ర్స్ డే

జగన్నాథ రావ్  కె. ఎల్

 

మన యింటికి
నడిచొచ్చిన
అభిమానపు
ప్రతిరూపము
సిరిసిరి మువ్వా!

పసికందుకి
స్థనమిచ్చిన
తన తల్లియె
కుల దైవము
సిరిసిరి మువ్వా!

తొలి మాటలు
పలికేనని
అమ్మా యని
పిలిచేనని
మనసారగ
మురిసిపోవు
సిరిసిరి మువ్వా!

కనురెప్పగ
కాచుకొనే
తన రెక్కలొ
దాచుకొనే
సిరిసిరి మువ్వా!

పలు జన్మల
అనుబంధము
ఆ దేవుని
తొలి కానుక
సిరిసిరి మువ్వా!

శ్రీరాముని
తల్లియైన
శ్రీకృష్ణుని
తల్లియైన
గుండె లోతుల
తొంగి చూచు
సిరిసిరి మువ్వా!

తలకు జడలు కట్టె
అమ్మలేని శివునికి
విషము మింగనిచ్చేనా
అమ్మ వుంటె శివునికి?
సిరిసిరి మువ్వా!

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం