కవితా స్రవంతి

ఆగ్రహం

       రచన - రంగరాజు పద్మజ   


 

నాకెందుకు కోపమో ఇది చదువుతే మీకే తెలుస్తుంది
కొలంబస్ అంటే నా క్కోపం ఎందుకంటే
అమెరికాను కనుగొన్నాడు
ఛార్లెస్ బాబ్బేజ్ అంటే చిరాకు కారణం,
కంప్యూటర్ కనుగొన్నాడు.
మార్శల్ అంటే మంట మరి?
కరెన్సీ కనుగొన్నాడు
రైట్ సోదరులంటే రౌద్రంగా మారుతాను?
విమానాని కనిపెట్టి అన్యాయం చేసినారు.
ఆంగ్లేయులంటే అరికాల మంట నెత్తికెక్కుతుంది?
ఆంగ్ల భాష నెత్తిన రుద్దారు.
లేకుంటే భారతదేశంలో అమ్మా, నాన్నలు హాయిగా
ఉండేవారు.
అమెరికాయే
లేకుంటే, అమ్మా, కొడుకూ, కోడలు, మనవలూ, మనవరాలు
ఈ బంధాలు హాయిగా ఉండేవి.
వస్తుమార్పిడి తో కొనసాగే జీవితాలకు,
కరెన్సీ రుచి చూపారు.
ఇంటర్ నెట్ లో మనుమలను చూసి ఆనందించడము
కొత్త వాళ్ళలా కోడళ్ళను పరిచయము చేసుకోవడం,
అమెరికా వారు గాలిలోకి కరెన్సీ నోట్లను విసిరితే.
బిక్షుకులకు మల్లే వాటిని ఏరుకోవడానికి, నాలుగు
ఇంగ్లీషు ముక్కలు నేర్చుకుని ఎగిరి పోతున్నారు.
పూర్వం జయంతులూ, వర్దంతులే ఉండేవి సహజంగా..
ఇప్పుడు మదర్స్ డేలు, వెడ్డింగ్ డేలున్నాయి కృత్రిమంగా..
విమాన్నాల్లేకుంటే, సప్త సముద్రాలు దాటిమిసిసిపి నీళ్ళు
తాగేవారు కారు,
పవిత్ర గంగా యమునా, గోదావరి నీళ్ళు తాగేవారు
పవిత్రంగా,
వెర్రి వెంగళాయిలున్నారు, వెబ్ కెమెరాల్లో పిల్లలను
చూసి మురిసిపోతున్నారు.
చాలా కాలం గడిస్తే కాని తెలియదు,
ఈ వస్తువులు చూస్తే ఆనందం కలుగదు,
కన్నవాళ్ళనూ, వారి కన్నవాళ్ళనూ తప్ప ఆనందం కలుగదని..
డాలర్లు రూపాయిల్లోకి మార్చి మురవడం కాదు,
డాటర్లు, వారి డాటర్లను చూచి మురవాలని.
గుఱ్ఱాలాంటి కోరికలను గుప్పెట్లో వుంచుకుంటే,
మేధోవలసలు తగ్గి భారతం సస్యశ్యామలం కాదా?
గ్రాహంబెల్లు గారి ద్వారా మాట్లాడుతున్నామాయే
(ఎలాగూ ఫోనుల్లో మాట్లాడుతున్నామయే) ఫరువాలేదు,
4, 5 సం! ఒకసారి జన్మభూమి రావచ్చులే! అని యువత అంటే
గ్రహంబెల్లు మీద కోపం రాదా మరి?
పిచ్చీ! వెఱ్ఱీ కానీ రైట్ సోదరుల వల్ల కాదా!
అమేజాన్, ధేమ్స్ నదినీ చూసేదీ!
కొలంబస్ వల్లనే కదా! కొడుకులనూ, కోడళ్ళనూ
కూతుళ్ళనూ, మనవళ్ళనూ చూసి ఆనందించేది,
ఛార్లెస్ బాబ్బేజ్ లేకుంటే ఛాయాచిత్రాలుండేవా?
ఇంకా లింకులుండేవా?
మార్షల్ మహాశయుడు లేకుంటే
మధ్యతరగతి మల మల మాడి పోయేది కాదా?
ఆంగ్లంలో అయినాసరే! మమ్ అనో డాడ్! అనో
గ్రాండ్ పా! అనో గ్రాండ్ మా! అనే పిలుపులుండేవా?
ప్రాణాలు కొడగట్టి పోకుండా కాపాడేవాడు!
గ్రహంబెల్లు కాదా!
పునరాలోచిస్తే, రైట్ సోదరులకు , బాబ్బేజ్ గారికి,
గ్రహంబెల్ గారికి సమాజం ఉన్నంత వరకూ
అందరూ కృతజ్ఞులే!
సాంకేతికత లోపిస్తే సమాజ మనుగడ ఎట్లా?
అందుకే అందరికీ నా మనోవాకములు..

 

 

 
 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)