చీకటిలో సాగిన మజాలు: స్వార్ధంలో దాగిన నిజాలు

 

గండికోట విశ్వనాధం, హైదరాబాద్.

                       

అర్ధరాత్రి అయిదంతస్తుల అప్సరాలో
              
సెక్సురాణి కాబెరా నగ్న నృత్య గోల
        
పొగచూరిన పూరిపాకలో
        
నిత్య పస్తుల బక్క జీవుల వికృత మృత్యు హేల 


              
మొదటిదానికి మొగుడు లేకున్నా
              
కడదాని కళ్యాణ లగ్నం- కట్న లోపంతో
              
భగ్నమైన వైనంలో బందుగుల బుక్కా కేళీ
                   
హై స్టేక్ కట్ జోకర్ ఆటలో
                  
సర్వస్వం స్వాహా చేసిన సామి
                  
చితిమంటల ముందే రాబదుల రెక్కల హోరు
        
        
అవినీతి భూ కబ్జాలో అదిరే, కళ్ళు చెదిరే
        
నడుమంత్రపు సిరిసంపదల 
        
సిరి సిరి మువ్వల సవ్వడి
               
అసెంబ్లీ బూతుల  భాగోతంలో
               
శృతి మించిన రాగాలాపనలతో 
                
ఖండన మండనల తిట్లూ, శిఖ పట్లూ 

                                      
                "
కామి గాక మోక్ష గామి కాడు" అన్న మహోపదేశ మంత్రం
                 
నిత్యానందమయంలో రసరంజిత సుందర స్వప్నం
                       
మాటల్ని, వేషాల్ని నమ్మే వారుంటే 
                        
నట్టేట  ముంచితే తప్పేమిటి? అన్న మోసకారి
                      
నిజమైన సందేశ తంత్రం, వృధా పోని నిత్య నూత్న యత్నం 

              నీ సీమ దాటి మా సీమ కొచ్చినా
             
వాగినా, ఓదార్చినా, సినీమా యేసినా
             
అడ్డుతాం, ప్రాణాలొడ్డుతాం అని హూంకరించే 
             
అహంకార నాయకుల చాలెంజీల  బొనంజా

                    అంతులేని కధనాల  టి.వి. టిప్పులు
                   
చింత లేని నాయకుల ఠీవి ట్రిప్పులు
                    
గొంతు  విప్పలేని జీవుల కోటి తిప్పలు
                   
కొంత యైన ఘాతుకాలపై కొట్టిన డప్పులు
                   
చోద్యానికి మరచిన ఆకలి దఫ్ఫులు
                    
చెప్పాలంటే చాలా వున్నయ్ చెప్పడానికి మరొకప్పుడు
                  
                    
చీకటిలో సాగిన మజాలు
                    
స్వార్ఢంలో దాగిన నిజాలు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం