కథా భారతి
అమెరికన్ ప్రెసిడెంట్
- ఇర్షాద్ జేమ్స్

1971 ఫిబ్రవరి.
ఏలూరు.
ఆంధ్ర ప్రదేశ్.
ఇండియా.

ఒక ఆసుపత్రి వెయిటింగ్ రూంలో కూర్చొని వున్నాడు సత్యనారాయణ.
డెలివరీ రూం లోంచి నర్స్ బయటికి వచ్చింది.

"మిస్టర్ సత్యనారాయణ !! కంగ్రాచ్యులేషన్స్ !!” చెప్పింది నర్స్.

సత్యనారాయణ లేచి నర్స్‌తో లోపలికి వెళ్ళాడు.

సత్యనారాయణ భార్య సావిత్రి మంచం మీద పడుకొని వుంది.
ఆమె పక్కన పడుకొని వున్నాడు ఒక చిన్న బుజ్జి బాబు !!

బుజ్జి బాబుకి ప్రసాద్ అని పేరు పెట్టారు, సత్యనారాయణ, సావిత్రి.

******** ******** ******** ******** ********

2016 మార్చి.
ఆస్టిన్, టెక్షస్
USA

అమెరికాలో ఎన్నికల సీజను.
అందరూ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు.

రిపబ్లికన్ పార్టీ తరపున ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఆ ఇద్దరిలో ఒకడు జాన్ స్మిత్.
అతని లైవ్ ఇంటర్వ్యూ టీవీ లో వస్తోంది.
అది చూస్తూ కూర్చున్నారు సత్యనారాయణ, సావిత్రి.

“వై షుడ్ ది అమెరికన్ పీపుల్ వోట్ ఫర్ యూ?” అడిగింది టీవీ ఏంకర్.

“ఐ రిప్రెజెంట్ ది కోర్ వేల్యూస్ ఆఫ్ అమెరికా. ఐ కెన్ క్రియేట్ జాబ్స్. ఐ కెన్ బేలన్స్ ది బడ్జెట్..." చెప్పుకుంటూ పోతున్నాడు జాన్ స్మిత్.

“వాట్ డూ యూ ప్లాన్ టు డు అబౌట్ హెల్త్ కేర్ ఇన్ అమెరికా?” అడిగింది టీవీ ఏంకర్.

“ఆన్ మై ఫర్స్‌ట్ డే ఇన్ ది ఆఫిస్, ఐ విల్ రిపీల్ ది ఎగ్సిస్టింగ్ హెల్త్ కేర్ సిస్టెం. ఐ విల్ పుట్ ఇన్ ప్లేస్ ఎ మచ్ బెటర్, కాంప్రెహెన్సివ్ సిస్టం దట్ విల్ బెనెఫిట్ ఆల్ అమెరికన్స్ !!” చెప్పాడు జాన్ స్మిత్.

“వాట్ అబౌట్ టేక్సెస్? అమెరికన్స్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ హై టేక్సెస్” అడిగింది ఏంకర్.

“ఐ అగ్రీ. వి నీడ్ టు అబాలిష్ ది కరెంట్ టేక్స్ కోడ్. వి నీడ్ టు సింప్లిఫై అవర్ టేక్స్ సిస్టెం...” ఆవేశంగా చెప్పాడు జాన్ స్మిత్.

“బట్ యువర్ అపోనెంట్ మిస్టర్ ప్రసాద్ ఈజ్ రైజింగ్ రాపిడ్‌లీ ఇన్ ది పోల్స్. వాట్ ఈజ్ యువర్ స్ట్రాటెజీ టు బీట్ ప్రసాద్?” అడిగింది టీవీ ఏంకర్.

“ప్రసాద్ ఈజ్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ టు రన్ ఫర్ ప్రెసిడెంట్. హీ వజ్ నాట్ బార్న్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ !! దేర్ ఈజ్ ఎ లీగల్ సూట్ ఫైల్‌డ్ అగెన్స్‌ట్ ప్రసాద్ ఇన్ ది కోర్ట్.” చెప్పాడు జాన్ స్మిత్.

అది విని, సావిత్రి అడిగింది, సత్యనారాయణ తో:
“మన ప్రసాద్ ఇండియా లో పుట్టాడు, నిజమే. కాని వాడు పుట్టినప్పుడు మనం అమెరికన్ సిటిజెన్స్ కదా? అంటే ప్రసాద్ కూడా చిన్నప్పటి నుంచి అమెరికన్ సిటిజెనే కదా?”

“అవును. ఇదంతా వోట్ల కోసం జాన్ స్మిత్ చేస్తున్న నాటకం” కోపంగా అన్నాడు సత్యనారాయణ.

సత్యనారాయణ, సావిత్రి, 1960 లో అమెరికా వచ్చారు.
1970 లో అమెరికన్ సిటిజెన్‌షిప్ తీసుకున్నారు.

1971 లో ఇండియాలో సావిత్రి వాళ్ళ నాన్నకి హఠాత్తుగా ఆరోగ్యం పాడయ్యింది.
ఎమర్జెన్సీ రూం లో అడ్మిట్ చేసారు.
సత్యనారాయణ, సావిత్రి అర్జెంటుగా ఇండియా వెళ్ళవలసి వచ్చింది.

కాని అప్పుడు సావిత్రి 8 నెలల గర్భిణీ.
అప్పుడు వెళ్ళటం మంచిది కాదన్నాడు సత్యనారాయణ.
కాని ఎలాగైనా ఇండియా వెళ్ళి నాన్నని చూడాలని పట్టు పట్టింది సావిత్రి.

వాళ్ళు ఇండియా చేరిన కొన్ని రోజుల తరువాత సావిత్రి వాళ్ళ నాన్న చనిపోయాడు.
మరి కొన్ని రోజుల తరువాత ఇండియా లో వున్నప్పుడే ప్రసాద్ పుట్టాడు.
ప్రసాద్ పుట్టిన కొన్ని రోజులకి తిరిగి అమెరికా చేరుకున్నారు ముగ్గురూ.

45 సంవత్సరాల తరువాత, ఇప్పుడు 2016 లో ప్రసాద్ అమెరికా ప్రెసిడెంట్ అవ్వడానికి, రెపబ్లికన్ పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు.

అతని ప్రత్యర్థి జాన్ స్మిత్ కూడా రిపబ్లికన్ పార్టీకి చెందిన వాడే.

వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు రిపబ్లికన్ పార్టీ తరపున జెనరల్ ఎలెక్షన్ లో నవెంబరు లో పోటీ చేస్తారు.

******** ******** ******** ******** ********

ఆ రోజు కోర్టు కేసు గురించి జడ్జి తీర్పు చెప్పే రోజు.

కోర్టు బయట చాలా మంది జనం నిలబడి ఎదురు చూస్తున్నారు.

“ప్రసాద్ 2016” అని కొంత మంది జనం ఉత్సాహంగా నినాదాలు చేస్తున్నారు.

“వోట్ ఫర్ జాన్ స్మిత్” అని మరి కొందరు పోస్టర్లు పట్టుకుని నిలబడి వున్నారు.

సత్యనారాయణ, సావిత్రి ఇంట్లో టీవీ ఆన్ చేసి చూస్తున్నారు.

జడ్జి ఇలా తీర్పు చెప్పాడు:

“అకార్డింగ్ టు సెక్షన్ 301 (c) ఆఫ్ ది ఇమ్మిగ్రేషన్ అండ్ నేచురలైజేషన్ ఏక్ట్ (INA), ది డిఫెండెంట్ ఈజ్ కంసిడర్‌డ్ ఎ నేచురల్ బార్న్ U.S. సిటిజెన్ ఫ్రం బర్త్, బికాజ్ హి ఈజ్ ఎ పర్సన్ బార్న్ ఔట్సైడ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇట్స్ ఔట్లయింగ్ పొసెషన్స్, ఆఫ్ పేరెంట్స్ బోత్ ఆఫ్ హూం వర్ ఆల్రెడీ సిటిజెన్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ వన్ ఆఫ్ హూం హేజ్ హేడ్ ఎ రెసిడెన్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆర్ వన్ ఆఫ్ ఇట్స్ ఔట్లయింగ్ పొసెషన్స్, ప్రయర్ టు ది బర్త్ ఆఫ్ సచ్ పర్సన్.”

ప్రసాద్ కేసు గెలిచాడు !!

కాని ఎలెక్షను ఇంకా అవ్వలేదు.

జాన్ స్మిత్ ని ఓడించటం అంత సులభమయిన పని కాదు.

పోల్స్ లో ఇద్దరూ సమానంగా వున్నారు.

ఈసారి జాన్ స్మిత్ మీద కోర్ట్ లో కేసు వేసాడు ప్రసాద్.

కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి.

“యువర్ ఆనర్ !! జాన్ స్మిత్ ఈజ్ నాట్ ఎ నేచురల్ బార్న్ సిటిజెన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ !!”, చెప్పాడు ప్రసాద్.

జడ్జి ఆశ్చర్యంగా చూసాడు ప్రసాద్ వైపు.

“వాట్ ఎవిడెన్స్ డూ యూ హేవ్” అడిగాడు జడ్జి.

“యువర్ ఆనర్ !!
జాన్ స్మిత్ వాజ్ డెలివర్డ్ యూజింగ్ సి-సెక్షన్ (సిజేరియన్) ఆపరేషన్.

దట్ ఈజ్ నాట్ కన్‌సిడర్డ్ ఎ నేచురల్ బర్త్ !!” చెప్పాడు ప్రసాద్.

ప్రసాద్ మళ్ళీ కేసు గెలిచాదు.

రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థి గా సెలెక్ట్ అయ్యాడు.

2016 నవెంబరు లో జెనరల్ ఎలెక్షను లో కూడా గెలిచి, నలభై ఐదవ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు ప్రసాద్.

(అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎన్నికలు వేడివేడిగా హోరాహోరీగా జరుగుతున్న ఈ సందర్భంలో కొన్ని ఆసక్తికరమైన కారణాలను ఊహించుకొని రాసిన కథ ఇది)

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)