"సమస్యాపూరణం:

క్రింది "సమస్యని" అంటే వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు -మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com)  ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు జూన్ 20 తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము

 

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

 

ఈ  మాసం సమస్యలు

తే.గీ.|| దొంగ చేతిలొ తాళాలు బెంగలేదు

కం.|| నారద భక్తిని భరించు నారాయణుడే 

 

క్రితమాసం సమస్యలు

ఆ.వె.|| రక్తిలేనిభక్తి ముక్తినియదు!

కం.|| తెలుగుతమిళ భాషలందు తీపుయు జచ్చెన్!

 

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

 

మొదటి పూరణ -  గండికోట  విశ్వనాధం హైదరాబాద్ ప్రస్తుతం: సేంజోస్ , ( కాలిఫోర్నియా )

ఆ.వె.|| గుళ్ళు గోపురాలు గొప్పగా తిరుగుచు
గంగ లోన మునుగు నంగనాచి! 
భావమందు దేవ దేవుని యందను 
రక్తి లేక భక్తి ముక్తి నిడ(య) దు.

 

రెండవ పూరణ - యం.వి.సి.రావు, బెంగుళూరు,

ఆ.వె.|| భక్తి భక్తి యనుచు బహు వేష ధారులై

వనిత విత్త బ్రాంతి వదలరైరి

ఆచరింపలేని అతి భోధలేల, వి

రక్తి లేని భక్తి ముక్తి నియదు

 

కం.||    తెలుగే సరిగా నేర్వని

బాలుర కదనంబు తమిళ భాషను రుద్దన్

పిల్లల దుస్తితి గాంచగ

తెలుగు తమిళ భాషలందు తీపియు జచ్చెన్

 

మూడవ పూరణ -    టి.వెంకటప్పయ్య, సికిందరాబాద్

.వె||  అన్నమయ్య పొగడె కన్నెలనతిగాను

మీర బాయి వలపు మీరె భక్తి

కామి గాని వారు భూమిన లేరయ

రక్తి లేని భక్తి ముక్తి నియదు.

 

నాల్గవ పూరణ -    నేదునూరి రాజేశ్వరి , న్యూ జెర్సీ

ఆ.వె.|| పసిడి పూల పూజ చేసినా ఫలమేమి ?
                   పంచ భక్ష్య భోజ్య ఫలము  లివ్వ
                  జేరి కొలువ  దేవ ! తేరి జూడగ రావు !
                 రక్తి లేని భక్తీ ముక్తి నియదు !

 

కవిత : బంగారు పూలెన్ని పూజించి నా గాని
                  భక్ష్య భోజ్యా లెన్ని నివేదించిన గాని
,
                  అబర చుంబిత ఆడంబ రములె గాని
                  రక్తి లేని భక్తి ముక్తి నియదు
 

ఐదవ పూరణ- జగన్నాథ  రావ్  కె. ఎల్., బెంగళూరు

కం||    పలు పూలు పూయ, తియ్యని

ఫలములుగా మారునెన్ని? పర భాషలలో

ఫలమిచ్చు భాష యుండగ

తెలుగు తమిళ భాషలందు తీపియు జచ్చెన్

 

ఆ.వె.|| రక్తిలేని భక్తి ముక్తినీయగ లేదు

కామిగాక మోక్షగామి కాడు

స్వామి చేతినుండి జారిపడు విభూతి

స్వర్గ పురికి జేర్చు మార్గదర్శి

 

ఆ.వె.|| దొంగస్వామి ముందు వొంగి దండములేల

పాద పూజలందు భ్రాంతి యేల

రక్తిలేని భక్తి ముక్తినీయక పోదు

రక్తి దింపదా విరక్తిలోకి

 

ఆరవ పూరణ:  డా. అట్లూరి వెంకట నరసింహారాజు, ఏలూరు 

ఆ.వె.||యుక్త వయసులోని యువతిలా గాడాను
        రక్తి కలిగి సర్వ శక్తులొడ్డి
        ధవుని కొలిచి తుదకు తాదాత్మ్యమందును
       రక్తిలేని భక్తి ముక్తి నియదు
 

కం.|| కలగలపుతనముగల మన
               తెలుగు తమిళమును నేర్చి తీయని పదముల్
              
కలగలిపి పలుకుచుండగ
             తెలుగు తమిళ భాషలందు తీపియుజచ్చెన్
 

ఏడవ  పూరణ- పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే, కాలిఫోర్నియా

ఆ.వె.||భక్తి చిత్రమందు భామల కేబరే
                ఏమిటనుచు ఒకడు ఈసడించ
                దర్శకుండు నవ్వి తాత్పర్యముందెల్పె

                "
రక్తి లేని భక్తి ముక్తి నియదు"!! 

ఎనిమిదవ  పూరణ:  పి.సులోచన సింహాద్రి 

కవిత : వ్యక్తికి శక్తి యుక్తి లేనిదే రక్తి నీయదు
                  రక్తి యుక్తి లేనిదే భక్తినీయదుభక్తి
                  రక్తి లేనిదే ముక్తినియదు

 
     

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech