శీర్షికలు

పద్యం - హృద్యం

- రచన : పుల్లెల శ్యామసుందర్    


 

సమస్యాపూరణము:

క్రింది "సమస్యని" అంటే వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు -మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారా (padyam_hrdyam@yahoo.com)  మాకు 20 తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా సమస్యలను కూడా ఆహ్వానిస్తున్నాము. సమస్యలు వీలున్నంతలో తేలిక తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

ఈ మాసం సమస్య:

గుమ్మడి పెద్దదైన మరి కోసెడి కత్తికి లోకువే గదా!

గతమాసం సమస్య:

దత్తపది: (రామ, సీత, రావణ, లంక) పదములతో రామాయణ పరంగా కాకుండా స్వేచ్ఛా చంధస్సులో పద్యము వ్రాయాలి.

 

ఈ సమస్యకు మాకు అందిన క్రమములో పూరణలు ఇలా వున్నాయి.

టేకుమళ్ళ వెంకటప్పయ్య, విజయవాడ

తే.గీ//

రామ! రామ! రాడేమి యా రామ రావు?

రాజకీయంబు రావణ రాజ్యమాయె!

సీత ద్రౌపదు లిచ్చట సిగ్గు పడరె!

లంకణములింక జనులకు, లబ్ధి సున్న! 

వారణాసి సూర్యకుమారి ,మచిలీపట్టణం

కం //

ఆ రామసీత తోడను 

శ్రీ రామారావు వెడలి శ్రీ లంకకు, బౌ 

ద్ధారామము తిలకించిరి 

ఆ రావణ రాజ్య మనెడు ఆశ్చర్య ము తో    

కం//

హా రామయంచు పలికెడు                  

ఆ రామచిలుకను లంక నారామము నన్   

ఆ రామసీత చూచుచు

ఆ రాముని, రావణుని తలచె నచ్చెరువు న్                                                               

గండికోట విశ్వనాధం, హైదరాబాద్‌ 

శా//

పంచా రామము లందు శంకర విభున్‌ ప్రార్ధించి, తిర్లాడి  వీ 

క్షీంచన్‌ వాటికలన్‌ విశాఖ నగరిన్‌ సీతమ్మ ధారంచనన్‌ 

లాంచీ యానములోన లంకల ధరాలంకార  గోదావరిన్‌
కాంచన్‌ రా! వణకించె మేను పటు మేఘ ద్గ ర్జన ధ్ధాటికిన్‌
.

డా. ఇంకొల్లు ప్రసాద్, సెయింట్ లూయిస్ (తాత్కాలికంగా)

.వె//

రామనామమెటుల రామములగకు వచ్చె?
సీత ఫలములోని సీత వోలె!!
రగులుచుండు నెచట రావణ కాష్టంబు?
లంకలోనఁ గాక నింక నెచట
! 

యడవల్లి ఆదినారాయణ శాస్త్రి, సికందరాబాదు

కం//

రా, మన ఇంటి కిపుడె పో

దామనె, సీత, తన యనుగు తనయుని తో, మా

రాము  వలదురా, వణకగ

లేమిట, లంకంత ఇంట లేదెట,  చలియున్ 

శివప్రసాద్ చావలి,సిడ్నీ

కం//

పదిలము! పౌరా! మదుపుగ

వదలకు ' సీత' కు కడు విలువగు నీ వోట్లన్‌!

బదులీరా! వణకించగ

పదవి యలంకరణమును వలచు కపటులన్‌

(గమనిక: సీత = మద్యము)   

 

.వె//

రామ చక్కనగు మరదలు సామాన్యమౌ

సీతను వలదనుచు సీమ లలన

ను వలచిన పిసిని మనోరావణ మొనర్చె 

ఆమెకగు లంకరణ వ్యయముకు  

(గమనిక: రావణము = ఏడుపు)

 

నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ

తే.గీ//

లంక తంబాకు కొనెదము యెంకి రావె 

వంట జేయగ సీతను నింట విడిచి 

రచ్చ బండకు పోయిరా రామ నీవు 

వచ్చె దముమేమిక మనరా వణుని కలిసి  

జంధ్యాల కుసుమకుమారి, హైదరాబాదు
.వె//

సీత చిత్రశాల సిరిగల చిత్రాల
శాల తరచి చూడ శబరి గౌరి
రామ కృష్ణ కర్ణ రావణ కథనాలు
గిరులు లంకలిమిడె
గీతలందు

రావు తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియా

కం//

ఆరామమే యెరుగనా

పోరడు, దా సీత్యచేల పూసిన ఫలముల్

ఏరుచు, ప్రావణ మందున

చేరిచి, లంకల తిరుగుచు చిల్లర కమ్మెన్!

(సీత్యము - బాగుగా దున్నబడిన)

(ప్రావణము - కండువా)


 
     
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)