Sujanaranjani
           
  శీర్షికలు  
       మాస ఫలాలు
 

- రచన : బ్రహ్మశ్రీ క్రిష్టిపాటి  విశ్వ ప్రసాద్ శాస్త్రి గారు        

 

 

బ్రహ్మశ్రీ క్రిష్టిపాటి  విశ్వ ప్రసాద్ శాస్త్రి గారు వైదిక  కుటుంబములో జన్మించి తన  తండ్రిగారైన శ్రీ సుబ్బరామయ్య గారి వద్ద తొలిపలుకులు ప్రారంభించి ,కేంద్రీయ సంస్కృత  విశ్వ  విద్యాలయమున పూజ్య గురుదేవులు శ్రీపాద భట్ గారి వద్ద సిద్ధాంత జ్యోతిషమును   అభ్యసించి, తెలుగు విశ్వ విద్యాలయము నందు ఫలిత జ్యోతిషము నందు ఉత్తీర్ణులై గత పుష్కర  కాలముగా ఆంధ్ర  దేశమున జ్యోతిష  పరమైన ముహూర్త ,జాతక ,  సాముద్రిక మరియు వాస్తు శాస్త్ర సేవలందించుచున్నారు .

   

ద్వాదశ రాశులకు జూలై (ఆషాడ/శ్రావణ ) మాస ఫలాలు:

 

 

            మేషరాశి

అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు , కృత్తిక 1 వ పాదము


ఈ రాశి వారికి మాసమంతయుకూడా కుటుంబసౌఖ్యము,సంతాన ప్రాప్తి , స్త్రీ మూలక ధనప్రాప్తి, తాముచేయు ఉద్యోగము/వ్యాపారములో అభివృద్ధి, విద్యార్ధులకు అనుకూలకాలము, ఆకస్మిక ధనప్రాప్తి, ఆరోగ్య విషయంలో ఉదరసంబంధిత కలత కలుగుటకు అవకాశము ఉన్నందున జాగ్రత్త వహించగలరు.స్నేహితులు,బంధువులుతో కలసినప్పుడు ఆహార ,పానీయాలు తీసుకునేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. వీరు మంగళవారము నాడు దుర్గ, సుబ్రహ్మణ్య దేవతారాధన చేయుట మంచిది.  

   
 

వృషభరాశి

కృత్తిక  2 ,3 ,4  పాదములు,  రోహిణి    4 పాదములు ,  మృగశిర    1  ,  2   పాదములు 

 వీరికి ఈ మాసము శరీర, సౌందర్యపోషణ, సంగీత, లలిత కళలపట్ల ఆసక్తి,అందు కొరకై ధన ఖర్చు,దగ్గర ప్రయాణాలు చేయటం, నూతన పరిచయాలు వివాహానికి దారితీయటం, ఉద్యోగములో వేరే ప్రాంతమునకు వెళ్ళవలసి వచ్చినను అది అభివృద్ధికి చిహ్నము ,తమ తోటి ఉద్యోగస్తులతో  పరస్పర అవగాహనతో మెలగవలసి యున్నది.  వీరు గణపతి ,దక్షిణామూర్తి  ఆరాధన చేయుట ఉత్తమం.  

 
   
 

మిథునరాశి

మృగశిర 3 ,4  పాదములు,  ఆరుద్ర  4 పాదములు , పునర్వసు  1 , 2 ,3   పాదములు 

నలుగురిని ఆకర్షించే విధముగా మాటతీరువుండుట, అయితే సోదరులతో పరస్పర విరోధ భావము కలిగి ఉండుట, వైద్య పరమైన ధన ఖర్చు, విద్యార్ధులు చదువులో కొద్దిగా వెనకపడటం, గృహవాహనములకొరకు అప్పు చేయుట జరుగుచున్నది. వీరు ఆంజనేయ, ఆదిత్య హృదయ స్తోత్రములు పఠిoచుట శ్రేయస్కరం.  

   
 

కర్కాటక రాశి

పునర్వసు  4  వ  పాదము, పుష్యమి  4 పాదములు , ఆశ్లేష  4 పాదములు

 

వీరు సాహిత్య, నృత్య, అనుకరణ మొదలగు విద్యలను అభ్యసించడం,వాక్ ఫటుత్వం కలిగి ఉండుట, తాము ఎంతో కాలముగా ఎదురుచూస్తున్న పనులు చక్కపడడం,రాజకీయ పరంగా తాము చేయు వృత్తిలో అభివృద్ధి చెందటం, పిల్లలు,వారి చదువు మనస్సుకు ఆనందాన్ని కలిగించటం  జరుగుచున్నది. వీరు హనుమాన్  చాలీసా పఠిoచుట మంచిది.  

 

   
 

సింహరాశి

మఖ  4 పాదములు,  పుబ్బ   4 పాదములు, ఉత్తర    1 వ  పాదము

వీరికి ఈ మాసము నందు కుటుంబంలో చిన్నచిన్న చికాకులు, కలతలు, మానసిక అశాంతి, ధన వ్యయం, ఇల్లు మరియు వాహనములు  కొనుట, బంధుజన సేవ, చేయు వృత్తి ఉద్యోగములలో పురోభివృద్ధి కలుగుచున్నవి. వీరు విష్ణు సహస్రనామము మరియు నరసింహ స్తోత్రములు  పఠిoచుటవలన మంచి ఫలితములను పొందగలరు. 

   
 

కన్యా రాశి

ఉత్తర   2 ,3 ,4  పాదములు, హస్త   4 పాదములు ,  చిత్త  1  ,  2   పాదములు 

 

వీరికి ఈ మాసమునందు అకాలభోజనము,శారీరక  ధృఢత్వం తగ్గుట,వ్యాధి నిరోధక శక్తి లోపించుటచే కీళ్ళు ,నరముల నెప్పులు,వాతము,ఔషద సేవ ,అనుకోని ప్రయాణాలు చేయవలసి రావటం ,క్రొత్త  కార్య క్రమాలు చేపట్టటం ,ధనార్జన ,ఉద్యోగరీత్యా ఊహించని మంచిని పొందటం,అధికారుల  మెప్పు పొందటం,విద్యార్థులుకు చదువులో కొంత  అపశ్రుతి.అయినప్పటికీ కుటుంబం తో సంతోషంగా జీవనం గడుపుదురు.వీరు విష్ణు సహస్రనామ స్తోత్రము మరియు శివ పంచాక్షరి మంత్ర జపము చేయుట మంచిది. 
  

   
 

తులారాశి

చిత్త  3 ,4  పాదములు, స్వాతి   4 పాదములు , విశాఖ   1 ,  2,3  పాదములు 

వీరు ఈ మాసమునందు చేయు ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నములు ఫలించుట, సంతానం కొరకు చేయు ప్రయత్నములయందు సఫలీక్రుతులగుట, చేయు వృత్తి  ఉద్యోగములలో ఉన్నత స్థానమును పొందుట, ఆర్ధిక పరముగా ధన లాభము, వైవాహిక జీవనములో కలతలు సంభవించుట, ప్రయాణములలో జాగ్రత్త వహించుట అవసరము. వీరు మృత్యుంజయ,శ్రీ గురుదత్తాత్రేయ స్తోత్ర పారాయణ మరియు విష్ణు దర్శనము చేసుకొనుట శ్రేయస్కరము. 
  

   
 

వృశ్చికరాశి

విశాఖ  4  వ  పాదము, అనూరాధ   4 పాదములు , జ్యేష్ట   4 పాదములు

ఈ రాశి వారికి తాము చేయు పనులలో  అధిక శ్రమవలన మానసిక వత్తిడి, ఆత్మస్థైర్యము కోల్పోవుట, బంధు మిత్రుల ఆదరాభిమానములు, గతములో యున్న భూ,గృహ   వివాదములు పరిష్కరిమ్పబడుట. తమ ప్రతిభకు తగిన ఫలము పొందుట,క్రొత్త కార్య క్రమములు తలపెట్టుట, చెడు స్నేహము చేయుట సంభవించు చున్నది .ఆదిత్య హృదయ  స్తోత్రము,రామ నామము జపించుట శుభమునిచ్చును.

   
 

ధనూరాశి

మూల  4 పాదములు,  పూ.షా   4 పాదములు,  ఉ.షా    1 వ  పాదము

వీరికి ఈ మాసమునందు వైవాహిక జీవనమునందు ఇబ్బందులు, వీరు అభ్యసించు వైద్య,సాంకేతిక విద్యలయందు పురోగమనము,గురు,దేవతనుగ్రహమును పొందుట , ఉద్యోగమునందు  పై అధికరులవలన ఇబ్బందులు, సంతానమునకు అనారోగ్య సమస్యలు, మానసిక అశాంతి.వీరు నారాయణ అష్టాక్షరి జపము,సుదర్శన స్తోత్రము పారాయణ చేయుట మంచిది.

   
 

మకరరాశి

ఉ.షా  2 ,3 ,4  పాదములు, శ్రవణం   4 పాదములు , ధనిష్ఠ    1  ,  2   పాదములు 

ఈ రాశి వారికి విద్య మరియు చేయు  ఉద్యోగ  వ్యవహరములలో అభివృద్ధి, దూర ప్రయాణములు చేయవలసి వచ్చుట, దైవ దర్శనము, భూగ్రుహ మరియు వాహన లాభములు, దేహ కాంతి, తలపెట్టు కార్యములందు అనుకూలత, మానసిక ప్రసాంతత, స్త్రీ సౌఖ్యము,తండ్రి ,బిడ్డల మధ్య  విరోధము తటస్థిమ్చుచున్నది .సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట  శుభము.
 

   
 

కుంభరాశి

ధనిష్ఠ     3 ,4  పాదములు, శతభిషం   4 పాదములు ,  పూ.భా   1  ,  2 ,3  పాదములు 

ఈ రాశి వారు ఈ మాసమునందు  ఉన్నత విద్యాభ్యాసము కొరకై చేయు ప్రయత్నములు ఫలించుట, బంధుమిత్రుల ఆదరణ, చేయు వృత్తియందు  చిక్కులు, శారీరక  శ్రమ, మాతృవర్గ బంధు విరోధము,వ్యాపారము నందు నష్ట పోవుట , ఆకస్మిక ప్రమాదములు సంభవించు అవకాశములు వున్నవి. దుర్గా దేవి ,శివ  సహస్ర నామములు పారాయణ  చేయవలసినది.
 

   
 

మీనరాశి

పూ.భా    4  వ  పాదము, ఉ.భా   4 పాదములు ,  రేవతి   4 పాదములు 

ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యము, సంఘము నందు గౌరవము, వారి ప్రతిభతో గుర్తింపును పొందుట, చేయు వృత్తి ఉద్యోగములయందు సంతృప్తి మరియు అభివృద్ధిని  పొందుట, విద్యార్ధులు వ్రాయు ప్రవేశ పరిక్షలయందు ఉత్తీర్ణత సాధించుట, ఇష్ట దేవతా దర్శనము.దంపతుల మధ్య కొంచెము అవగాహనా లోపము చే  వాగ్వాదము తటస్తించును.వీరు ఆంజనేయ ఆరాధన , పూజలు చేయుట ఉత్తమము. 

 

   
   

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
 
 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech