ఈ మాసం సిలికానాంధ్ర


 

వైభవంగా జరిగిన అన్నమయ్య 606వ జయంత్యుత్సవం

 


అమెరికాలో తెలుగు సాహితీ సంస్కృతి సంప్రదాయాలకు విశిష్ట ప్రాచుర్యాన్ని కలిపిస్తున్న సిలికానాంధ్ర సంస్థ అన్నమాచార్యుని 606వ జన్మదినాన్ని కాలిఫోర్నియా రాష్ట్రంలోని సన్నీవేల్ నగరంలో మే 24, 25 తేదీల్లో ఘనంగా జరిపింది. రెండురోజులు కన్నుల పండుగగా జరిగిన ఉత్సవంలో పన్నెండు వందలమదికి పైగా సిలికానాంధ్ర కుటుంబసభ్యులు, సంగీత, నాట్య ప్రియులు, భక్తులు పాల్గొన్నారు.


మొదటిరోజు సభను సిలికానాంధ్ర అధ్యక్షుడు మాఢభూషి విజయసారధి ప్రారంభిస్తూ అఖండమైన అన్నమయ్య సాహిత్యసంపదలోని సంగీత నాట్యాంశాలను ఒకే వేదికపై ప్రదర్శించటానికి వీలుగా సిలికానాంధ్ర అన్నమయ్య జయంత్యుత్సవాన్ని రూపొందించిదని తెలిపారు. మూడు వయోవిభాగాల్లో జరిపిన గాన నృత్య పోటిల్లో రెండువందల మంది పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అటు పిమ్మట కన్నుల పండుగగా, వీనుల విందుగా జరిగిన కార్యక్రమంలో నిష్ణాతులైన సంగీత విద్వాంసులు, నాట్య శిఖామణులు పాల్గొన్నారు. అభినవ మాతంగిగా పేరొందిన ఉమామహేశ్వరి అన్నమయ్య హరికథను గానం చేసారు. సంగీత విదుషీ జయశ్రీ వరదరాజన్ చేసిన సంకీర్తనాలహరి కచేరిలో అన్నమాచార్య కీర్తనలను వయోలిన్, మృదంగ వాయిద్య సహకారంతో శ్రావ్యంగా ఆలాపించి రసికులను కట్టిపడేసారు. ప్రముఖ వైణికురాలు ఈమని కల్యాణి అన్న్మయ్య
కీర్తలని, మంత్రపుష్పాన్ని అలవోకగా వాయిస్తూ మంత్రముగ్ధుల్ని చేసారు. ఆంధ్రనాట్యంలో పేరుగాంచిన కళా కృష్ణ స్త్రీ పాత్ర ప్రధానంగా చేసిన నాట్యంతో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. చివరగా, ప్రముఖ మృదంగ విద్వాంసుడు నేమాని సోమయాజులు జలతరంగం కళను ప్రదర్శించారు. చిన్నా పెద్దా పింగాణి పాత్రలలో వివిధ మట్టాలలో నీరు నింపి వాయిస్తూ అన్నమయ్య కీర్తనలను రాగయుక్తంగా ప్రదర్శించి సభికుల్ని ఆకట్టుకొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త బొబ్బా వెంకటాద్రి, హృద్రోగ నిపుణుడు డా. లకిరెడ్డి హనిమిరెడ్డి కళాకారులను సత్కరించారు.


రెండవ రోజు ఉదయం ఎనిమిదిన్నరకు ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ ప్రారంభమైన రథోత్సవం అన్నమయ్య గీతాల గానంచేస్తూ సన్నీవేల్ నగర వీధులగుండా సాగి హిందూ దేవాలయం చేరుకుంది. స్వామి పరిపూర్ణనంద సరస్వతి సభికులను ఉద్దేశిస్తూ 'భారతీయ సంస్కృతీ వైభవం' అనే అంశంపై సందేశం ఇచ్చారు. అనంతరం అవ్వారి గాయత్రి సారధ్యంలో జరిగిన సహస్రగళ సంకీర్తనార్చనలో వేయికి పైగా భక్తులు పాల్గొని
సప్తగిరి సంకీర్తనలను ముక్తకంఠంతో అలాపించారు. క్రితం రోజు జరిగిన గాన నృత్య పోటీల్లో మొదటి మూడు స్థానాల విజేతల్ని కూచిభొట్ల ఆనంద్ ప్రకటించగా డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బహుమతులను అందజేసారు.

విజయవంతంగా జరిగిన ఈ ఉత్సవానికి రూపకర్తగా కూచిభొట్ల ఆనంద్, రథసారధులుగా మంగళంపల్లి వసంత, సరిపల్లి పద్మిని, వంక రత్నమాల, వ్యాఖ్యాతగా జుర్రు చెన్నయ్య వ్యవహరించారు.

 

 
 
 
 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)