స్వరసంగమం : వయసేంటి ప్రేమకీ - గజల్

రచన, గానం : తల్లాప్రగడ రావు

సంగీతం: మనాప్రగడ సాయి

వయసేమిటి ప్రేమకీ, నీ పిచ్చిగానీ

ఇంకా పెరుగునిలా, ఏమైన గానీఇరవైకి కలిగినదైనా , అరవైకి కరుగునా

ఇదే మైనా అందమా, నా ప్రేమగానీ

ఇంకా పెరుగు నిలా, ఏమైన గానీ

వయసేమిటి ప్రేమకీ, నీ పిచ్చిగానీపెరిగింది ప్రేమ వృక్షం, ఎన్నేళ్ళ నుంచో

పోసావా నీరూ, ఏ నాడు గానీ

ఇంకా పెరుగునిలా, ఏమైన గానీ

వయసేమిటి ప్రేమకీ, నీ పిచ్చిగానీరామచంద్రుడే చెప్పనేచెప్పి మనసిప్పి కోరితే

ఔననవా, నీవూ, వేషాలు గానీ,

ఇంకా పెరుగునిలా, ఏమైన గానీ,

వయసేమిటి ప్రేమకీ, నీ పిచ్చిగానీ!


ఈ పాటను వినడానికి
ఈ క్రింద మీట నొక్కండి