రాజ గోపురం 

జగన్నాథ రావ్  కె. ఎల్

 

 

 

26 మే 2010 శ్రీ కాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో రాజ గోపురం కూలిపోయినపుడు

ఆ.వె.||     గాలి గోపురమును గాలికొదిలినారు
   
పాలకులగు వారు మేలుకొనక
   
కాల గర్భమందు కలిసిపోయెను గదా
   
నేల మట్టమగుచు కూలిపోయి   

ఆ.వె.||    చేవ తగ్గిపోయె శ్రీ కాళహస్తీశ!
   
ప్రకృతి వైపరీత్య పడగ నీడ
   
ఓం నమశ్శివాయ ఓంకార ధ్వనియు
   
శిధిల గోపురమును చేరలేదు

కం||    మేమిక రక్షణ చేయగ
   
లేమిక గోపురము వాయు లింగేశ శివా!
   
క్షేమము కాదీ జాప్యము
   
ఏమని రాయలకు బదులునివ్వగ వలయున్

 

 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం