Sujanaranjani
           
  సారస్వతం  
  పుస్తక పరిచయం - 2

శివ పార్వతుల శరీరమే శ్రీ చక్రము...

 

                                                  - పరిచయకర్త: శైలజామిత్ర

 

అక్షరములలో కూర్చబడినదే మంత్రము. మంత్రాలను మహిమాన్వితాలుగా తీర్చిదిద్ది నేడు మనకు ఆసాంతం ప్రసాదంలా అందించిన ఖరిదేహాల్ వెంకట రావు మహా కార్యాన్ని యథా తథంగా ఆంగ్లంలోకి అనువదించిన  డా. పప్పు వేణుగోపాల్ రావు గారికి కృతజ్ఞతలు. కాలం ఎవరి చేతిలోనూ లేదు. కాని మనకు అంతుచిక్కని కాలాన్ని వెచ్చించి ఒక దైవ కార్యానికి శ్రీకారం చుట్టిన అద్భుత కార్యం వీరిదే! ఒక గొప్ప బిడ్డను కంటే తల్లి జన్మ ధన్యం ఇలాంటి కారణ జన్ములను కంటే తల్లి జీవితం భక్తి ప్రభోధం. అందుకే వీరివురిని కన్నవారు ధన్యులు.  

             ఆంధ్ర దేశంలో అమరావతి అనే ప్రాంతం దలైలామాకు ఆతిధ్యం ఇచ్చింది. లక్షలాది మంది యోగులు, బౌద్ద సన్యాసులు ఇంకా అనేక మంది ప్రజలు కూడా అమరావతికి తరలి వెళ్లారట. అందుకు కారణం ఏమిటంటే ఆరోజు కాలచక్ర పర్వదినం! నాటికి అనంతం, అనుహ్య్మయిన క్వాంటం థియరీకి కూడా అంతుపట్టని కాలం కన్నా గొప్ప రహస్యం ఏముందనే కారణంగా సృష్టి మూల మైన కాలాన్ని ఉహాతీత మహా శక్తిని యంత్రంగా నిర్మించి దాన్ని ఆరాధించే కార్యక్రమం- కాలచక్ర పర్వదినం.ఇది పండగ మాత్రమే కాదు సాధన కూడా అని మార్గంలో గురువులు చెబుతారు. యన్త్రాన్నే ' మండలం' అని అంటారు. అత్యంత శక్తివంతమయిన కలియుగ ప్రత్యక్ష దైవము కోట్లాదిమందికి ఇష్ట దైవం అయిన శ్రీ శ్రీనివాసుని సన్నిదిలో ఉన్న శ్రీచక్రం అత్యంత శక్తి వంతమయిందని చెబుతారు.

దీనిని ప్రతిష్టించింది ఆది శంకరాచార్యులే నని, దీనికి ఉన్న ఆకర్షణ శక్తి వల్లనే అనేకులు తిరుపతి సందర్శిస్తున్నారని చాలామంది నమ్ముతారు.ఎంతో పురాతన కాలం నుండి అర్పించ బడుతున్న శ్రీ చక్రం ఉపాసనా రంగంలో యంత్రాలలో అతి గొప్ప స్థానం పొంది ఉంది.  పంచ దశీ నమ్మకంతో శ్రీ చక్రాన్ని పూజించి దేవతానుగ్రహాన్ని పొందుతారట.   రెండు దిమెన్సిఒన్స ఉంటే శ్రీ చక్రం మెరుపు అని పిలుస్తారు. అదృష్ట యంత్రాలకు ఒక ఉదాహరణ ఉంది. బాలారిస్టాలకి, ఆరోగ్యానికి ఉపయోగించే యన్త్రాలున్న వ్రాత ప్రతి దొరికింది.ఇది నమ్మకమో దైవానుగ్రహమో కాని అనేమందికి పనిచేస్తున్నాయట

                      మంత్రము  శబ్ద తరంగముల సాముహ శక్తి. అక్షరములతో కూడుకొని ఉన్నది. ఇది ఒక విధమయిన శబ్ద శక్తి స్వరూపము. శబ్దము ఆకాశము యొక్క గుణము. మంత్రం ఎవరు చేస్తే వారికి వారి అనుయాయులకు ఉపయోగ పడుతుంది. యంత్రం "పవర్ అఫ్ అటార్నీ " ఇస్తూ ఇది ఎవరిదగ్గర ఉంటే వారికి ఉపయోగ పడుతుంది. యంత్రాలు బంగారు రేకులమీద, వెండి మీద, రాగి మీద, అరటి ఆకుమీద, ఇంకా కాగితం మీద కూడా గీస్తారు. యంత్రం అవసరం ను బట్టి దేనిమీద గీయాలో మంత్ర మహోదధి లాంటి గ్రంధాలు తెలుపుతున్నాయి. వ్యాపారస్తులు "జనాకర్షణ యంత్రం" పెట్టుకుంటారు. దానివల్ల జనం వస్తారని , వారి వల్ల వ్యాపారం వృద్ది అవుతుందని నమ్ముతారు. ఇలాంటి యంత్రం ఇళ్ళల్లో ఉంటే కష్టం. విపరీతంగా జనాలు వస్తే తట్టుకోవడం కష్టమే మరి

                           

                 కొందరు కుబేర యంత్రాన్ని, మరికొందరు లక్ష్మి యంత్రాన్ని పూజించడానికి దేవుని వద్ద ఉంచుతారు. అది ధనాన్ని వృద్ది చేస్తుందని నమ్ముతారు. సకల వాస్తు దోషాలు పోగొట్టుకోవాలంటే గోడలు పగలకోట్టుకుని ఇళ్ళు మళ్లీ కట్టుకోనక్కరలేదు. యంత్రం ఒకటి పూజించి ఇంట్లో పెట్టుకుంటే చాలని తద్వారా వాస్తుదోశాలు నివారించబడతాయని నమ్ముతారు. కుర్మా యంత్రం స్థిరత్వానికి చిహ్నం. నరఘోష యంత్రం దృష్టిదోషం నిర్ములిస్తుందని కూడా నమ్మకం ఉంది. ఇలా ఒక్కటే కాదు అనేక యంత్రాలలో రాయబడిన బీజాక్షరాలు , త్రికోణ , వర్తుల, చతుర్స్త్ర నిర్మాణాలు ఆయా శక్తులని, దిక్పాలకులని, విశ్వంలో మూల ప్రకృతికి చెందిన ఆది శక్తిని ప్రేరేపించి మంచి ఆలోచనలను,                 ఆనందకరమయిన వాతావరణాన్ని కలుగ జేస్తాయి.కొన్ని యంత్రాలను ధరిస్తారు కూడా. చిన్న చిన్న తాయత్తుల లో ధరించిన యెడల దీర్ఘ రోగాలు దూరం అవుతాయి. మంచి యంత్రాన్ని అర్చించి దాన్ని మరింత శక్తి వంతం చేసుకుని ఫలితాన్ని పొందవచ్చునని మేరు యంత్రం లాంటి గ్రంధాలు తెలుపుతున్నాయి.

మరి   శ్రీచక్ర యంత్రం లేదా శ్రీ చక్రం జాతకంలోని దోషాన్ని బట్టి దాని తాలుకు మంత్రం జపించడం కాని, లేక నవగ్రహ యంత్రాన్ని పూజించడం కాని చేయవచ్చు.  కాల సర్ప దోషం ఉన్నవారు కాలసర్ప యంత్రాన్ని సద్గురువుల దీక్షతో ఉపాసించవచ్చు అంటున్నారు.కుజ దోషం ఉంటే బాధ పడేవారు అనేకం. కాని అవసరం లేదు సుబ్రమణ్య మంత్రాన్ని మంగళవారం నాడు ప్రారంభించి మండలం పాటు అర్చించి పాలు నైవేద్యం పెడితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలలో చెబుతున్నారని పండితుల ఉవాచ.

శ్రీ చక్ర పూజలో నవావరణములలోని ఒక్కొక్క ఆవరణకు ప్రత్యేకమయిన పూజ ఉందట. చక్రం మొత్తమునకు ఒక ముద్ర ఉంది. అవి మొత్తం 10 . 

1 . సర్వసంక్షోభిని ముద్ర , సర్వ విద్రావినీ ముద్ర సర్వాకర్షిణీ ముద్ర, సర్వ వశంకరీ ముద్ర, సర్వో న్మాదినీ ముద్ర, సర్వ మహాంకుస ముద్ర, సర్వ ఖేచారే ముద్ర,సర్వ బీజ ముద్ర, సర్వయోని ముద్ర, సర్వ త్రిఖండ ముద్ర.

ఎన్ని ఉన్నను చివరిగా శ్రీ చక్రము ఆంటే తాంత్రిక కర్మకాండ ప్రకారము త్రిపుర సుందరీదేవి పూజకు ఉపయోగించు క్షేత్ర గణిత పటమును శ్రీ చక్రమండురు. శ్రీ చక్రము త్రిపుర సుందరీదేవి నివాస స్థలం మాత్రమే కాదు. ఆమె యొక్క సకల శక్తులకు, వ్యక్తిత్వములకు నిలయము. అనేక తాంత్రిక గ్రంధములు శ్రీ చక్రమును పలు విధములుగా వర్ణించెను. శ్రీ చక్రము విశ్వమంతటికీ ఆవరించి ఉన్నాడని భైరవ యాముల తంత్రము తెలియజేస్తోంది. అందుకు మరో సందేహం లేదు

                 నమ్మకం అన్నింటికీ మూల మంత్రం. అది కలిగి ఉంటే చాలు మన జీవితం సుఖమయం. గ్రంధం ఇంత ఉంటే అంత శుభములు కలుగుతాయి. నాకు గ్రంధం చదివే అవకాశం అందించిన పరమేశ్వరికి పాదాభి వందనములు. శుభం భూయాత్!

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech