శీర్షికలు

తెలుగు తేజోమూర్తులు

- నిర్వహణ : ఈరంకి వెంకట కామేశ్వర్    


 

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టతనాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగు వారెందరోఉన్నారు.

వాళ్ళు ఎదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి,  సాధన, కనపరచిన పరకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాంటి విషయాలను పరిశీలించి, సమీకరించి, పొందుపరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.


సౌర్య కిరీటి - ఆశోక చక్ర కరణం వర ప్రసాద్ బాబు

గ్రే హౌండ్స్ సైనిక దళం సీ ఐ గా పనిచేస్తూ ఛత్తీస్ గఢ్ వన్యారణ్యంలో మావో వాధులతో భీకర పోరు సాగిస్తూ, తొమ్మిది మందిని మట్టు పెట్టి, తన దళం లోని పద్నాల్గు మందిని హెలికాఫ్టర్ ఎక్కించి, తనతో ఉన్న మీగతా నలుగురినీ కాపాడి, సుమారు రెండు వందల మంది మావోయిస్టుల ముందు ఎదురొడ్డి నిలచి, అసాధారణమైన దైర్య సాహసాలు కనపరచి, తన ప్రణాలను అర్పించిన సాటిలేని మేటి వీరుడు కరణం వర ప్రసాద్ బాబు. విధి నిర్వహణలో అసామాన్యమైన ధైర్య సాహసాలను కనపరినందుకు భారత ప్రభుత్వం నుండి అత్యుత్తమ సైనిక పురస్కారం " అశోక చక్ర " అందుకున్నారు (మృత్యువు తరువాత వీరికి ఈ గౌరవం ఆపాదించారు). ఈ తరహా విశిష్ట గుర్తింపు పొందిన ప్రప్రధమ తెలుగు తేజం శ్రీ కరణం వరప్రసాద్ బాబు గారు.

బాల్యం, చదువు, ఉద్యోగం:

వరప్రసాద్ బాబు గారు అతి సామాన్య మైన కుటుంబం నుంచి వచ్చారు. వీరి తండ్రి కరణం వెంకట రమణైయ్య విశ్రాంతవాసి; రెటైర్డ్ కాన్ స్టేబుల్. విజయనగరం ఐదవ బెటాలియన్లో పనిచేశారు. తల్లి సత్యవతి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, విశాఖ జిల్లా, మార్టూరులో జన్మించారు. నాలుగు గదుల ఇల్లు. మార్టూరు, అనకాపల్లి లో చాలా మంది పరిచయస్తులున్నారు. హరి బాబు కి ఇద్దరు సోదరీమణులు. ప్రాధమిక చదువంతా అనకాపల్లి లోనే పూర్తి చేశారు వర ప్రసాద్ బాబు గారు. ఆయన పూర్తి పేరు కె ఎల్ వి ఎస్ ఎస్ ఎన్ వర ప్రసాద్ బాబు అంటే కరణం లీల వెంకట శ్రీనివాస శ్రీ హరి నాగ వర ప్రసాద్ బాబు.

ఈయన్ని అందరూ ఆప్యాయంగా హరి బాబూ అని పిలుస్తూ ఉండే వారు. ఎం ఎస్ సీ (గణితంలో) పట్టా అందుకున్నారు. తరువాత గ్రే హౌండ్స్ రక్షక దళంలో 2004 లో రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ గా చేరారు.

అది ఒక భీకర పోరు:
ఛత్తీస్ గఢ్ రాష్ట్ర సుక్మా జిల్లాలోని వన్యారణ్యంలో మావోయిస్టులను మట్టు పెట్టే ప్రయత్నం. దాదాపు రెండు వందల మంది మావోయిస్టులను ఎదుర్కోవాలి. పంతొమ్మిది మంది గ్రే హౌండ్స్ రక్ష దళం దాడి నిర్వహించడానికి సర్వ సన్నద్ధులైయ్యారు.

హెలికాఫ్టర్ వచ్చినప్పుడు పద్నాలుగు మంది ఎక్కారు. మావోయిస్టులు కాల్పులు జరపడంతో హుటా హుటినా ఎగిరి పోయింది. మిగతా ఐదుగురు మావోయిస్టుల తూటాలకు ఎదురు దాడి చేయడానికి ఉపక్రమించారు. తనతో ఉన్న నలుగురినీ దక్షిణం వెంపు వెళ్ళవలసిందిగా చెప్పి తానొక్కడే మావోయిస్టుల తూటాలకు ఎదురొడ్డి నిలచి, 16 ఏప్రిల్ 2013న అసువులు బాసారు. తనతో ఉన్న నలుగురినీ రక్షించి తన నాయకత్వ పటిమను చాటారు. కరణం వరప్రసాద్ గారు కనపరచిన దైర్య సాహసాలను అసాధారణమైన కర్తవ్య నిష్ట కనపరిచినందుకు భారత ప్రభుత్వం వరప్రసాద్ గారికి అత్యున్నత సైనిక పురస్కారం " అశోక చక్ర " అందించింది గుర్తించింది. ఈ అత్యుత్తమ పురస్కారం లబించిన తొలి తెలుగు బిడ్డ శ్రీ వరప్రసాద్ గారు.

మరణాంతరం వీరికి అత్యున్నత సైనిక పురస్కారాన్ని వీరి తండ్రి వెంకట రమణైయ్య గారు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.

చిన్న వయస్సులో అమరుడయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో పాటు ఈ తెలుగు వీరుడికి వందల మంది జనం, మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు అంతిమ వీడ్కోలు పలికారు. హరి బాబు గారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయినా వారి సౌర్య ప్రతాపాలు రానున్న తరాలవారికి స్పూర్తి దాయకం. వరప్రసాద్ గారు అసలు సిసలైన " హీరో ".


 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)