ఎలా వుండాలొ అన్న వివరాలను విశ్లేషించారు. సి.కృష్ణగారు (హైదరాబాద్) నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపు 50 మంది రచయితలు హాజరయ్యారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సభలు నిర్వహించాలని సుజనరంజని కోరుకుంటోంది.

మీ

రావు తల్లాప్రగడ

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech