నవరసాలు

 శ్రీపతి బాలసరస్వతి

 

(1)శృంగారము
(2)కరుణము
(3)వీరము
(4)రౌద్రము
(5)భయానకము
(6)హాస్యము
(7)బీభత్సము
(8)అద్భుతము
(9)శాంతము


(1)శృంగారము:
శారము వర్థ నమ్మిచట సామము సారము ఆది నుండి శృంగారము,జాగరూకులుగ,గాయకము గ్రహణమ్ము చేయుచున్ ధారణలోన నుండవలె ధాత్రిని మానవులందరున్ సదా ఆరజమొందుచుండవలె ఆరగ నుత్తమ జీవనంతయున్
(2)హాస్యము:
వాయిని మంచిగా ఉంచిచి వాదనమానుచు మానిసి యుండగన్ రాయిని మెత్తజేయ గల రాగము వంచుచు అంతటంతటన్ హాయిని యిచ్చునెప్పుడును హాస్యము చక్కగ దేహమంతటన్ దోయిగమానసమ్మునకు దోహలమింపుగ ధాత్రినంతటన్
(3)కరుణము:
సరుగగ జేయి ఈ భువిని మానవ జన్మను మెచ్చురీతిగన్ అరుదుగ వచ్చు జన్మమిది అంతరముగ ప్రతి జీవియందునన్ కరుణ జూపు అర్హతను, గాంచుచు, నిండైన హృదయమ్మునన్ తెరువును జూపు అన్నిటను తెల్లగ భావితరమ్మువారికిన్
(4)వీరము:
విక్కుచునుండు వీరమును విజ్ఞులు ఉందురెప్పుడున్ అక్కునజేర్చి దీనులను అక్కజమొందగ నందరందరున్ ఎక్కువ జూపు వీరమును ఎప్పుడు హీనుల రక్షణకై, చిక్కులు వేకవాడవలె చిక్కగ భావములంచు నీధరన్
(5)రౌద్రము:
తంద్రము వీడి మానవుడు తారును మాయను దాటుచున్ యిత్య సాంద్రమువున్న పల్కులను సంబరమొందగ పల్కుచున్ సదా రౌద్రము మాపుమంచు,మది,రౌరవమున్ కడు దవ్వునన్నిడన్ రుద్రుని పూజ చేయ, మది, రూఢిగ నిండును మంచి యోచనల్
(6)భయానకము:
అండగలేక పెద్దలును అక్కిలి చెందుచు ఇక్కడుండగన్ ఉండగలేక చిన్నలును ఊగుచునుండగ అక్కడక్కడన్ చూడగనే భయానకము చుట్టుగ చుట్టెడి ఈ పరిస్థితిన్ కూడగ జేయుమా అనుచు కూయగవేల్పుగ, మేలు చూడుమా
(7)బీభత్సము:
మత్సరమున్న దిన్నిలుపు మానిసి యుండిన ధాత్రిలోన బీభత్సము పుట్టునంతయును,భంగపడున్భువిన్భద్ర మూర్తువే కుత్సిత బుద్ధి వీడుచును కుందుచు వేల్పును వేడుకొన్నచో ఉత్సవమంత దీవిగను ఉత్సుకులందరు చేయవూనులే
(8)అద్భుతము:
అక్కడనుండి వింతగను అంకుడు చేసెడి సృష్టినంతటిన్నిక్కడ చూడగా కలుగు నిష్టము నింపును అద్భుతమ్మునన్ ఎక్కడ నున్నగాని యిది ఎంచగనద్భుత మద్భుతమ్మె, ఈ చక్కన నెందునన్ గనగ జాలము మానవ జన్మలోనె, కా
(9)శాంతము:
శాంతము యున్నచో మదిని, శాలలునిండువే ప్రశాంతమీ ప్ర్ర్రాంతము అంతయున్ వినుల పాటలో వెలుగొందునిత్యమున్ వింతగలోక మంతయును విత్తము గానగు సృష్టిలోపలన్ అంతటి భాగ్యమున్ మనిషి అంతయు నంతటనిల్పుకోవలెన్

ఆర్యులు చెప్పు నీతులను ఆరడిపోవగ చేయుచున్ యిలన్ సారము పోవగా,కనుము, సృష్టిరహస్యమెఱుంగ కన్సదా భర్తగ నేను ఎక్కువని భారము మోసెడివాడనంచు,జె భార్యగ నీవు తక్కువని భంగము పొందగ మాటలాడుచున్ భార్యయు నేను గొప్పనుచు భర్తకు భావమెరుంగచేయగన్ తీరము చేరలేకనయె తీరును చూపుము భార్య, భర్తకున్ దార్ష్ట్యము చూపు వారలకు ధర్మము బోధన చేయుచున్ ఇదే ఇర్వురు ఒక్కటే అనుచు ఈవల సాకుము పిల్లలన్ ప్రభూ.
 


 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం