Sujanaranjani
           
  పాఠకుల సమర్పణ  
  పాఠకుల స్పందన
     
 

Response to: june12 vanmayacharitralo

 Name: ముత్తేవి రవీంద్రనాథ్, డేటన్, న్యూజెర్సీ, యు.యస్..

 Message: ప్రియమైన మురళీధర రావు గారూ!రావిపాటి త్రిపురాంతకుడిని గురించిన మీ పరిశోధనా వ్యాసం ఆద్యంతం ఆసక్తిగా చదివాను. అది ఎంత అద్భుతంగా ఉందో మాటలలో చెప్పలేను. త్రిపురాంతకంలోని కుమారగిరి మీది త్రిపురాంతకాలయం, కొండ కింద పద్మసరోవరం లోని బాలా త్రిపుర సుందరీ ఆలయం ప్రసిద్దాలే. మీరు పేర్కొన్నట్టు అక్కడి శాసనాలు పరిశీలిస్తేనేగానీ, రావిపాటి తిప్పన్న చరిత్ర మరింత స్పష్టంగా  ఆవిష్కృతం కాదు.'అంబికాశతకము','త్రిపురాంతకోదాహరణము','చంద్రతారావళి','మదన విజయం', 'ప్రేమాభిరామమ్','యాచ ప్రబంధమ్'వగైరా తన రచనలతో సంస్కృతాంధ్ర సాహితీ సీమల్ని సుసంపన్నం చేసిన మహనీయుడి చరిత్రలోని చీకటి కోణాలపై కాంతి రేఖలు ప్రసరింపజేసిన మీ కృషి అమోఘం.'అంబికా శతకం'లోని పద్యంలోఆ కవి పేరిన వెన్నెలతో రత్నదర్పణం తుడవడం అని పేర్కొన్నా, కొందరు కవులు చకోర పక్షులు వెన్నెల భోంచేస్తాయని పేర్కొన్నా అదంతా కేవలం కవితాత్మకమైన అభివ్యక్తి మాత్రమే.పేరుకొన్నదైనా, పేరుకోనిదైనా వెన్నెలతో అద్దం తుడవడం, కడుపు నింపుకొనడం సాధ్యపడేవి కావు.పోతే 'యాచ ప్రబంధమ్'గురించి రాస్తూ, పిల్లలమఱ్ఱి బేతాళనాయడికి దామ  నాయడు,ప్రాసాదిత్య నాయడు అనే ఇరువురు కుమారులని పేర్కొన్నారు. దామ నాయడికి వెన్నమ నాయడు కుమారుడని పేర్కొన్నారు.(వెన్నమ నాయడి కుమారుడు యాచమ  నాయడు). అయితే వెన్నమ నాయడి సోదరుడు పలనాటి వీర చరిత్రలో మనకు సాక్షాత్కరించే సంఘ సంస్కర్త బ్రహ్మ నాయడు అని పేర్కొన్నారు.అంటే బ్రహ్మనాయడి తండ్రి దామ నాయడా ? మరి చరిత్రకారులు బ్రహ్మ నాయడి తండ్రి  దొడ్డ నాయడని  పేర్కొన్నారు. విషయంలో కొంచెం స్పష్టత అవసరమని భావిస్తాను.దయచేసి వివరించండి.
భాషాసాహిత్యాలకు మీరు చేస్తున్న సేవకు ధన్యవాదాలు

ఏల్చూరి మురళీధరరావు: ఆత్మీయులు శ్రీ రవీంద్రనాథ్ గారికి నమస్సులతో, సాంద్రసుహృద్భావపూర్ణమైన మీ సద్విమర్శనలేఖకు, ఆ లేఖాముఖముఖరితమైన మీ అభిమానానికి, ఆదరానికి, ఆప్యాయనానికి ముమ్మొదటిగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.

బ్రహ్మనాయని తండ్రి దామనాయడా? లేక పలనాటి వీరచరిత్రలో చెప్పబడినట్లు దొడ్డనాయడా? అని మీరడిగిన ప్రశ్నకు సమాధానంకోసం మఱొక్కసారి వెలుగోటి వారి వంశచరిత్రకు సంబంధించి అందుబాటులో ఉన్న ఆకరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత నాకు తోచిన సమన్వయాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.

వెలుగోటి వారి వంశావళి పిల్లలమఱ్ఱి బేతాళనాయని సంతతిని పేర్కొంటూ ఈ విధంగా అన్నది:

శా.    తారుణ్యప్రథమానధైర్యుఁ డగు బేతాళావనీభర్తకున్

        ధీరుల్ పుత్త్రులు దామభూపతి, ప్రసాదిత్యుండు, రుద్రక్షమా

        ధారుండున్ జనియించి; రంతఁ ద్రిజగతద్ధర్మప్రతీ(?)పాలన

        శ్రీ రాజిల్లఁగ శౌరి ముగ్గురయి ధాత్రిన్ మించినాఁడో యనన్.  (. 13)

       

దీని ప్రకారం బేతాళనాయని కొడుకులు దామ నాయడు, ప్రసాదిత్య (ప్రసాదాదిత్య) నాయడు, రుద్ర నాయడు అని ముగ్గురు. ఈ బేతాళనాయని భార్య ఎఱ్ఱక్కసానమ్మ నైజాం రాజ్యంలోని నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా పిల్లలమఱ్ఱి గ్రామానికి పశ్చిమభాగంలో దేవస్థానం దగ్గఱ శా.. 1130లో విభవ సంవత్సర జ్యేష్ఠ శుక్ల తదియ సోమవారం నాడు వేయించిన శాసనంలో యస్యాః పుత్త్రః పవిత్రోన్నతనుతచరిత్రోద్భూతసుఖ్యాతకీర్తిః, మల్లః ప్రోల్లాసితశ్రీః (శ్లో. 32)” అని వీరికి మల్ల నాయడనే కొడుకు కూడా ఉన్నట్లు పేర్కొనబడింది కాని, ఇతని వివరాలు చరిత్రకెక్కలేదు. బేతాళనాయని కొడుకులలో ఎవరికైనా మల్లనాయడనే పేరున్నదేమో! అని కొందఱు విమర్శకులు సందేహించారు.

       నా వ్యాసంలో పై రుద్రనాయని పేరును, ఈ మల్లనాయని పేరును చేర్చుకొనకపోవటం పొరపాటే.

       దామ నాయనికి అనేకమంది సంతతి కలిగినట్లు వెలుగోటి వారి వంశావళి చెబుతున్నది:

       .     అతనికి ననేకతనయులు

                మతిమంతులు పుట్టి రఖిలమాన్యులు, విజయో

                న్నతులున్, నతులును, జతురులు,

                నతులితజగదవనకృతి మహాత్ము లనంగన్.          (.22)

        అని. అయితే, వారి పేర్లేమిటో పేర్కొనలేదు.

      ఈ సందర్భంలో పలనాటి వీరచరిత్ర వెలుగోటి వారికి మూలపురుషుడైన బేతాళ నాయనికి దొడ్డ నాయడు; దొడ్డనాయనికి

            1. పెద్దన్న

            2. బ్రహ్మనాయడు

            3. పేర్నేడు

            4. సూర్నేడు

            5. మల్లినేడు

అని ఐదుగురు కొడుకులు జన్మించారని చెబుతున్నది. ఈ బ్రహ్మనాయడు మాచర్ల రాజధానిలో ఉండేవాడని; 12 గోత్రాల పద్మనాయకులతో కలిసి పడమటి సీమనుంచి కృష్ణానది దాటి పల్నాటికి వచ్చాడని అక్కడి అతీతకథానకం.

      కారెంపూడికి మాచర్ల రాజధాని సుమారు 25 మైళ్ళ దూరంలో ఉన్నది. దానికి పశ్చిమభాగంలో దగ్గఱే కృష్ణానది ఉన్నది. దానికి పడమటి దేశం దేవరకొండ, రాచకొండ రాజ్యం. ఆ కాలంలో దేవరకొండ, రాచకొండ, నల్లగొండ రేచర్ల వారి ఏలుబడిలోనే ఉన్నాయి.

      దామనాయని కొడుకులు అఖిలమాన్యులు విజయో, న్నతులున్ నతులును జతురులు, నతులితజగదవనకృతి మహాత్ములు అన్న పైని వెలుగోటివారి వంశావళిలోని విశేషణాలన్నీ నిజానికి తక్కినవారి కంటె బ్రహ్మనాయనికే సార్థకంగా అన్వయిస్తాయి. అయినా ఎందువల్లనో వెలుగోటివారి వంశావళి బ్రహ్మనాయని ప్రశంసను ఏ మాత్రం తలపెట్టలేదు. ఈ విధంగా సూచ్యార్థసూచనగా చెప్పి వదిలివేసింది.   దామనాయడు పలనాటి వీరచరిత్రలో చెప్పబడిన బేతినాయని (పిల్లలమఱ్ఱి బేతాళనాయని) పెద్దకొడుకైనందువల్ల దొడ్డ నాయడు అని ఆయనకు వ్యవహారనామం ఏర్పడి ఉంటుంది. దొడ్డనాయడనేది కేవలం రాజనందనుని పేరైనట్లు తోచదు. అది దామనాయనికి పర్యాయమే కావాలి.

      1911లో శ్రీ అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు పలనాటి వీరచరిత్రను తొలిసారి పరిష్కరించినప్పుడు భూమికలో ఇలా వ్రాశారు:

      "అనుగురాజు వంశస్థులజాడ యీప్రాంతములఁ గానరాదు. కాని వెలమయైన బ్రహ్మనాయుని గోత్రమువారు మాత్రము కలరు. వారు వెంకటగిరి సంస్థానాధీశులైన వెలుగోటివారు. బ్రహ్మనాయుఁడు రేచెర్లగోత్రుఁడు. వెలుగోటివారును రేచెర్లగోత్రులే. వెంకటగిరి సంస్థానవంశచారిత్రమునందు వంశకథనము చేవిరెడ్డివద్దనుండి చెప్పఁబడినది. చేవిరెడ్డియు మఱియొక మాలవాఁడును బొలముదున్నుచుండఁగా ధనముదొరికె ననియు నాధనమున కా మాలవానిని బలియిచ్చి వాని యభీష్టప్రకారము చేవిరెడ్డి తన గోత్రనామము రేచెర్లగా మార్చెననియుఁ దచ్చరిత్రమందు వ్రాయఁబడియున్నది ...      వెలుగోటివారు బ్రహ్మనాయుని వంశమువారేయై యుందురు."                                   (పు. 42-3లు

అనీ; 1938లో ప్రకటించిన ద్వితీయ ముద్రణ భూమికలో మాచర్లలోని చన్నకేశవస్వామి ఆలయం గుఱించి వ్రాస్తూ -

దీనిని బ్రహ్మనాయుడు నిర్మించాడని పరంపరగా చెప్పుతున్నారు. దీనికి దానం చేసినవారిలో వెంకటగిరి వెలుగోటి రాజవంశపు స్త్రీ ఒకరని అక్కడి శాసనంవల్ల తెలుస్తున్నది.”                                         (పు. 79)

అనీ వివరించారు. బ్రహ్మనాయడు వెలుగోటి వంశీయుడన్న నిర్ధారణకు ఇవి తిరుగులేని సాక్ష్యాలు. మతాభినివేశం కారణంగానూ, సంస్కరణప్రియుడైనందువల్లనూ బంధువులతో విరోధాన్ని తెచ్చుకొన్నందువల్ల ఆప్తులు, సన్నిహితులు వంశచరిత్రలలో చేర్చుకొనక ఉపేక్షించారో.

      పలనాటి వీరచరిత్రలో బ్రహ్మనాయని తండ్రి దొడ్డనాయడు కూడా హైహయుల మంత్రిగా ఉండినట్లు చెప్పబడింది. దామనాయుడు మహాపరాక్రమోపేతుడై రాజ్యవిస్తరణ కావించిన ధీరోదాత్తుడని వెలుగోటివారి వంశావళి అంటున్నది. ఈ కథాకథనాల పారస్పరికవిరోధానికి కారణం బ్రహ్మనాయడు కన్నవారిని, ఉన్న ఊరిని వదలుకొని పలనాటి సీమకు వచ్చి స్థిరపడిన తర్వాత పుట్టిన దూరోదంతమై ఉంటుంది. అంతేకాక వీరచరిత్ర గాయకుడు బ్రహ్మనాయని పుట్టుపూర్వోత్తరాలు, వంశోదంతాల విషయమై అంతగా శ్రద్ధ వహింపలేదని భావింపవలసి ఉంటుంది.

      వెలుగోటివారి వంశావళి ఈ బ్రహ్మనాయని కథను విడిచిపెట్టి, రాజ్యవ్యవహారాలలో తండ్రికి తగిన తనయులై ప్రసిద్ధికి వచ్చినవారు కాబట్టి వెన్నమనాయక సబ్బినాయకులను స్మరించి -  

       .   వారలలోనఁ జాల ననివార్యపరాక్రము లిద్ద ఱన్వయో

              ద్ధారులు దానశూరులు నుదాత్తమనోహరకీర్తిహారులున్

              భూరిరిపుప్రతాపులును బుణ్యవిహారులు నిర్వికారులున్

              వీరులునై చెలంగి రిల వెన్నమనాయక సబ్బినాయకుల్.                                                                                  (. 23)

      అని వెన్నమనాయక సబ్బినాయకులు ఇద్దఱి విజయగాథలను మాత్రమే వర్ణించింది. బ్రహ్మనాయని ఉదంతాన్ని తలపెట్టలేదు.

      దామనాయడే బ్రహ్మనాయని తండ్రి దొడ్డనాయడని ఈ ఏకార్థీభావాన్ని వెల్లడిస్తూ వెల్లాల సదాశివశాస్త్రి గారు, అవధానం శేషశాస్త్రి గారలు కూడా 1910లో తమ వెలుగోటివారి వంశచరిత్రము (పు. 18)లో వ్రాశారు.  అందులోని కొన్ని భావాలను నేనిక్కడ అనువదించుకొన్నాను.   

      ఇప్పటికి తోచిన సమన్వయం ఇది. దీనిని ఈ వ్యాసపరంపరకు ముద్రణభాగ్యమంటూ ఉంటే అప్పుడు మీ వ్యాఖ్యాసమేతంగా పునఃపరిష్కరించే అవకాశం కలుగుతుంది.

      శ్రీ త్రిపురాంతకక్షేత్రంలోని శాసనాల ప్రతులను తీయించటం, కొంతవఱకు వాటి ప్రకటన ఒకప్పుడు సుప్రసిద్ధ చరిత్రపరిశోధకులు శ్రీ పి.వి. పరబ్రహ్మశాస్త్రి గారి పర్యవేక్షణలో జరిగి, ఆ తర్వాత ఆగిపోయింది. వాటి సమీచీనమైన అధ్యయనం జరగలేదు. వాటికి తోడు రావిపాటి త్రిపురాంతకుని సాహిత్యస్వరూపనిరూపణార్థం పలనాటి వీరచరిత్రను, వెలుగోటివారి వంశావళిని, వెంకటగిరి రాజుల చరిత్రను ఇంకా మఱింత లోతుగా పరిశీలింపవలసిన ఆవశ్యకతను మీ లేఖ మఱొక్కసారి గుర్తుచేస్తున్నది.

      వ్యాసాన్ని ఎంతో దయతో చదివి, మీరు వ్రాసిన సౌజన్యపూరిత వాక్యావళికి కృతజ్ఞుణ్ణి.

సర్వ శుభాకాంక్షలతో, ఏల్చూరి మురళీధరరావ

Response to: june12 vanmayacharitralo

Name: padmanabharao revuru, hyderabad

Message: tripurantakuni pye ardhavanta myana charch chesasru. tripurantakam is in prakasam dt. yachendras are venkatagiri rajas.but this yachendra must be different.

ఏల్చూరి మురళీధరరావు: మాన్యులు డా. రేవూరు పద్మనాభరావు గారికి నమస్కారములు.

మీ ఆదరపూర్వకమైన స్పందనకు, వ్యాఖ్యకు ధన్యవాదాలు. త్రిపురాంతకం ప్రకాశం జిల్లాలో ఉండటం వల్ల, రావిపాటి త్రిపురాంతకుడు తత్పరిసరప్రాంతీయుడు కావటం మూలాన మీరు నా వ్యాసంలో ప్రతిపాదింపబడిన యాచ ప్రబంధ కథానాయకుడు త్రిపురాంతకానికి, కాకతీయుల పరిపాలనాక్షేత్రానికి దూరస్థమైన వెంకటగిరి రాజవంశంతో సంబంధం లేని వేఱొక యాచేంద్రుడు కావచ్చునన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, వెంకటగిరి రాజులు కాకతీయులతో నెఱపిన మైత్రీబంధాన్ని గుఱించిన ఉపలభ్యమైన చారిత్రికాధారాలన్నింటినీ నా వ్యాసంలో సహేతుకంగా పొందుపఱిచాను. యాచ ప్రబంధం అన్యతమయాచేంద్రుని ఉపలక్షించిన రచన కానేరదని సంచికలోని రెండవ భాగాన్ని కూడా పరిశీలించిన తర్వాత కూడా మీరు భావించినట్లయితే దయచేసి తెలుపగోరుతున్నాను. భవదీయుడు,

Response to: june12 vanmayacharitralo

Name: Dr.M.Sampath Kumar, india

Message: wonderful and thought provoking article.

ఏల్చూరి మురళీధరరావు: మాన్యులు డా. మాడభూషి సంపత్ కుమార్ గారికి, మీ ఆదరానికి, సౌజన్యపూర్ణమైన స్పందనకు ధన్యవాదాలు. భవదీయుడు,

 Response to: may12 bhima-satakam

 Name: ramana balantrapu, yemen
 Message:
చాలా బాగున్నాయండీ !
భీమ శతకం తప్పక ప్రతీ  ఇంట్లో గ్రంథాలయం లో వుండవలసిన పుస్తకం. కొన్ని పద్యాలైతే ఆణిముత్యాలు, నిత్యపారాయణ యోగ్యత కలిగి వున్నవి.

భీమశంకరం : ఆర్యా, మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మే సంచికలొనే, "హృద్యం-ఫద్యం" శీర్షికలో నా మరొక రచన "నందన వసంత శోభ" గూడా చదవండి.
ఇట్లు, భవదీయుడు,

Response to: june12 sanivarasatakam

Name: padmanabharao revuru, hyderabad

Message: sundara swami

mee satakam sasntam chadivanu. adbhuta padya rachana. vyngyoktulu kokollalu adhunika samajam pye adoka charitra.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: Krishna Pillalamarri
Subject: Sujananeeyam

 

రావు గారూ, మీ తాజమహలు విశ్లేషణ అద్భ్హుతం. చాలా కాలంగా దీనిగురించి అనుమానం ఉన్నా, ఎవరికీ తెలియచెప్పలేని స్థితిలో ఉండడంవల్ల ఎవరినైనా నిలదీయడం కష్టమయ్యేది. మీరు ఇప్పుడా పని సులభ సాధ్యం చేసారు.

మాసం వ్యాసంలో రెండు అనుమానాలు మిగిలిపోతున్నాయి. అవి చిన్నవే కాబట్టి, మీరు వాటిని త్వరలోనే పూర్తి చేస్తారని నమ్ముతున్నాను.

1. దక్షిణ భారత దేశంలో ఆలయాలలో లోహ దీప స్థంభాలు ఉండడం గమనించాము. ప్రతి ఉదహరించిన ఆలయ నిర్మాణ కాలంకూడా అక్కడే రాస్తే, సాంప్రదాయం హిందువులదే అని పూర్తిగా రుజువవుందని నా మనవి.

2. సప్తకోటేశ్వర మందిరం (గోవా) ఫొటో వేసారు. దాంట్లో దీపస్థంభం కన్నా ఆలయ గోపురమే నన్ను ఆకర్షించింది. ఇది కూడా తాజమహలు గోపురాకృతిలోనే ఉండడం గమనార్హం. అయితే, గోపురం పైన ఉన్న ధ్వజం ఆకృతిలో ఉన్నదో నాకు సరిగ్గా తెలియలేదు. ఒకవేళ ధ్వజంకూడా చంద్రాకృతిలోనే ఉండి, ఆలయంకూడా 15 శతాబ్ది ముందరదైతే, మనకి చాలా విషయాలు అవగతమవుతాయి.

మనం వాస్తు కళని విస్మరించి కోల్పోయినదేమిటో భారతదేశంలో కూడా పూర్తిగా ప్రచారం చెయ్యాల్సిన అవసరం ఉంది. కాబట్టి, మీకు ఇదివరలో ఇచ్చిన సలహా మళ్ళీ ఉదహరిస్తున్నాను: మీరు వెంటనే 8 అంకాల వ్యాసాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసి, ఇండియాలో ఉండే మంచి న్యూసు పేపర్లకి, మేగజైనులకి పంపండి. హిందూ పేపర్ దీన్ని తప్పక స్వీకరిస్తుందని నా నమ్మకం. ఇతర మతీయులని మన దేశంలోకి రానిచ్చి మనం ఎంత పోగొట్టుకున్నామో మన వాళ్ళకే తెలియదంటే ఆశ్చర్యం లేదు.

భవదీయుడు,

పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు

రావు తల్లాప్రగడ: ధన్యవాదాలు కృష్ణకుమారు గారు, మన దురదృష్ఠవశాత్తు హిందువులకు  చరిత్ర వ్రాసుకునే అలవాటు మొదటి నుంచీ లేదు. ఎప్పుడైనా, కవి యైనా, తన భక్తి పారవశ్యంలో ఒక దేవుడి గురించి ఏమైనా ఒక పాటగానో పద్యంగానో వ్రాసుకుంటే, అందులో దొరికేవే మనకు చారిత్రాత్మక ఆధారాలును సాక్షాలును. దానితో పాటు కవిత్వంలో సాధారణంగా వాడే అతిశయోక్తి ఉత్ప్రేష ఉపమాన అలంకారాల వలన సత్యాసత్యనిరూపణ క్లిష్టమవుతుంది. మన చారిత్రాత్మక కట్టడాలక పైన సరైన విశ్లేషణ నడిపి, వాటి చరిత్రను ఒక క్రమ మార్గంలో పరిచయం చేయడానికి ప్రత్నించింది, నిజానికి ఆంగ్లేయులే. బ్రిటీషు వారు తమ హయాంలో, ఆర్కియాలజీ డిపార్టుమెంటుని స్థాపించి, తద్వారా ఎన్నో పురాతన కట్టడాలకు భద్రతను ఏర్పాటుచేసారు.

కేరళలోని ఆలయాల సంగతి కూడా దాదాపు అంతే. అన్ని ఆలయాలు చాలా పాతవే కానీ, అన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించినవే! ఇప్పుడు మనకు కనపడేవి అన్ని దాదాపుగా 19 శతాబ్ది కాలంలో పునర్నిర్మించినవే. అంటె అంతకు ముందు అవి ఎలా  వుండేవి అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు. ఎక్కడా పునర్నిర్మాణానికి ముందున్న ఆలయాల డాక్యుమెంటేషన్ దొరకదు. హిందువుల కట్టుబాట్లు కొంచెం నిష్టసాంప్రదాయాలతో కూడుకున్నవి కనుక, ఉజ్జాయింపుగా ఆలయ వాస్తులో పెద్ద మార్పు జరగలేదని మనం ఊహించుకోవడం తప్ప ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి మనది.

ఇహ సప్తకోటేశ్వరమందిరం సంగతి కొస్తే ఇది పోర్చుగ్రీసు వారి కాలంలో కట్టబడినది. గోవాలో దాదాపు అన్ని ఆలయాలలోనూ, డోములు కనిపించడం సామాన్యమే. వీటి పైన సార్సెనిక్ వాస్తు ప్రభావం వుందని మనకు వినిపించే వాదన. కానీ పోర్చుగీసు కాలంలో మహమ్మదీయ సార్సెనిక్ ప్రభావం ఉండటం సాధ్యం కాని పని. ఐతే అది యూరోపియన్ ప్రభావం అయివుండవచ్చు. డోములు కూడా యూరోపియన్లవి అయివుండవచ్చు. (లేక పోతే మన వాదన ప్రకారం హిందువులవే అని అని అనుకోవచ్చు). కానీ దీపస్తంభాలు మాత్రం యూరోపియన్వి కావని చెప్పవచ్చు. ఎందుకంటే యూరోపియన్లకి ఆచారం లేకపోవడమే కాదు,  దీపస్తంభాల " Indian indigenous  archeological continuity" మనకు కనిపిస్తోంది  కనుక. అందుకనే దీపస్తంభాల వరకే పరిగణలోకి తీసుకుని డోముని విశ్మరించాను.

మీ వంటి వారి సహకారం వుంటే వ్యాసాన్ని తప్పకుండా ఆంగ్లానువాదం చేసి ఆవిష్కరించగలము. హిందూ వంటి న్యూసు పేపర్లకి ఇది మరీ పెద్దదవుతుందేమో? ఇప్పటికే 150 పేజీలు దాటిపోయింది. విషయంలో మీ సలహా మళ్ళీ తీసుకుంటాను! కావాలి కూడాను!

From: Uma Pochampalli
Subject: opinion

రచియి౦చిరి వారలు భాషాపరిర౦భమున ఆరితేరి

కావ్యమాలాల౦కారముల నొనరు సత్కృతులు

కమనీయ సాహితీ సౌరభ వీచికల౦దగనానాడు

ఆఘ్రాణి౦పమాసుగ౦ధములీ డె౦ద౦బున నేడు!

వాడెను మల్లెలు, మొల్లలు, వాడెను కమల

సరోవరమున విరిసిన ఎర్రని చె౦గలువలు

వసివాడెను హిమవన్నగ కస్తూరి సౌరభాలు,

వాడనివి సాహితీ సుమమాలలు ఏనాటికిన్!

కొ౦త ఆన౦దము, కొ౦త ఆశ్చర్యము,

కొ౦త విస్మయము, ఒకి౦త తన్మయము

నవరసాలనొలుకు కావ్యముల తలచిన౦త

ఇక చదివినచో నె౦తకలుగునో భాగ్యము!

గణముల నె౦చలేదు, మనమున విరిసిన భావనల్ దక్క

యతిప్రాసల గతులెటున్నవో తెలియదు వాదముల్ దప్ప,

పరిణతి చె౦దని ప్రయత్నమిది, జన్మలో రాయలనో లేదో

అనిలముతోడ రవళి౦చు సుమధుర పదముల పద్యముల్!

వాసికెక్కిన కవుల వ్రాతలు కననైతిని౦కను,
చేతనములు ఉడిగి నిశ్చేచేతనములాయె
కరముల కావ్యము రచియి౦పగలనొ లేదొ
సుజనుల ర౦జి౦చు సుజనర౦జని కాని

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: samrajyam srinivasarao

Subject: Re: Fwd:

 

Dear Sir,

Thank you for forwarding the article on "NANNA GARU". It is quite interesting we are able to read a few well known names we had come across in magazines and literary books.

I shall contact you soon.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 indexpage

Name: KALI

Message: Nice. thanks

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: may12 indexpage

Name: brahamaiah

Message: very good magazin very very good

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: may12 kavita-5 veli

Name: srinivas udimudi

Message: సుజనరంజని మాస పత్రిక చాలా బాగుంది. ఫన్ కౌంటర్ లో సినిమాల గురించి చెప్పిన మెసేజి చాలా బాగుంది. అది చదివి కొంతమందైనా మారతారని ఆశిస్తున్నాను.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: Elchuri Muralidhara Rao

Subject: Sujananeeyam

Dear Sri Rao garu,

Once again, your own grippingly narrated, highly educative, eminently readable Research Article on Taj Mahal and the history of Light Houses in Indian architecture is so thorough that I am eagerly looking forward to its next installment … With warm regards,

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 tolipaluku

Name: suman, aakasam

Message: ఇంత బుర్నీసులు కుర్నీసులు అంతె ఏంటి సార్? సిలికానాంధ్ర కు అవి ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? వాటికి తాజమహల్ కు ఉన్న సంబంధం పత్రిక ముఖంగా తెలుపగలరు.

ఇంకో చిన్న అనుమానం! సిలిచొనంధ్ర కు గిన్నీసులు చ్చాయంతూ ...సన్నాయిలు బూరాలు బాకాలు చూపించారు చిత్రంలో ....ఇందులో చక్కని వ్యంగ్యం కూడా ఉందా ,లే యాద్రుశ్చికమా?

రావు తల్లాప్రగడ: ఆయ్యా ఆకాశరామన్నగారు

సిలికానాంధ్రకు గిన్నీసు రికార్డులు ఎలా వచ్చాయో తెలుపుతూ "మంగళవాద్య సమ్మేళనం" అని ఒక పెద్ద వ్యాసాన్ని కస్తూరి ఫణిమాదవ్ గారు జూన్ సంచికలోనే వ్రాసారు కదండి. అదే కవర్ స్టొరీ. ఇక బుర్నీసులు అంటే ఉన్ని శాలువలు, కుర్నీసులు అంటే నమస్కారాలు, వెరసి సన్మానమని భావము. బాకాలు ఊదడం మా సొంత డబ్బా అనుకున్నా ఫరవాలేదు కానీ, వచ్చిన అవార్డులు సన్నాయి మేళానికే కనుక, వాటినే ముఖచిత్రంగా తీసుకున్నాము. అంతే కానీ వ్యంగ్యమేమీ నాకైతే తోచడం లేదు. అన్నిటిలోనూ డబలు మీనింగులు తీసుకునే రోజులివి. మీకేమి అర్థం కనిపించిందో మాకు అర్థం కాలేదండి.

తాజమహలుకి మంగళవాద్యాలకీ ఎటువంటి సంబంధం లేదండి. దయచేసి మీరు అంటగట్టకండి.

From: saibaba
To: Rao Tallapragada
Subject: Re: SiliconAndhra SujanaRanjani April 2012 Issue Released

we are very much int  to participate any of the program me ,so kindly inform us

రావు తల్లాప్రగడ: We will announce all our programs on Siliconandhra website. Kindly keep checking and please do participate. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 rachanalaku

Name: Mohan Devaraju

Sub: పాఠకుల స్పందనాలు
 Message:
పాఠకుల స్పందనాలు

పాఠకుల స్పందనాలలో స్పందనాలన్నీ ఇంగ్లీషు లో నే ఉండాలని మీరు ఒక కొత్త రూల్ పెడితేనో?

మీ సమాధానాలన్నీ తెలుగులోనే ఉన్నాయి గా మరి?

రావు తల్లాప్రగడ: నిజమే ఇది తెలుగు పత్రిక కనుక, అందరూ తెలుగులో వ్రాస్తేనే బాగుంటుంది. పాఠక ప్రభువులందరికీ తెలుగులోనే వ్రాయమని మా విజ్ఞప్తి. మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: ఓలేటి వెంకట సుబ్బారావు, వెర్నాన్ హిల్స్  IL
Subject: Sujananeeyam

ఆప్త మిత్రులు శ్రీ రావు గారికి-

నమస్కారములు. 'సుజనరంజని ' తాజా పత్రిక ( జూన్ , 2012 ) చూసాను . అందచందాలతో  - కమనీయ రచనలతో - పత్రిక  సర్వాంగ సుందరం గా  ఉంది. దీనికి  రూప శిల్పి  మీరు మీకూ ,ఇందులో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికీ- పేరు -పేరునా  నా  అభినందనలు.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 indexpage

Name: Kharidehal Venkata Rao, Secunderabad

Message: Very happy to be introduced to this Telugu monthly e-magazine by my friend, close relation and well-wisher, K.V.Bhima Rao

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 indexpage

Name: krmchari, Hyderabad

Message: Excellent website to protect telugu for future

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: murthy mandapaka
Subject: Re: SiliconAndhra SujanaRanjani June 2012 Issue Released

Rao garu, dhanyavadalu sir

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: innaiah narisetti
Subject: your blog

Dear Rao garu

Namaste. I happened to see your blog Sujana Ranjani and I appreciate your efforts in bringing it very sane way. That is why I am writing to you though I donot know you hitherto. Please keep it up.

I am in Maryland.


రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 indexpage

Name: nivedita, texas

Message: telugu dictionary would be a good place to start understanding the language

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: mar12 kavita-6 prapancha matrubhashadinam

Name: ఉమ, Sugar Land


Message:
రచియి౦చిరి వారలు భాషాపరిర౦భమున ఆరితేరి

కావ్యమాలాల౦కారముల నొనరు సత్కృతులు

కమనీయ సాహితీ సౌరభ వీచికల౦దగనానాడు

ఆఘ్రాణి౦పమాసుగ౦ధములీ డె౦ద౦బున నేడు!


రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 advitam

Name: sonaji prakash chander, Hyderabad

Message: సుజనరంజని నిర్వహకులకు నా అభినందనలు. ఎలాంటి చక్కటి జ్ఞాన - విజ్ఞాన తార్కిక విషయములను మాలంటి వాళ్ళకు అందిచుతున్నందుకు.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 మంగళవాద్యం

Name: kb lakshmi, hyderabad


Message: pathrika chaalaa pthaneeyamgaa vundee mangalavaayidya coverage wonderful.lakshmikb

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: may12 sujananeeyam

Name: premkumar

Message: తాజమహల్ లో అభిషేకం జరుగుతున్న శివలింగం ఫొటోస్ వ్వలేదు ? హిందు మతానికి ఇది అభివృద్ది చిహ్నం. దయచేసి వేమన పద్యాలు చేర్చండి.

రావు తల్లాప్రగడ: తాజమహల్ లో అభిషేకం శిల్పాల ఫొటో జూను నెల లోని భాగంలో ఉందండి. మీ బ్రవుజరుని మళ్ళీ ఒకసారి రెఫ్రెష్షు చేసి చూడండి. ఆర్టికలు హిందు మతాభివృద్దిని ఉద్దేశించినది కాదు కానీ మీకు నచ్చినదుకు అనందము. వేమన పద్యాలు ప్రయత్నిస్తాము.

Response to: may12 sujananeeyam

Name: VISHNU

Message: e news chalabagundi

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 indexpage

Name: mahesh

Email: mahi,gangana

City: anantapur

Message: excellent

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 indexpage

Name: k.ramraj, ap.warangal

Message: all books v......v......nice

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 indexpage

Name: Prasad.dvs, Hyderabad

Message: Mee Magazine chuusaka oka manchi pustakanni chadivina trupti undi. Dhanya vadamulu.

రావు తల్లాప్రగడ: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: may12 kavita-5 veli

Name: Prasad Pendyala

Message: Emandi , Meelo Oka sirivennela seeta ramasastry, oka veturi kanapaduthuarandi

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: may12 gaganatalam

Name: Roja

Message: oka chota "rama parivaram seetha ni ela kolpoindi ante arjanudu nirminchina parnasala dwaram ani tappuga rasaru" lakshmanudu anaboyi?

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 katha-2 reitubidda

Name: MJ, Raitu Bidda - Story

Message: Good one. Nice writing style.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 advitam

Name: Balamurali Krishna Goparaju, Sugar Land

Message: Very well written and comprehensive. Though all the explanation about energy, light, and some explanation about relativity seemed impertinent at begining, it matched well with the concluding statement. I have seenseveral articles of similar nature. At the end when it comes to the question of the very life source, we figure out we cannot proceed any further without jumping to our vedic texts. How and why energy forms ceases to be life or becomes life is a question without any scientific explanation. Oue science it self is a under developed art or tool. One cannot hope to travel a long distance in a car that is impaired.

However, i liked your article a lot.

Thank you sir for your attempt to explain the mystery.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

From: ఉమా దేవి అద్దేపల్లి , కాలిఫోర్నియా ( USA)


Subject:
అద్వైత సిద్దాంతము

ఈనెల అనుకోకుండా సుజన రంజని చదవడం తటస్థించింది. శ్రీ రాయ పెద్ది అప్పాశేష శాస్త్రి గారి ‘’ అద్వైత సిద్దాంతము .చదివాక ఇది వ్రాయాలనిపించింది.

వారి వివరణ అమోఘం. నిజానికి సైన్స్ , ఆధ్యాత్మికం , ఒకే నాణానికి బొమ్మ, బొరుసు లాంటివి. పదార్థ విజ్ఞానం భౌతిక స్థాయిలో మానవాభ్యుదయానికి తోడ్పడితే, పరార్ధ జ్ఞానం అంతరంగ చైతన్యాభిద్ధికి సహకరిస్తుంది. మొదటిది మానవ జీవితాన్ని సులభతరం చేస్తే, ఇంకొకటి ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రాప్తింపచేస్తుంది. ఒకటి అశ్వరం , వేరొకటి అనశ్వరం.

వారు చెప్పినట్లు, సర్వంఖల్విదం బ్రహ్మ , తత్వమసి , అని చిలక పలుకులు వల్లించడం కాదు ఆత్మసాక్షాత్కారం పొందడమంటే. అపార సాధనా సంపత్తి అవసరం.చిన్న విత్తులో పెద్ద వృక్షం దాగివున్న మాట నిజం, కాని విత్తును చూపి వృక్షం అనగలమా ! సైన్స్ నిజమని, వేదాంతం అనేది పుక్కిటి పురాణమని కొట్టి పారేసేవారు ‘’ కావడి కొయ్యే నొయ్, కుండలు మన్నేనోయ్’’ అని ఒక్క ముక్కలో తేల్చి పారేస్తారు. మాటలొ పాక్షిక సత్యం లేక పోలేదు. కాని అది పరమ సత్యం మాత్రం కాదు. అందుకే వేదాంత జ్ఞానం అనేది క్షీర సాగర మధనం లాటిది. జ్ఞానాన్ని అమృతం అన్నారు. అనంత సత్యం అందుకొనడం అందరికి సాధ్యం కాదు కనుక స్థాయి కి మానవుడు ఎదిగే వరకు పాక్షిక సత్యానికి విలువ నివ్వక తప్పదు.నిప్పు రవ్వ ఏదో ఒకనాడు ప్రజ్వరిల్లే అగ్నిశిఖ కాకుండా వుంటుందా! విత్తు మొలకెత్తి వృక్షం కాక పోతుందా!

‘’సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ‘’ అని దీనిని గురించి ఎంత చెప్పినా అంతు, దరి వుండదు.

ముఖ్యంగా , లేఖ వ్రాయడానికి కారణం, కాలం, దివారాత్రాలు గురించి శాస్త్రి గారు వ్రాసిన వాక్యాలు చదువుతుంటే, నెలలో ఎమెస్కో ప్రచురణ సంస్థ ద్వారా విడుదల కానున్న నా నవల ‘’ ప్రేమ మందిరం’’ లోని వాక్యాలు గుర్తుకొచ్చాయి. అదే భావాన్ని, వారు వెలిబుచ్చిన విధం గానే నేను వ్రాయడం జరిగింది. భాష కాని, భావం కాని ఎవరి సొంతం కాదనుకోండి. క్షరం కానిది అక్షరం, భావాన్ని వెలిబుచ్చే సత్యం అనంతం. కాకపోతే, శాస్త్రి గారి లాటి మేధావులు వ్రాసిన అమూల్య వాక్యాలలో, నా లాటి అనుభవం లేని వారి వాక్యాలు చూడగానే నాకు ఆనందం కలిగింది.

తూర్పు, పడమర, దేశకాల విభేదాలు, ఇవన్ని మన సౌలభ్యం కోసం మనం ఏర్పరచుకున్నవే. సూర్యుడు నిత్య ప్రకాశి. ఆత్మ స్వరూపం కూడా అంతే అంటారు కదా వేదాంతులు.

బాహ్య జగత్తును ప్రభావితం చేసేది కర్మ సాక్షి, సూర్యుడు . అంతరంగ జీవనాన్ని ప్రకాశమానం చేస్తూ, సాధారణ మానవ జీవనాన్ని దివ్య జీవనంగా రూపాంతరం గావించ గలిగే ఆధ్యాత్మిక సవిత్రు శక్తి , దివ్య జీవన సిద్దాంతాన్ని ప్రపంచానికి అందించిన శ్రీ అరవిందుల ‘’సావిత్రి’’.

మరి మీవంటి విజ్ఞులు ఏమంటారో !

శెలవ్ ,

నమస్కారములతో ,

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 maanannakujejelu

Name: radha, pondicherry

Message: Tear came out.She showed the relation betwen the parents and children.Realy this is a nice message for the young generation to remind their elders.now a days they dont know atleast their grand parents.We are very much impressed with this message.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 maanannakujejelu

Name: R.V.Shyamala devi, chennai

Message: Smt.Addepalli umadevi gari seershika nannaki jejelu chala bavundi,pata gnapakalani kotta paddhatilo (on line publish cheyadam)prajalaki andinchadam nijam ga abhinanadaneeyam,nanna ki jejelu chadivaka kanneellu agaledu,endukante a nanna prema ni assalu pondaleni a intlo akhari santananni nenu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 indexpage

Name: Kharidehal Venkata Rao, Secunderabad

Message: Do you publish book reviews of only Telugu books or English books also? About a week ago, Strategic Book Publishing Group, Houston, Texas, published my book GLORY OF INDIAN WOMEN and released for sale all over the world.

సుజనరంజని: Our book reviews are on Telugu books only. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 rachanalaku

Name: INDURTHI VENKATA PRABHAKARA RAO, hyderabad, A.P, India

Message: Sir,

Please let me know within how many days you will be able to communicate the acceptance / rejection of the articles sent to you for publication.

సుజనరంజని: We apologize for the delay due to a lot of articles that we have been receiving. Thanks to great readership and support from great authors like you. Kindly bear with us. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 kavita-1 ఎంత కష్టం ! ఎంత కష్టం

Name: b v rao, TUNI  AP INDIA


 Message: excellent thought provoking reading. try to introduce the writings of american philosophers and socio cultural history of America to compare with our culture in a constructive criticism. bye the way where is the down load for TELUGU font???సుజనరంజని: We will certainly try to bring you all kinds of articles. You can download fonts from Siliconandhra web site. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 o...sari

Name: ramana balantrapu, yemen


 Message:
ఒక్క కలం పోటుతో నన్ను నా బాల్యంలోకి నెట్టేశారు.  అంటే నిన్నా మొన్నా అనుకుంటున్నారా - యాభై ఏడు, యాభై ఎనిమిద్  ఏళ్ళ పైమాటే.   నాతో పాటు అలా ఎన్ని వేలమంది పాఠకులు అలా ప్రయాణించారో.  అంతమందిని అలా ఒక్క క్షణంలో పుష్పక విమానంలాటి ఒక  టైం మిషీన్లో కూర్చోపెట్టి ప్రయాణం చేయించిన డా. మూర్తి గారికి  ధన్యవాదాలు, అభినందనలు.


ఇకపోతే మెచ్చుకోవాలంటే, "వర్షం పదుతొంది బయట కానీ నా గొంతులో కాదు కదండీ" నుండి వేమన టైప్  పద్యం వగైరా వగైరా మెచ్చుకుంటూ పోతూ ఉంటే "ఒకసారెమైందంటే" మొత్తం తిరగ రాయాల్సివస్తుంది.   నా వల్ల కాదు బాబూ.
అలాగే నా  ఆరో ఏట నా చేత పోస్టాఫీసు పనులు, బ్యాంక్ పనులూ చెయించిన మా నాన్నగారి తీపి గుర్తులూ మళ్ళీ రప్పించారు.

మూర్తి జొన్నలగెడ్డ: రమణ గారూ,

మిమ్మల్ని చిన్న పిల్లాణ్ణి చేసెయ్య గలిగిన౦దుకు ఆన౦ద౦గా ఉ౦ది. నా పోష్టాఫీసు ముచ్చట్లు గుర్తు చేసిన౦దుకు మీకూ ధన్యవాదాలు. మా నాన్న గారు, మెయిల్ కి ఇన్ స్టె౦టు గా రిప్లై ఇచ్చినట్లు వె౦ఠనే ఉత్తరాలకి జవాబులు రాసేసేవారు. అ౦దువల్ల ఉదయ౦ తొమ్మిదిన్నర గ౦టలకు పోష్టాఫీసుకు వెళ్ళి సార్టి౦గు వి౦డో దగ్గర ని౦చుని, ఎవరైనా కనిపి౦చగానే "ఏవ౦డీ, కూచిమ౦చి వారి అగ్రహార౦ పోష్టుమేను పట్టాభి గారున్నారా౦డీ" అని అడిగి, ఆయన వొస్తే ఏవైఁనా లెటర్సు ఉ౦టే పట్టుకుని ఇ౦టికి పరుగెత్తీ వాళ్ళ౦. వెయిటి౦గులో, పక్కనే ఉన్న ఉత్తరాలు రాసుకునీ బల్ల మీదున్న కుళ్ళు క౦పు కొట్టీ లైపి౦డి గానీ, తుమ్మజిగురు వాసన గానీ అనుభవి౦చ వలసి వొచ్చేది. ఇ౦టికెళ్ళగానే, మేడ మీద రౌ౦డు టేబుల్ దగ్గర కార్డులూ, ఇన్ లా౦డ్ లెటర్సు రెడీగా పెట్టుకును౦డీ వారు. ఆయన వె౦ఠనే లెటరు్స చదివి గబ గబా రిప్లై రాస్తే, పదిన్నర గ౦టల క్లియరెన్సు లోపు పోష్టు బాక్సులో పడేసీ వాళ్ళ౦.

రోజుల్లో కూడా క్లట్టర్ మెయిలు చాలా వచ్చేది. అలా౦టి వాటిని మా నాన్న గారు దక్షిణాలు ఆనేవారు. " రోజు ఉత్తరాలు తక్కువ, దక్షిణాలు ఎక్కువ" అనేవారు. వాటిలో ఉ౦డే ఫొటోలు కత్తిరి౦చుకుని పుస్తకాల్లో అ౦టి౦చుకునీ వాణ్ణి.

Response to: june12 katha-2 reitubidda

Name: rds prakash, hyderabad

Message: bhagavundhi

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: mar10 ramayanamlo emundi

Name: v.obulesujai

Email: jaisreeramobulesu , tadpatri515411 anantapur

Message: ramayanam kanna rama namame minna

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 maanannakujejelu

Name: K.V.BHIMARAO, Rochester,MN

Message: a very touching narrative style, of Smt.Umadevi garu made my eyes moist.

Knowing your father is a great quality which only a few can posses

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 rachanalaku

Name: Palagummi Rama Krishna Rao, Hyderabad

Message: Sir,

Recently I wrote my 4th Telugu novel. First two were published in Andhra Bhoomi Weekly and the 3rd one is now publshing in Koumudi net magazine. May I send the present new novel in PDF form to your for perusal?

సుజనరంజని: Please do send in Telugu unicode fonts. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 annamayya

Name: prasad, samalkot

Message: send me sujanaranjani patrika in my mail i.d.

సుజనరంజని: Sure we will send you the link everry month. మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 maanannakujejelu

Name: dr.bulusu vs murty, Rajahmundry

Message: pl.see kalagowtami. wirdoress.com

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 maanannakujejelu

Name: Yugandhar Hanumara, Silver Spring

Message: Smt. Addepalli Umadevi article is very interesting description of fatherly affection besides her biography. This is first time I have contact with Sujanaranjani.

Thanks.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 maanannakujejelu

Name: chintala devender, hyderabad

Message: chaala baagundi

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 maanannakujejelu

Name: D.Vijayalakshmi, University of Hyderabad, India

Message: your description on you and your father is live telecast of every ones life. some of the fathers are great to inculcate future plans to their children. some of the fathers are just observers of their children attachment with society, some of the fathers are giving life to grow and teaching every time about family responsibilities and maintainense of relationships with in their family circle. very few are depending on children. parents always expect their children more than them. now a days children thinking they are burden.I pray always my parents to give strength to look them.my father whenever we met in the phone are in person he blessing me to enrich my social responsibilities. i admiring my father in this way.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 maanannakujejelu
Name:
రహంతుల్లా, విజయవాడ
Message:
క్షమించు నాన్నా!

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 weekpoint

Name: Dr. S. Subba Reddy, South Korea

Message: U r exactly right.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 maanannakujejelu

Name: voleti venkata subbarao, , vernon hills-IL

Message: sodari uma devi poojyulu vaari naaannagaaari guirinchina madhura smruthulanu manatho panchukunnanduku- aame ku nenu icchina soochananu aamodinchinaduku krutajnatalu.ammaaayi durga koodaaa ee vishayam lo naatho maata kalipi -uma devigaarini vyaasam vrayadam lo protsahinchindi.-vyaaasaanni telugu lo type chesi sahakarinchindi. umadevi gaaru tama chinnanaaati muchhatlanu chebuthoo-- maha kavulu sri arudra- sri sri garla prasthaaavana tho yenno visheshaalanu manatho panchukunnaaru. vaaariki -vaari kutumbaanikee- sri maataaravindula aasheessulu labhinchaalani manasaaraa korukontoo- chakkatai vyaasaanni vraasinanduku abhinandanalanu teluputhunnaanu.

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 telugutejomurthulu

Name: Dr.V.Ramana Rao, visakhapatnam. AP

Message: pujulu Chavali.vyagreswarudu garu naku guruvugaru.Nenu bhrahminga janmiMchatam valla chaduvuki Ardhika ibbaMdulavalla MBBS 1962 lo muginchina,1068 varaku MS cheyaledu.MS general Surgery vadili kevalam vaizag lo vumdi chaduvu kovali anna tapatrayamto MS(OrthO0 chesi 1975 nundi 10 ellapaatu vari"Free Polio Surgery camps" lopalgonna.mAto work chesina 3va OrtO surgeon Dr.Kailasa Rao. ekkuva mastarito vundadam valla mikandariki okka Dr,AdinarayanE chEsedu anna mudra padipoyindi.Kani vudata bhaktiga memukuda manavaseva chesi desamanta tirigemu. idi gamanincha galaru. Dr.V.ramana rao

సుజనరంజని: మీ అభిమానానికి కృతజ్ఞులము!

Response to: june12 satyamevajayate
Name: Mohan Devaraju,
పాఠకుల స్పందనాలు
Message:
పాఠకుల స్పందనాలు

ఆర్టికల్ బాగుంది. మీ ప్రశ్నా బాగుంది.
సంధానం తెలిసి కూడా  మీరదుగుతున్నారన్న సంగతి కూడా మీకు తెలుసు.
అమెరికాలో 40 ఏళ్ళ నా అనుబ్ హవంతో నా సమాధానం:
"
మన కల్చర్ నిలుపుకోవాలంటే, మన అలవాట్లను మార్చ కూడదు"
అని నమ్ము కున్న ఒక 10-15 % వారి ప్రవర్తనకే ఆర్టికల్.
మన తరం వాళ్ళు మిగతా 80-85%.
మన తరంలా ప్రవర్తించడం వాళ్ళ తరం కాదు.
తరం వాళ్ళ లాగ బిహేవ్ చెయ్యడం మన తరం కాదు.

సత్యం మందపాటి: మోహన్ గారు, మీకు వ్యాసం నచ్చినందుకు సంతోషం. ఒక మనిషికి సమాజంలో వుండవలసినది వ్యక్తిగత బాధ్యత. బాధ్యతారహితమైన హక్కులు కాదు. అవి మన తరమైనా, యువతరమైనా, సమాజపరమైన సంస్కారం వుంటే సాధ్యతరమే! ధన్యవాదాలు

Response to: june12 satyamevajayate

Name: Uma, Sugar Land

Message: Very nice observation, as ever and a great narration! I was thinking why no "IPad" Amma, but it was too soon! I read about IPod Amma as well as IPad Amma also! Too good!

సత్యం మందపాటి: ఉమగారు, మీకీ వ్యాసం నచ్చినందుకు సంతోషం. ఐపాడమ్మలు, ఐఫోనయ్యలు మనం రోజూ చూస్తూనే వున్నాం కదూ! ఎప్పుడో, నా వ్యాసంలోనో మీ కవితలోనో మళ్ళీ కనిపిస్తారేమో చూద్దాం!

Response to: june12 satyamevajayate

Name: Lakshmi, Fremont, ca

Message: Hello Satyam garu,

Really it was a pleasure reading this column. I like your Telugu, and the way you narrated the incidents.Its very true I attended few programs here and the same thing happened. They don't have minimum curtsy.

Thanks. please keep it up.

Mee lanti yandaro mahanbhavula valle Telugu talli veluguthunnadi.

 

సత్యం మందపాటి: లక్ష్మిగారు, 'సత్యమేవజయతే' శీర్షిక, 'ఎందరో మహాస్వభావులు' వ్యాసం మీకు నచ్చినందుకు, మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు. వ్యాసం ఎన్నో ఏళ్లుగా జరుతున్న విషయాలని చూసి బాధ పడుతూ వ్రాసినది. చెప్పింది నిజం కాబట్టే మీకు నచ్చిందేమో!

Response to: june12 satyamevajayate

 Name: saratchandra, Hyderabad
 Message:
చాలా చక్కని కథ తెలుగు వాళ్ళ తరఫున ఒకింత సిగ్గనిపించింది కూడా !

సత్యం మందపాటి: శరశ్చంద్ర, మనమెవరైనా సిగ్గు పడినందువల్ల లాభం లేదు. ఇతరుల్ని మార్చటానికి ప్రయత్నం చేస్తే చాలు. అదీ సులభం కాదు. ఎందుకంటే బాధ్యతలకన్నా కూడా హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు మరి ఎక్కువగా వున్నారు కదా!

సిగ్గుపడటం కన్నా, మనం మారుతూ మన పక్కవాళ్ళని కూడా మార్చటం సాధ్యమే కదూ!

Response to: june12 satyamevajayate

Name: Uma, Sugar Land

Message: Satyam garu,

Even in the West, music programs are with lot of participation from the audience, as in the concerts of pop culture, where masses stand p and sing along and dance, while enjoying theirselves... Only difference is it is expected!

సత్యం మందపాటి: Uma garu, Yes, you are right there will be pop music programs, where people dance to the tunes and even join in singing. We went to 'Mamma Mia' sing along movie, where everybody sings ABBA songs. But here we are talking about classical music (Karnatic and Hindustani etc.) and classical dances (Kuchipudi and Bharatanatyam etc.) similar to the classical orchestra (Beethoven etc.) and opera's, musical ballets etc. We will see when we will change for good. Thanks for taking time to write your comments.

Response to: june12 satyamevajayate

Name: kblakshmi, hyderabad,india

Message: manchi vyasam.prapamchamlo marammathu cheyalenivi konni vuntaayi.vaatillo modatidi telugu vaalla manastatwam.em chestaam?itele abhiruchileni manasula samgathulu.kb.lakshmi

సత్యం మందపాటి: Lakshmi garu, It is nice to see a complement from a renowned writer and literary stalwart like you. Thank you for taking time to write your comments. I am glad you liked it. You are absolutely right, but changes ultimately comes, may be slowly.
Regards

Response to: june12 satyamevajayate

 Name: Dr. Murty Jonnalagedda, Southport UK
 Message:
శ్రీ సత్య౦ గారికి,

నక్క ఒక చోట ఊళ పెట్టి, ఇ౦కో చోట గౌరీ కల్యాణ౦ పాడదని మన౦దరికీ తెలిసిన సామెత. కానీ సామెత చెప్పిన వారెవరో కాస్త పప్పులో కాలేశారని నా అనుమాన౦. మన తెలుగు (చాలా స౦దర్భాలలో భారతీయ) నక్కలు పని చాలా సులభ౦గా చెయ్యగలవని మన లాగ అన్ని దేశాల, భాషల కచేరీలకూ, కార్యక్రమాలకూ వెళ్ళే వారికి విశదమే. సారి కచేరీకి వెళ్లినప్పుడు లాప్ టాపయ్యనీ, పక్కనే ఎక్కడో ఉ౦డీ "ఐపాడ్ అమ్మ"నీ అడిగానని చెప్ప౦డి. లాప్ టాపయ్య గౌరీ కల్యాణ౦ పాడలేక పోతే, ఊళ కాస్త శ్రావ్య౦గా వెయ్యమని చెప్ప౦డి(To adjust the brightness of his screen according to the abmient light)

సత్యం మందపాటి: అయ్యా మూర్తిగారు, బాహా చెప్పారు సుమండీ! ఒక్క లాప్టాపయ్యతోనే ఇన్ని కష్టాలు వస్తుంటే, ఇంకో ఐపాడమ్మ ఎందుకులెండి! వ్యాసం వ్రాశాక, ఇంకో చక్కటి కచ్చేరీకి వెళ్ళాం ఈమధ్య. రంజని గాయత్రిల  కర్ణాటక సంగీతం. చాల బాగుంది.  లాప్టాపయ్య కూడా వచ్చాడు. మేం చాల దూరంగా కూర్చున్నాం లెండి!

Response to: june12 o...sari

Name: karuna, hyderabad

Message: it is good. the language in coastal andhra accent was good. the narrative style was interesting. Everything was good apart using the word christian while describing the attender and the headmaster. This would probably offend any christian community. It is just a passing thought. otherwise , it is a fantastic narration.

డా. మూర్తి జొన్నలగెడ్డ: కరుణ గారికి, మీకు "తెల్ల బల్లలు" నచ్చిన౦దుకు ధన్యవాదాలు. ఎవరినీ కి౦చ పరచే ఉద్దేశ౦ గానీ, నొప్పి౦చే ఉద్దేశ౦ గానీ నాకు లేవ౦డీ. సుమారు నాలుగు దశాబ్దాల క్రి౦ద, ఒక అగ్రహార౦లో పెరిగిన ఐదేళ్ళ కుర్రవాడి సా౦ఘిక అవగాహన ఎ౦త వరకూ ఉ౦దని తెలియచెప్పడమే నా ఉద్దేశ౦. ఇ౦కొక ఉదాహరణ కూడా చెబుతా విన౦డి. మా స్కూల్లో చాలా మ౦ది టీచర్లు క్రైస్తవ మతస్థులు. అ౦దువల్ల స్కూల్లో చేరిన మొదటి రోజు "ఓహో క్రిష్టియనుల౦టే టీచర్లన్న మాట, కానీ మరి కిష్టమ్మూర్తి అటె౦డరు కదా" అనుకున్నాను. దీనికి కారణ౦ ఏమిట౦టే అప్పటికి చూచాయగా వృత్తి పర౦గా జనులు రక రకాల వర్గాలుగా విభజి౦చబడ్డారని తెలుసును కానీ మనుషుల్ని విడదీసే అన్ని రకాల పధ్ధతులూ తెలీవు. ఐదేళ్ళ కుర్రాడి అమాయకత్వాన్ని అలాగే ఉ౦చి, ప్రప౦చానిక౦తా ప౦చాలని నా కల. 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech