పదవిన్యాసం

నిర్వహణ: కూచిభొట్ల శాంతి

ఆధారాలు :

నిలువు:

1.పొలానికి నీరు పెట్టటానికి ఉపయోగించేది (2)

2. వత్తు లేదు, దీర్ఘం ఉందికాని పొత్తరమే (4)

3. రాముని"తోక" పివరుండిట్లనియె (2)

4. సామాన్యప్రజల దైనందిక జీవితం (5)

5. నిచ్చెన లేక మెట్లు (3)

6. పరవళ్ళు తొక్కుతూ పారే నదులన్నింట్లో "నీటిసుడి" ఉంటుంది (3)

7. సామర్థ్యం లేక బలం (2)

10. దాయాదుల మధ్య "ఘోరయుద్దం" కురుక్షేత్రం లో జరిగింది (6)

11. అడిగితే ఇచ్చేది (2)

12. లోహాన్ని బంగారంగా మార్చే విద్య (4)

13. లేని వాటిపై పడే ఆశ (4)

15. పైరుతో పాటు పెరుగుతుందని ఊరుకోకుండా తొలగించటం ఉత్తమమైన పని (5)

17. బండి చక్రం ఆకులేందే బండి నడవదు (3)

19. ఎన్నడూ చూడని (3)

20. "పుట్టని" బిడ్డకి పేరు పెట్టినట్లు (3)

21. నగలూ, నాణ్యాలూ చేయటానికి ఉపయోగపడే ఒక లోహం (4)

22. పల్లెటూరి వాళ్ళు 'దీన్ని ' మగతనానికి చిహ్నంగా భావిస్తారు (4)

23. ఏనుగులకు విశేషణాలంకారంగా ఎక్కువ వాడుతారు ఈ "మదించిన" మాటని (3)

24. ఏ వృక్షం లేని చోట ఈ వృక్షం మహావృక్షం (3)

25. అక్షర రూపంలో తామర (2)

అడ్డం:

1. జ్యేష్ట పున్నమిని ఇలా కూడా అంటారు (7)

6. ....ఇది లావు, పీక సన్నం అంటారు (2)

8. పూజలకి, నోములకి ఇది తప్పనిసరి (3)

9. అనురాగం (2)

10. బతికించే ఓషధి (6)

13. పొలాన్ని సేద్యం చేయటానికి ఇచ్చేపత్రం (2)

14. పచ్చి నేఱేడు కాయ లాంటి వాటికి ఉండే ఒక రకమైన రుచి (3)

16. పిల్లల్ని అందరూ "ఇదే" చేస్తారు (3)

17. ఎలాంటి ఆధారం లేకుండా అసందర్భంగా చేసే పరనింద (4)

18. దుక్కి దున్నటానికి ఉపయోగించే సాధనం (2)

19. అర్జునుని 'రథ 'సారథి కృష్ణుడు (3)

20. ఉట్టికెక్కలేనమ్మ "దీని" కెక్కుతానందిట (5)

22. .... బావకు పెళ్ళంట (2)

23. రాముని రాజ్యపాలన ఇలా ఉందేదట (5)

24. వెతుకు లేక విచారించు (3)

25. సేద్యం లేక సాగుబడి (3)

26. శ్రీమంతుడు లేత మోతుబరి దీర్ఘంతో (3)

27. 23 నిలువు లోనిదే (2)

28. గువ్వజాతికి చెందిన ఒకరకం పక్షి (3)

29. అస్తవ్యస్తంగా "మొదలు పెడితే" ఎలా? (3)

ముఖ్య గమనిక: మీరు యే కారణం చేతనైనా అన్ని గడులూ పూరించలేకపోతే, మీరు పూర్తిచేయగలిగినన్ని పూరించి పంపించండి. అన్నీ కాకపోయినా వీలైనన్ని ఎక్కువ సమాధానాలు వ్రాసిన వారిని కూడా బహుమానానికి అర్హులే. మీరు ప్రయత్నించడం, తద్వారా ఆయా పదాల గూర్చి మీ ఇళ్ళల్లో అర్ధవంతమైన చర్చలు జరిగుతూ సాహితీ వికాసానికి తోడ్పడటమే ఈ శీర్షిక ముఖ్య ఉద్దేశ్యం.

ఇక మీరు చేయవలసినదల్లా...

అధారాలను అనుసరించి పదాలతో విన్యాసాలు చేసి గడులను పూరించి, ఈ-మెయిలు (ఆర్.టీ.ఎస్. పధ్ధతిలో) ద్వారా కానీ లేదా కాగితంపై ముద్రించి, పూరించి కింద ఇచ్చిన చిరునామాకు పంపించండి. సరైన సమాధానాలు వ్రాసిన మొదటి ముగ్గురికి మంచి పుస్తకాల బహుమతి. సరైన సమాధానాలు పంపిన వారు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే ముగ్గురి పేర్లను 'డ్రా'తీసి, వారికి బహుమతి పంపిస్తాము.

మీ సమాధానాలు మాకు చేరటానికి గడువు:
జూలై 25, 2007

ఈ-మెయిలు: santhi@siliconandhra.org

చిరునామా:
Santhi Kuchibhotla
20990, Valley green drive, apt: 615
Cupertino, CA - 95014

గత మాసపు పదవిన్యాసం సమాధానాలు:గత మాసపు పదవిన్యాసంలో మాకు అందిన సమాధానాల్లో ఒక్కటీ పూర్తిగా సరైన సమాధానాలు ఉన్న పూరణలు అందలేదు. అందువల్ల జూన్ నెల పదవిన్యాసం విజేతలుగా ఎవరినీ ప్రకటించుట లేదు.