కవితా స్రవంతి

పిచ్చుక

రచన -  .....వాణి కొరటమద్ది   


 

మరుగైపోతూ మా మంచి పిచ్చుక
అరుదైన జాతిగా మిగిలి పోతావా

సాంకేతికత నీ పాలిట శాపమయ్యిందా
ఆధునికత పుణ్యమా అని అంతరించిపోతావా

చిన్ననాటి మా ఆప్తనేస్తం
నీ కిచ కిచలు మాకింక వినిపించలేవా

అద్దంపై ముక్కుతో గుచ్చిన చుక్కలు
చెరిగిపోనీ గుర్తులుగా మిగిలాయి

నాడు పిచ్చుకపై బ్రహ్మస్త్రం అనేవారు
నేడు నీపై మానవాస్త్రం సంధించినారు

సెల్ టవర్లు నీపాలిట మ్రుత్యుకుహరాలు
నీ జాతి అంతానికి అయినాయి మార్గాలు

తల్లి బందం అంటె పిల్లలకే చూపినావు
ఆహారం తినిపించిన చర్యలే సాక్ష్యంగా

విశ్వాసానికి చిహ్నంమైన పిచ్చుక
అమాయకత్వానికి నిదర్శనం

శతాబ్దాలుగా చేసిన సహజీవనం
మిగిలి పోనుందా మాకు జ్ఞాపకంగా

అంతరించిపోకుండా కాపాడుకుందాం
ప్రయత్నం చేద్దాం అందరం అవసరంగా
 

 

 
 
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
 

 

(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)