6   వ భాగం.                                                                                   

 

 

ఓం శ్వేతవర్ణా సముదిష్టా -కౌశేయ వసనా తధా
శ్వేతైర్విలేపనైః పుష్పై -రలంకారైశ్చ భూషితా
ఆదిత్య మండలస్థాచ-బ్రహ్మలోక గపాధనా
అక్షసూత్రధరా దేవి- పద్మాసన గతాశుభా


గాయత్రీ మంత్రంలోని 3 వ్యాహృతులు భూః భువః సువః ఈ వ్యాహృతులకే త్రికము అని పేరు.ఈ మూడు బ్రహ్మ యొక్క జ్ఞానదేహము నుండి వ్యవహరింపబడుటచే "వ్యాహృతులు"అని పేరు వచ్చింది. సృష్టి స్థితి లయాల శక్తుల పేర్లే ఈ 3 వ్యాహృతులు.భూః-బ్రహ్మః భువః-ప్రకృతి;సువః-జీవుడు. 3 లోకాలు ఈ వ్యాహృతులకు సంకేతం. అగ్ని, వాయువు, సూర్యులకు ఈ వ్యాహృతులు ప్రతినిధులు. అంతేకాదు. భూః-భూమి, భువః-ఆకాశం, సువః-స్వర్గంగా చెప్పబడ్దాయి.ఈ వ్యాహృతులను జపిస్తే వేదాలను చదివిన ఫలం అని చెబుతారు. అందువల్లనే గాయత్రీ మంత్రానికి చేర్చబడ్డాయి.అంటే గాయత్రీ సారం వ్యాహృతి త్రయం.

మూడు వ్యాహృతులే కాదు, సప్త వ్యాహృతుల ఉద్భవానికి గాయత్రి మూలం. పరమాత్మను చేరటానికి ఈ 7 వ్యాహృతులు సోపానాలు. మంత్ర జపానుష్టాన సమయంలో, సప్త వ్యాహృతుల స్పందన దేహంలోని 6 చక్రాలపై కలుగుతుంది.సర్వ వ్యాపకాలైన సప్త వ్యాహృతులు,సర్వ కర్మలందూ ఉపయోగించబడతాయి. ఈ క్రింది పట్టిక సప్త వ్యాహృతుల విశిష్టత, శక్తి తెలుపుతుంది.

వ్యాహృతులు దేవతలు లోకాలు షట్చక్రాలు ఛందస్సులు ప్రభావం
1.భూః అగ్ని భూ మూలాధారం గాయత్రి భౌతిక వికాసం
2.భువః వాయువు భువ స్వాధిష్టాన ఉష్ణిక్ ప్రాణాయామం
3.సువః సూర్యుడు స్వర్గ మణిపూర అనుష్టుప్ చిత్తవికాసం
4.మహః బృహస్పతి మహ అనాహత బృహతి బుద్ది వికాసం
5.జనః వరుణుడు జన విశుద్ఢ పజ్క మానసిక వికాసం
6.తపః ఇంద్రుడు తపో ఆజ్ఞా త్రిష్టుప్ ఆధ్యాత్మిక వికాసం
7.సత్య విశ్వదేవతలు సత్య సహస్రార జగతి పరమపదం

ఇక లోకాల వివరణ చెప్పాల్సి వస్తే
1.భూలోకం- పుణ్యపురుషులకు, మనుష్యులకు నివాస స్థానం. సుమేరువు ధ్యానస్థలం. సుమేరువు నందలి ఉద్యానవనాలు, మిశ్రవనం,నందనం, చైత్రరథం, సుధర్మ దేవసభ. సుదర్శనం పట్టణం. వైజయంతం రాజసౌధం.
2.భువర్లోకం- గ్రహాలు, నక్షత్రాలు, నిర్ణీత కక్షలో సుమేరువుపై తిరుగుతూ ఉంటాయి.
3.స్వర్గలోకం- ఈ లోకం ప్రజాపతికి చెందినది. సంకల్ప సిద్ధులైన దేవతల నివాసం. ఈ లోకం అప్సరసలకు కూడా నివాసస్థానమే
4.మహర్లోకం-ఈ లోకంలోని దేవతలు సర్వసమర్థులు, వెయ్యికల్పాలు ఆయుషుగా కలవారు.
5.జనోలోకం- ఇది బ్రహ్మలోకం. ఇక్కడ నివశించువారు భూతేంద్రియాలను వశం చేయగల సమర్థులు.
6.తపోలోకం-అధికమైన ఆయుషు గల జ్ఞానులు ఈ లోకవాసులు.
7.సత్యలోకం-ఈ లోకవాసులు అనికేతులు. ఆత్మ ఏ ఆశ్రమంగా కలవారు. ప్రకృతిని వశం చేసుకొని,సృష్టి ఉండేంతవరకు జీవించి ఉంటారు.

ఈ మూడు వ్యాహృతుల ముందు 3 ప్రణవములు, చివర ప్రణవం, మంత్రానికి ముందు, చివర ప్రణవములు- మొత్తం ఆరు. ఈ గాయత్రీ మంత్రం షడోంకార గాయత్రి. ఈ మంత్రోపాసన చేసిన సమస్త వాజ్ఞ్మయము గ్రహింపగును. కానీ, ఈ ఉపాసన బ్రహ్మచారులు, గృహస్థులు చేయకూడదు.

గాయత్రీ మహా విజ్ఞానం
ఓం పరమాత్మ స్వరూపం
భువః - కర్మయోగం
భూః -ఆత్మజ్ఞానం
తత్ - జీవన విజ్ఞానం
సువః-స్థిర యోగం
వరేణ్యం-శ్రేష్ఠమైన
సవితం- శక్తి సంపుటి
దేవస్య-దివ్య దృష్టి
భర్గో-నిర్మలమైన
ధియో-వివేకం
ధీమహి-సద్గుణాలు
ప్రచోదయాత్-సేవ
యోనః-సంయమనం


గాయత్రీ మంత్రంలోని 9 పదాలు నవరత్నాలు. 18 విద్యలలో మీమాంస శ్రేష్ఠమైనది. మీమాంస కంటే తర్కశాస్త్రం కంటే పురాణాలు, పురాణాల కంటే ధర్మశాస్త్రం గొప్పది. వేదాలు ధర్మశాస్త్రం కంటే గొప్పవైతే, ఉపనిషత్తులు వేదాలు కన్నా ఉత్తమమైనవి. గాయత్రీ మంత్రం,ఉపనిషత్తుల కంటే అత్యంత శ్రేష్ఠమైనది.

 

 

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech