సుజననీయం

- తాటిపాముల మృత్యుంజయుడు


 

సంపాదకవర్గం:

ప్రధాన సంపాదకులు:
తాటిపాముల మృత్యుంజయుడు

సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
చెన్నాప్రగడ కృష్ణ

సాధనమున పనులు సమకూరు...

ఈ సంచికలోని కవితలో డా. రాళ్ళబండి కవితాప్రసాద్ అక్షరానికి ధ్వని ఉండి, ఆ ధ్వని వల్ల ప్రాణం, ఆ ప్రాణం వల్ల జీవితం వస్తుందన్నారు. కాబట్టి కవిత్వంతో జీవన సౌందర్యాన్ని అనుభవిద్దామన్నారు. మరి అఖండమైన అన్నమయ్య సంకీర్తనా సాహిత్యమో? ఆ కీర్తనల జలధారలో అమృతం రుచి దొరుకుతుంది. ఆ సాహిత్య సరోవరం అలలలో సప్తస్వరాలు శ్రవణాలకు విందు చేస్తాయి.

జూన్ 24న జరిగిన అన్నమయ్య జయంత్యుత్సవ సంగీత గాత్ర పోటీల్లో చిన్నారులు కనబర్చిన ప్రావీణ్యత అమోఘం. అమెరికా దేశ పౌరులమైనా, మాకు తెలుగంటే ప్రాణం. సంగీతమంటే ప్రీతి. మేము పిల్లలం మాత్రమే కాము, పిడుగులం, సిసింద్రీలం అన్నట్టుగా పోటాపోటీగా తలబడ్డారు. గురుముఖంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకునే ఈ పిల్లలు కర్ణాతక సంగీతంలోని స్వర, రాగ, తాళ గతులతో విన్యాసం చేసారు. ఈ సంచికలోని దృశ్యమాలికలో రెండు వీడియోలను తప్పక చూడండి.

అలాగే, అక్కిరాజు సుందరకాండ, జగ్గీ వాసుదేవ్ సద్గురువాణి, వేమూరి రసాయనసాస్త్రం, మందపాటి సత్యమేవ జయతే మున్నగు శీర్షికలు, ఇంకా మరెన్నో మంచి రచనలు తప్ప చదవండి. మీ అభిప్రాయలు తెలపటం మర్చిపోకండేం!

ఇట్లు,
తాటిపాముల మృత్యుంజయుడు

   

 

 

 

 

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)