అకాల శిశిరం

-- శివచరణ్

గ్రహణం నాడు ఉగాది పండుగ సందిగ్ధంలా

ఆమె అనారోగ్యం

మేని చాయ చూస్తే ముదుసలిలా లేదు

అకాల శిశిరం

పెదవి విరిచిన వైద్యులు

'అందరూ పోయేవాళ్ళే'

విదేశీ దొరసాని ప్రదక్షిణలో

వేదాంతం వల్లిస్తూ కొడుకుఆమె జ్ఞాపకాలను నింగికీ నేలకు అక్షరాలుగా పేరిస్తే

అదొక -

అందమైన హరివిల్లు

జీవితమొక -

మహాభారతం

కల్పవృక్షం

సుమతీశతకం

ప్రబంధం

వెరసి -

ఒక మహా ప్రస్థానంగతించె కీర్తి -

కాల పాదఘట్టనలకింద

నిర్లక్ష్యపు నిశీధిలో

బధ్యత మరచిన సంతానంతో

భవిత అనిశ్చితమై

సాంత్వన కోరిన వేదనతో

దీనంగా ఉదాసీనంగా

ఆమె!