Sujanaranjani
           
  సారస్వతం  
  పుస్తక పరిచయం - 1

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్

 

                           - పరిచయకర్త: శైలజామిత్ర

 

సృష్టి బహు విచిత్రమయినది. కావాలనుకున్నది కనబడనీయదు. వద్దనుకున్నది నిరంతరం కంటి ముందే ఉండేలా చేస్తుంది. భక్తితో ప్రార్ధిస్తే కరుణించని భగవత్ స్వరూపం లేనట్లే..ప్రేమతో మాట్లాడితే కరిగిపోని మనవస్వరూపం ఉండదు.  కాని విచిత్రం భక్తునిలో భక్తి కి బదులు కోరిక, మనిషిలో ప్రేమకు బదులు ఆశ ఉంటాయి. అందుకే ఈ ప్రేమ, భక్తి రెండు ప్రభందాలకే పరిమితమయ్యాయి. కోరిక, ఆశ సృష్టికి ప్రతిభందకాలుగా మిగిలాయి.సనాతన ధర్మాలను ఆదర్శంగా తీసుకుని జీవనం సాగించిన జీవితాలు సైతం స్వచ్చంధమయిన భక్తి తత్వానికి సుదూర తీరంలో ఉన్నాయి. విశ్వ జననీయమయిన శ్రీమద్భ వద్గీతలో అర్జునుడు శ్రీ విష్ణు సహస్రనామస్తోత్ర ఆవిష్కరణలో ధర్మరాజు, శ్రీమద్భాగవత ఆవిష్కరణలో పరీక్షిత్తు, ఎన్నో జీవితాలకు నిత్య పారాయణానికి  అవసరమయిన గ్రంధాలను రచించి భక్తికి, రక్తికి, అనురాక్తికి పరమర్ధాలను  తెలియజీసిన ప్రారబ్ధం ఇది. ఒక మంచి పని చేయడానికి మానవత్వం ఉంటే సరిపోతుంది. కాని ఒక దైవ కార్యం చేయాలంటే తప్పకుండా ఆ మనిషిలో దైవత్వం ఉంది తీరాలి. వేదాలను గూర్చి,

ఉపనిషత్తుల గురించి, ఎందరో మహాను భావులు రచించారు. కాని నేడు సర్వం విష్ణుం జగద్గురుం అన్నట్లుగా సర్వము విష్ణు రూపమే అనుకునే మానవులకు "శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం" ఆంగ్లంలో వివరణ ఇవ్వాలని అనిపించినా పి.ఎస్.కే. ప్రసాద్ గారి జన్మ ధన్యం . 

బర్మింగ్  హామ్ విశ్వ విద్యాలయంలో నాణ్యతా శాస్త్రంలో పట్ట భద్రులై 'భారత్ ఎలెక్ట్రోనిక్స్ ' లో ఉన్నత నాణ్యతాదికారిగా పనిచేసిన వీరు అనేక సాంకేతిక పుస్తకాలను ప్రచురించారు. కెనడా, అమెరికా లో స్థిరపడి భగవద్గీత , విష్ణు సహస్ర నామము, లలిత సహస్రనామం లకు ఆంగ్లంలో విశేషమయిన వ్యాఖ్యలను రచించి ప్రచురించారు. ఆంగ్లంలో ఉన్న వీరి వ్యాఖ్యలను ' భీష్మ గీతలో ఉపయోగించడానికి అనుమతించారు. వీరు రచించిన మహా గ్రంధాన్ని తెలుగులోకి మర్చి ఖరిడేల్ వెంకటరావు గారు విజయనగరంలో జన్మించి అనేక కీలక పదవులు పోషించి 'భీష్మ గీత' (విష్ణు సహస్ర నామములకు తెలుగు వ్యాఖ్యలు) పుస్తకానికి ఆధారం. వచన భారతం, భాగవతం, రామాయణం, ఆత్మభోధ , బ్రహ్మ సూత్రములు' వీరి రచనలు కూడా! భాషాపరంగా ఇవన్నీ ఒక ఎత్తైతే  ఖరిడేల్  వెంకట భీమారావు గారు వీటికి చిత్రాలను పొందుపరిచేరు. వీరి జన్మ స్థలం విజయనగరం. ఆంధ్ర . జే. యన్. టి. యు. విశ్వ విద్యాలయంలో పట్టభద్రులై .సి..ఎల్. లో ఉన్నతోద్యోగిగా ఉండి స్వచ్చంద పదవీ విరమణ చేసారు. తరువాత చిత్రరంగంలో విశేష కృషి చేసి పలు పత్రికలకు, పుస్తకాలకు బొమ్మలు వేసారు. ఇవి కాకుండా పౌరాణిక చిత్రాలపై మిక్కిలి మక్కువ కలిగి 'సచిత్ర హనుమాన్ చాలీసా, శ్రీ వేదభారతి వారికి కొన్ని చిత్రాలు వేసారు. నేడు 'విష్ణు సహస్ర నామావళి ' చిత్రాలకు గత 5 సంవత్సరాలుగా శ్రమించారు. వీరి చిత్రాలతో కూడిన 'భజ గోవిందం' పుస్తకం కూడా ఇటీవలే ప్రచురింపబడింది. మహా ప్రసాదమయిన గ్రంధానికై పాటుపడిన వీరు ముగ్గురు కారణ జన్ములు అనడంలో అతిశయోక్తి లేదు. మహా విష్ణువు కృప వీరిపై ఎప్పటికి ఉంటుందని భావిస్తున్నాను

వివరాలలోకి వెళితే...

మహా భారత యుద్ధం తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్మా చార్యుల వారిని ఎన్నో సందేహాలు అడగాలని ధర్మరాజు 6 ప్రశ్నలు అడుగుతాడు 

మొదటిది దైవమంటే ఎవరు

బ్రహ్మ ప్రాప్తికి మార్గము ఏది

మానసిక మయిన, శరీరకమయిన విధానాల ద్వారా ఎవరిని అర్చించి మానవులు సుఖమును పొందగలరు?

సర్వ ధర్మాలలో పరమ ధర్మము ఏది

దేనిని జపిస్తే మనిషి సకల బంధాల నుండి బయట పడతాడు

అనే ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు తన అనుభవ సారాన్ని అంతటినీ రంగరించి శ్రీ విష్ణు నామ సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశిస్తాడు. సమస్త విజ్ఞానానికి ఎన్ని విద్యలు ఈనాటి వరకు ఉద్భవించాయో అన్నింటిలోని విషయ రాశికి ఆధారం శ్రీ మహా విష్ణువు. అని అనుశాసన పర్వంలో 149 అధ్యాయంలో 139 శ్లోకంలో శ్రీ వేద వ్యాస మహర్షి అన్నారు

విష్ణు సహస్ర నామ స్తోత్రంలో సహస్రం ఆంటే వెయ్యి 1000 నామాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మళ్లీ పునరావృతం అయినా మొత్తం వెయ్యి అనే దానికి ఎలా సమర్ధించాలి అని జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు తమ భాష్యంలో ముందుగా ప్రశ్నించారు.అయితే 'సహస్రం' అనే మాటకు 'వెయ్యి' అనే అర్థమే కాకుండా 'అనంతం' అనే అర్థం కూడా ఉంది. విధంగా 'సహస్ర నామములు' అనే పదం అనంత నామ దేయాలను సూచిస్తుంది

అసలు మానవ లోకానికి మహాభారతం అందించిన గొప్ప భక్తి గ్రంధములు రెండు. ఒకటి భగవద్గీత. రెండవది విశ్నుసహస్రనామములు. రెండు వ్యాస మహర్షి విరచితములు. ఆంటే గీతోపదేశం మహా భారత సంగ్రామానికి ముందు జరిగితే, సంగ్రామ అనంతరం జరిగింది సహస్రనామ సంకీర్తన. ఇందులో ప్రతి అక్షరము దేవతా స్వరూపమే! ప్రతి నామము ఒక మహా మంత్రమే! తమ జీవితమంతయు బ్రహ్మ చింతనతో గడిపిన మహర్షులు ఉచ్చరించిన నామములు మహత్వ పుర్నములు. అటువంటి నామములు మన నోట పలికినచో నాలుక స్వాధీనము లో ఉండగలదు. అర్థము తెలియకపోయినా ప్రతి నామమును సుస్పష్టంగా పలికితే చాలు అదే మేలు చేస్తుంది. ప్రతి పలుకులో స్పష్టత ఉంటే చాలు అదే మంత్రం అవుతుంది. అయితే నిరంతరము మెలకువ నిలకడతో శ్రద్ధగా నామ సంకీర్తన జరగాలి. సహస్ర నామములో వివిధ మహోత్కృష్ట మయిన సమన్వయము గోచరిస్తుంది. సృష్టి స్తితి లయములు, భూత భవిష్యత్ వర్తమానములు,బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఆకార మాకారములు ఇలా ఎన్నో ఎన్నెన్నో భవములు మూడు నామములు తెలుపుతున్నవి

పరమ పవిత్ర మయిన, పురుషోత్తమునికి వర్తించని నామములు లేవు.మనుషులు, వారి స్వభావములు, ప్రకృతి, చెట్లు, సెలయేరులు, బండలు. గుట్టలు, జంతువులు, పక్షులు, పంచభూతములు అన్నీ నామములు పరమేస్వరునివే. అన్ని నామములు పరమాత్మునివే!   మహానుభావున్ని దర్శించుకోవాలంటే దివ్య దృష్టి ఉండాలి. ఆంటే మనం మానవులము కదా మనకు దివ్య దృష్టి ఎక్కడనుండి వస్తుంది అనుకోవచ్చు. కాని అది ముమ్మాటికి పొరపాటు. దివ్య దృష్టి మానవులకు కూడా ఉంటుంది. కాని దాన్ని మననుండి ఏకాగ్రతతో తట్టి లేపగలగాలి.    పవిత్రమయిన మనసుతో ప్రార్థించాలి. నిత్య నామం చేసినా తప్పక దివ్య దృష్టి కలుగుతుంది. మహా మంత్రం లాంటి నామ స్మరణమే ఒక యజ్ఞం. అదే నామ యజ్ఞం. కలియుగంలో మనల్ని సంసార బంధాలనుండి కాపాడేది, ఒడ్డుకు చేర్చేది నామ స్మరణమే!

ఒక్కో శ్లోకానికి ఎంత చక్కని విశ్లేషణ ఇచ్చారో ఒక్కసారి గమనించండి 

"ఓం విశ్వంవిష్ణుర్వషట్క రో భూతభవ్యభవత్ప్రభుహు:

భూతకృత్ భూతభ్రుత్ భావో భూతాత్మా భూత భావనః

ఓం విశ్వాయ నమః - ప్రపంచమే తానైన వాడు 

(one who is the universe)

ఓం వశత్కారాయ నమః -యజ్ఞములయందీయన గూర్చి హోమము చేయబడును

( one for whom "vashat" is performed in a yagna)

ఓం విష్ణవే నమః -సర్వత్ర వ్యాపించువాడు 

(One who pervades every thing)

ఓం భూతభవ్యభవత్ప్రభువేనమః - భూత భవిష్య వర్తమాన కాలములకు ప్రభువు

(One who is the ruler of past, present and future)

ఓం  భూతకృతే నమః - సర్వ జీవరాసుల సృష్టి, స్థితి, లయకర్త 

(One who is the creator, sustainer as well as the distroyer of beings)

ఓం భావయనమః - ప్రపంచ రూపమున ఒకడై ఉండువాడు.

(One who is absolute existence, one who manifests himself as the Universe)

ఓం భూతభ్రుతేనమః - భూతములను పుట్టించి పోషించువాడు 

(One who sustains the beings)

ఓం భూతాత్మైన మహ: మాయచే కలుషితం కాని శుద్దమయిన ఆత్మయే తానైన వాడు 

(One who is the self in all beings)

ఓం పరమాత్మనే నమః - పరమ పురుషుడైన భగవంతుడు భౌతికమైన ప్రకృతి నియమ నిభందనలు కతీతుడు 

(One who is the supreme self)

ఇది ఒక్క  ఉదాహరణ మాత్రమే! కాని ఇలాంటి book ఇలా ప్రతి ఒక్క శ్లోకాన్ని పద పదంలో తెలుగులోనూ, ఆంగ్లంలోనూ ఎంతో భక్తి శ్రద్దలతో పొందుపరిచేరు. భక్తులు తమ హృదయాంతరంగంలో విను నాదమే  'శబ్దము' 'స్వన' బడుతున్నది. ఇక్కడ స్వన మనగా 'ఉపిరి' అని అర్థము ఉన్నది. ఋగ్వేద యజుర్వేదాదులు  భగవంతుని ఊపిరి నుండి  వెలువడినట్లు బృహచారుణ్యకోపనిషత్తు  తెలియజేయుచున్నది.వేదమంటే తన ఉపిరిగా భావించే మహా విష్ణువునకు నమస్కారము.

విష్ణు సహస్ర నామావళికి కర్త ఎవ్వరు? ఆంటే ధర్మరాజు సంవాదాన్ని ప్రారంభించిన వాడు అవుతాడు కాని గ్రంధ కర్త కాలేదు కదా? సమాధానం చెప్పిన భీష్ముడు కూడా తాను సంకలనం చేసానని చెప్పుకోలేదు. పైగా ఇవి ఋషుల చేత గానము చేయబడినవి అని అన్నాడు. అందుకే పూర్వ ఋషులు దీనిలో ఉపయోగించబడిన  నామ దేయాలను విడివిడిగానో, సామూహికంగా నో సంకలనం చేసి ఉండవచ్చనే భావన అక్కడ అవసరమే మరియు నిజమే!ఇలా ఆలోచిస్తే మహర్షులందరి చేత గానము చేయబడిన నామ దేయములన్నిటిని సంకలనం చేసి స్తోత్ర రూపంలో చేసిన వెడ వ్యాస మహర్షిని, ఋషుల ప్రతినిధిగా విష్ణు సహస్ర నామ స్తోత్రమునకు కర్తగా చెప్పవచ్చును. స్తోత్రానికి ఎందరో అర్థం భాష్యం రాసారు. ఎన్నో సంప్రదాయాలు వివరణ అందించారు. అయితే గ్రంధములను చదివి ఆకళింపు చేసుకునే యువత, కనీసం ఇష్టపడుతున్న యువత, చదివి అర్థం చేసుకుని ఆనందిస్తున్న యువతలు ఇప్పుడు లేరనే చెప్పాలి. అందుకే వారి ప్రయోజనాల కోసం, తెలుగు రానివరికోసం ఆంగ్ల లో చదువుతారనేదే నా నమ్మకం!

కాలం మారుతోంది. ఆచార వ్యవహారాలలో విపరేతమ మార్పులు వస్తున్నాయి. ఎంత మారిన మనిషిలో మార్పులేదు. ఆకారాలలో మానసిక వికారాలలో మార్పులేదు.  కాని మారాలి. మారాలనే విషయాన్ని వారికి భోధించాలి.  ప్రతి ఒక్కరికి దైవ భక్తిని తెలియజీయాలి

నా కున్న మేధ ఇంత గొప్ప పుస్తకాన్ని పరిచయం చేసేటంత లేదు. కాని ఏదో దైవ సంకల్పం అనుకుని ప్రారంభించాను. మొదట చాల సేపు చదివాను. తర్వాత నాకు తోచిన రీతిలో పరిచయం చెసేను. తెలియని తనం కాని, తప్పులు కాని ఉన్నచొ పెద్ద మనసుతో స్వీకరిస్తారని ఆసిస్తూ, ముగ్గురుని మరోక్కరిని పేరు పేరునా అభినందిస్తున్నాను

 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech