తెలుగుదనం

-- రజని మల్లాది

అయ్యారే అచ్చెరువిది ఆలకించగా నేడు

తెలుగు అనిన ఏమని?తెలుగుదనము ఎచటని?మీసాల ఆసామి పంచెకట్టున గలదు

ఇంతి ధరియించు చీర సొగసున కలదు

నుదుట సింగారించు సింధూరమున కలదు

కన్నె పడుచులు దాల్చు ఓణీల కలదు|| అయ్యారే ||

మోదమును గూర్చేటి ఆట పాటల గలదు

బిరబిరా పరుగులిడు నదుల నడకన గలదు

శూరత్వమును జూపు వీరులందున గలదు

వివిధమ్ములై నుండు వేడుకల గలదు|| అయ్యారే ||

బాలలకు జోలైన లాలి పాటలు మనవి

భక్తి బాటను జూపు ఆలయమ్ములు మనవి

రస రమ్య భావముల లలిత కళలే మనవి

మైత్రి సంస్క్రుతి నేర్పు ఆచారములు మనవి|| అయ్యారే ||

మాత మన్నన జేయు రీతిగా జాతిని

గారవించిన వాని జన్మ ధన్యమ్ము

ఆంధ్రులము మనమన్న అస్తిత్వమును ఎరుగ

జగతి హారతు లిదదె జై తెలుగు తల్లనుచుజై తెలుగు తల్లి

జై తెలుగు తల్లి

జై తెలుగు తల్లి