గీత రచన: రావు తల్లాప్రగడ

సంగీతం: సాయి మానాప్రగడ

ఈ గీతం వినడానికి:  
          (బటన్ నొక్కాక పాట వినడానికి అవసరమైతే కొంచెం వేచి ఉండగలరు)                                   

 

ఇటీవల సిలికానాంధ్ర నిర్వహించిన ఆంధ్రసాంస్కృతికోత్సవంలో ప్రియభారతం అనే నృత్యరూపకంలో, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ, వారి బాణీలపై తెలుగులో పాటలు కట్టి, వాటికి నృత్యరూపకలపన జరిపి, ప్రదర్శించడం జరిగింది. ఆ సంధర్భంగా ఈ పాటల సిడిని కూడా విడుదలచేయడం జరిగింది. ఇందులో ఒక పాట ఈ మాసం మీ ముందుకు తెస్తున్నాము.

గోవా / కొంకణీ బాణీలో జాలరుల పై ఒక పాట

 

పల్లవి

అతడు :   వలలు పన్నానే, ఎరలు కొన్నానే

              వలలు పన్నానే, ఎరలు కొన్నానే

              అరె వలలు పన్నా, ఎరలు కొన్నా, పడవ నెక్కానే

             అరొరె,వలలు పన్నా, ఎరలు కొన్నా, పడవ నెక్కానే

ఆమె :     జలము కన్నట్టి, జలజ నేనేరా,

            జలము కన్నట్టి, జలజ నేనేరా,

            అరె జలము కన్న, జలజ నేనే, వలొక లెక్కారా

            అరొరె జలము కన్న, జలజ నేనే, వలొక లెక్కారా

చరణం 1)

అతడు :  విదిలించుకు గతిపెంచుకు ఎక్కడ పోతావే

           ఝుళిపించుకు కడలంచున, ఎక్కడ నక్కావే!

ఆమె :    సోమరినువు, జాలరోడ తీరము చేరువలే

           ఎందుకులే పోయికూచో, అలుపు తీర్చుకో!

చరణం 2)

ఆమె :   అదుపెరుగను అలుపెరుగను ఈదుకు పోతాలే

          చిక్కనుమరి చుక్కెదురౌ చక్కని చుక్కనులే

ఆతడు : పొగరుబోతా తీరానికి తన్నుకు పోతాలే

          పట్టొదలని జాలరిగా మన్నన పొందానే

చరణం 3)

అతడు : వలతగలక చేపానువు ఎక్కడ పోతావే

           తెడ్డేస్తూ ఒడ్డొదిలా అడ్డేది నాకింకా

ఆమె :    బాగుంది నీవరస అల్లరి పిల్లోడా

           దేవుడిదయ శుభమంటూ అందరు బత్కాలె! 

 

 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech