Sujanaranjani
           
  పాఠకుల సమర్పణ  
  మా నాన్నకు జేజేలు
 

- నిర్వహణ : దుర్గ డింగరి

 
 

ప్రియమైన సుజనరంజని పాఠకుల్లారా!

'అమ్మకు, బ్రహ్మకు నిచ్చెన నాన్న అంటారు. నాన్నలు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో, ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తారు. చిన్నప్పటి నుండి నాన్న వీపు పై ఎక్కి ఆడుకున్న రోజుల నుండి మీరు చిన్నారి పాపలను ఎత్తుకునే వరకు ఎన్నెన్నో ఙ్ఞాపకాల దొంతరలు. అవన్నీ మా అందరితో పంచుకోవడానికి సుజనరంజని ' మా నాన్నకు జేజేలు,' శీర్షిక ద్వారా మీకు మంచి అవకాశమిస్తుంది. నెం.వన్ తెలుగు వెబ్ మాస పత్రికలో మీ నాన్నగారి గురించి ప్రచురిస్తే ఎంత మంది చదువుతారో, స్ఫూర్తిని పొందుతారో ఆలోచించండి.

ఇంకా ఆలస్యమెందుకు? కలం, కాగితం తీసుకుని రాసి కానీ లేదా లాప్ టాప్, కంప్యూటర్లు వున్న వారు టక టకా టైపు చేసి కానీ సుజనరంజనికి పంపించండి. 


 
 

 

తల్లి తండ్రులే పిల్లలకు ఆదర్శం...

 
 

--- శ్రీలలిత 

 
 

శ్రీ కోలా రామమోహన రావు -october 19-1944 -/December -4-2005

"మనిషి తన దయిన జీవితాన్ని సాధించక్కర్లేదు,జీవిస్త చాలు".ఇదేద గొప్ప కొటేషన్ అనుకుని ఆచరించాలనుకునే వారు ముందు తాము మనిషి జన్మ లో ఉన్నామని,అందులోన మగ మనిషిగా ఉన్నామని మరచి పోకూడదు. ఎందుకంటే మగ పిల్లవాడు పుట్టగానే చుట్టూ ఉన్న వారిలో ఒక ఆశ కూడా పుడుతుంది.నిస్సహాయత తో నూ,ఆశ లతోనూ,స్వార్దాలతోనూ,రక రకాల బంధాలతోనూ,అతని చుటూ చేరిన వారితో పిల్లవాడు తానూ తానుగా బతికే హక్కు కబళించ బడుతుంది.అమ్మానాన్నల,అక్క చెల్లెళ్ళ,భార్యపిల్లల అవసరాలు,బాధ్యతల మీదుగా అతని జీవితం కొట్టుకుని పోతుంటుంది,పోవాలి.ఎందుకంట  ఎదురీదాలనుకునే  మనిషి గతి అథోగతి కనుక.

మా నాన్న గారు శ్రీ కోలా రామ మోహన రావు.Retired స్కూల్   ప్రిన్సిపాల్.

అమ్మా, నాన్న

మా నాన్న గారు మితభాషి. తన గురించి తను ఎప్పుడు చెప్పక పోవడం,మనసు తెలిసేలా ఎన్నడూ మాట్లాడక పోవడం వల్ల మా నాన్న గురించి తెలిసింది తక్కువ .ఎదుటి వ్యక్తి ఎటువంటి స్వభావం వారయినా మా నాన్నతో బాగా కలిసి పోయే వారు.ఆయన ఏనాడూ  ఎవరినీ ,కుటుంబ సభ్యులని కూడా పరుషంగా మాట్లాడడం నేను చూడలేదు.వ్యక్తి వెనుక విమర్శ, ఆయన ఎరుగరు.చిన్నతనంలో పిల్లలు ముగ్గురం ఆటలతో,అల్లరితో  నిద్రాభంగం కలిగించినందుకు నాకు ఒక దెబ్బ వేసి ఆయనెంతో బాధ పడి వేదన చెందారు.( తర్వాత అరిచెయ్యంత కోవాలు చేయించి నాకు బహుమతిగా కూడా సమర్పిన్చుకున్నారనుకోండి,అది వేరే సంగతి).ఎత్తైన విగ్రహం గల మా నాన్న అక్కను, నన్ను ఒకేసారి  తన బల మయిన భుజాలకు , మోచేతులకు మధ్య వ్రేలాడుతుండగా , రంగుల రాట్నం తిప్పేవారు.మా నాన్న కు ఆరోజుల్లో అనారోగ్యం అరుదు.ఏమీ తోచని ఖాళీ సమయాల్లో radio ,fan  వంటివి విప్పి తన చుట్టూ పరుచుకుని, వాటిని పరిశీలించడం ,తిరిగి బిగించేటప్పుడు సహనంగా తన దవడను బిగించి చమటలు అల్లానే కక్కుతూ పని కొనసాగించడం హాస్యాస్పదం మాకు రోజుల్లో. నా craff  జుట్టును రక రకాలు గా దువ్వుతూ ,ఏవేవో క్లిప్పులతో అలంకరిస్తూ ,కాలక్షేపం చెయ్యడం కూడా మా నాన్నకు ఇష్టం రోజుల్లో,నేను కొద్దిగా కదిలినా ,అసహనాన్ని ఆపడానికి సహనంగా దవడను బిగించేవారు.ఆయన   బృహత్కార్యం ఎప్పుడు చేపట్టినా ఆయనకు అందకుండా పరుగు  లంకించు కొనేందుకు సిద్ధంగా వుండేదాన్ని

మా నాన్నమ్మ మాటలలో చెప్పాలంటే -ఆయన 

అమ్మమ్మ ,అయిదుగురు పిన్నులు,అయిదుగురు చెల్లెళ్ళ  మధ్య బాగా గారాబం గా పెరిగిన ఒకే ఒక మగ నలుసు .బాగా బతికి, చితికి పోయిన కుటుంబం వాళ్ళది.మేము ముగ్గురం పుట్టే నాటికే వాళ్ళ నాన్న చని పోయారు-1972  లో .ఉద్యోగమూ లేక ,చెల్లెళ్ళ కు ,తన కుటుంబానికి న్యాయం చేసే ఉద్దేశంలో సులభంగా డబ్బు సంపాదన భ్రమతో,  జూదంలో వున్నది కూడా  (కొన్నాళ్ళు) పోగొట్టుకునే వారని ఇతరులు చెప్పేవారు . అదే ఆయన రాత్రంత్రా రిక్షా తొక్కి ,పగలు బడి పిల్లలకు పాఠాలు చెప్పి ,చెల్లెళ్ళకు  ,తల్లికి సంతృప్తి కరమయిన జీవితం అందించి ,కోట్లు సంపాదించి తర్వాతి తరానికి అందించి , అందరి కోసం బతికి నట్లుగా ఒక సాక్ష్యం అందరికీ దొరికి వుంటే ?

1978 .....

అప్పటికి B.Sc B .Ed  చదివి  సెకండ్ గ్రేడ్ టీచర్  గా ఉన్న మా నాన్న, ప్రతి  సెలవులలో మద్రాసు వెళ్లి ,సినిమాలలో చేరి  గుర్తింపు సాధించాలని చాలా ప్రయత్నాలు చేసారు.

జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన పుత్తడిబొమ్మ  వంటి ఒకటి రెండు చిత్రాలలో నటించడం కూడా జరిగింది.

అటువంటి ప్రయాణాలు తటస్థించినపుడు ,కుటుంబ సమేతంగా ఒకసారీ -నేను  మాత్రమే  కొన్ని సార్లు   ఆయనతో  ప్రయాణించిన సందర్భాలు వున్నాయి

1997లో మా అబ్బాయితో

మొదటి సారి పల్లె విడిచి,మద్రాసు మహా నగరం సందర్శించిన మాకు (అన్న ,అక్క,నేను ) కృష్ణ,శ్రీదేవి, వంటి పెద్ద పెద్ద తారలు మామూలు వ్యక్తులుగా మాతో మాట్లాడడం ,ఆదరంగా దగ్గరకు తీసుకోవడం విభ్రాంతి కలిగించింది.(మద్రాసులో  ఇతరులను కూడా ఆంటీ అంకుల్ అనవచ్చని తెలుసుకుని మేము- పిల్లలు  ముగ్గురం నవ్వుకోవడం నాకు ఒక సరదా  జ్ఞ్యాపకం).

నేను ఒక్కర్తినే ఆయనతో వెళ్ళిన సందర్భం నాటికి నా వయసు 8 సం .

అప్పుడే నీటితో కడిగి,ప్రయాణీకులు తొక్కడం వల్ల బురదగా మారిన జమ్ముతావి express  నేను ఎక్కనని మారాం చేస్తే, నేను నడవ వలసిన దారి అంతా న్యూస్ పేపర్లు పరిచి నన్ను train  లోపలకి తీసుకు వెళ్లారు మా నాన్న.

ఆయన సహన పూరితమయిన ఆదరణను చవి చూడ డానికి,ఆయనను అర్ధం చేసుకోవడానికి ,తర్వాతి జీవితంలో నిజమయిన విలువలను తెలుసుకుని ,మన గలగ డానికి , ప్రయాణం దోహదపడింది. మా నాన్నను వ్యక్తి గా ఆదరించి ,అభిమానించే ఎందరో Producers , directors , friends తో రోజంతా బిజీ గా గడిచిన  తరువాత , ఆయన ఒక్కరే బీచ్ restaurant లో సముద్రాన్ని చూస్తూ నిశ్శబ్దంగా కూర్చోనివుండే,మా నాన్న ను ,అక్కడి carpet  grass పై ఆడుకుంటూ నేను గమనిస్తుండే దాన్ని.ఎడతెరగని ప్రయత్నం ,బలమయిన ధ్యేయం మధ్య నలిగిపోతున్న  ఆయనమనసు' -భూమ్యాకాశాలు కలిసినట్టుండే  horizon ను, తన భవిష్యత్తును ప్రశ్నిస్తున్నట్టుండే ఆయన' కళ్ళల్లో' ప్రతిబింబించేది.ఎడతెగని ఆలోచనల మధ్య , అలిసి పోయినట్టు గా  మెడను  ,కుదించిన భుజాల మధ్య వేలాడేసి కూర్చుండి పోయే మా నాన్న రూపం నాటికీ నా హృదయం ద్రవించి వేస్తుంది.డబ్బు సంపాదన తో మంచి కుమారుడుగా,అన్నగా,భర్తగా,తండ్రిగా తన జీవితానికి సార్ధకత లభించాలని ఆయన ప్రయత్నం

అందరూ ఆయనను ఎరిగిన వారే గానీ ,ఆయన గురించి తెలిసిన వారు అరుదు.

కీర్తి ,డబ్బు సమ్మిళిత మయిన మనిషి -వ్యక్తిగా-డొల్ల  -కావచ్చు గాక, లోకం అతనికి  బ్రహ్మరధం పడుతుంది

1993లో మా అన్న, అక్క, నేను

మా నాన్న కు  స్కూల్ అసిస్టెంట్  గా పదవోన్నతి లభించడం వల్ల ,ఆత్మ న్యూనత వల్ల ,పట్టుదల క్షీణించడం వల్ల ,ఆర్ధిక కారణాలవల్ల -ఆయన మద్రాసు రాక పోకలు ,సినిమా ప్రయత్నాలు ఆగి పోయాయి.లేకుంటే కోటశ్రీనివాసరావు,రావుగోపాలరావు వంటి పెద్ద నటుల జాబితాలో ' కోలా రామ్మోహన్ రావు 'పేరు నిలిచి ఉండేదని నా నమ్మకం.సినిమా రంగంలో దీర్ఘకాలం గా వేచి ఉన్న ఎందరికో అవకాశాలు లభించడం మనం చూస్తుంటాం.ప్రయత్నానికి -విజయానికి ఉన్న అంతరం చాలా చిన్న దయినా ఫలితం మాత్రం విజయాన్నే వరిస్తుంది

చిన్ననాడు సిగరెట్లు కాల్చవద్దని ఆంక్షలు పెట్టే నా మాటలు విని పాటించిన మా నాన్న ,కాస్త పెద్దయ్యాక తాగవద్దని (నాన్నను కోల్పోతా ననే భయంతో )  ఆర్ద్ర కవితను  రాసిస్తే ఎప్పుడూ తనను అలాంటివి కోర వద్దని  వారించారు.వ్యసనం మనిషిని  నడిపించడం అంటే అదే నేమో.

బాగా డబ్బున్న వ్యసన పరులు,వదరు బోతులు కలలో కూడా ఊహించక్కర్లేని ఒక న్యూనత ఆయనలోనూ -తద్వారా- నాలోనూ ?

1977లో నేను

ఆయనపై వ్యసన పరుడనే నిందను భరించలేక నేను , నాడు,"వ్యక్తిగా ఇతరులు మెచ్చే విధంగా ,సమాజం నిర్దేశించిన విలువలతో మీరెందుకు లేరని" మా నాన్నను నేను చనువు వల్ల నిలదీసినపుడు  'అధర్మం లో కూడా కొంత ధర్మం వ్యక్తికి మిగిలే ఉంటుందని , పరిస్థితులే జీవితాలను ప్రభావితం చేసి ప్రేరేపిస్తాయని' ఆయన అన్నారు.

మా నాన్న  నా వివాహానంతరం నాకు  ఉత్తరాలు రాసే వారు.తను మొదటి సారి తాతయ్యనవుతున్నందుకు (మా అక్క బాబు, కోమల్ పుట్టుక )ఆయన వ్యక్తీకరణ నాకు ఆనంద భాష్పాలు తెప్పించింది.ఆయనకు తన మనవలు అంటే ఎంతో ప్రేమ .నా పాపను ఐశ్వర్య రాయ్ తోనూ ,మా అన్న పాపను సుస్మిత సేన్ తోనూ పోల్చేవారు. ఆయనకు కీర్తి సాధించిన వ్యక్తుల పట్ల అంతటి మక్కువ.ఆయన భోజనం చేస్తుండగా ,ఎవరైనా కష్ట పడి పైకి వచ్చిన  వారి కధనాలు టీ.వీ  లో వచ్చాయంటే చాలు ఆయనకు ఆనంద భాష్పాలతో పొలమారి పోయేది.మా నాన్నొక ఆర్ద్రత.

మా నాన్నకు world  సినిమా అంటే ప్రీతి.ఎన్నో మంచి మంచి హాలీవుడ్,బాలీవుడ్ సినిమాలను నేను మానాన్న తో కుర్చుని చూసే దాన్ని.మొదట్లో భాష అర్ధం కాక పదే పదే ప్రశ్నలతో విసిగించే నాకు ,సహనం గా ఇతర భాషల చిత్రాలను ఎవర్నీ విసిగించకుండానే ఎలా అర్ధం చేసుకోవాలో నేర్పించారు.sub titles  facility   లేని ఆనాటి సినిమాల వల్ల నాకు హిందీ,ఇంగ్లీష్ ప్రావీణ్యం లభించిందంటే ఎంతమాత్రం,  అతిశయోక్తి కాదు.మనిషి "నేను" అనే స్వార్ధపు హద్దుని దాటి ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడం maa నాన్న వల్ల అలవడుతుంది. ,మనుగడ తాలూకు భయాన్ని జయించిన నాడు ,ఎటువంటి పరిస్థితులూ అతని సంతోషాన్ని హరిన్చలేవు. ప్రపంచం,విశాలమైన జ్ఞ్యానం ఎంత అధ్భుతమైనవో ఆస్వాదించ డానికి వివేచన అవసరం.వివేచన కలిగిన మనిషికి ఒక జీవిత కాలం చాలా తక్కువ.ఇదే మా నాన్న.

మా అబ్బాయి -నా  చిన్న   నాడు నాకు తెలిసిన మా నాన్న ను ఎన్నడూ చూడకపోయినా -భరించలేని అసహనం ఎదురయినప్పుడు ,సహనంగా దవడను అణచడం లాంటి gestures  ఇస్తుండడం ,వాడిలోని రూపు రేఖల పోలికలు etc  నాకు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.  

1980లో మా నాన్న దువ్విన క్రాఫుతో నేను

తల్లి దండ్రుల  ప్రేమను ,త్యాగాన్ని ,ఆదరణను చవి చూసి,ఒక వివేచనతో పెరిగిన పిల్లలకు వారు  తమ వద్ద శేష కాలం చల్లగా గడపాలని,మడత కుర్చీ ఏర్పాటు చేసి వారికి కాఫీ లు, newspaperlu  అందిస్తూ వారి సమక్షంలో తమ పిల్లలు ఆడుకొంటూ వుంటే తృప్తిగా నిట్టూర్చాలని ఒక ఆశ ఉంటుంది.

ఎడతెరిపి లేని నిందకు ,పరుష స్వభావాలకు,మితిమీరిన ధన ప్రాధాన్యపు స్వార్ధానికి  - పిల్లలే కాదు పెద్దల జీవితాలూ చుక్కాని లేని నావలల్లే కడతేరిపోవలసిందే.

నాన్న గా నన్ను ఆయన కొంత మెప్పించి ఉండవచ్చు గాక ,వ్యక్తిగా ఆయన మెప్పించ లేక పోయిన  వారికి ఊరట కలిగించే విధం గా   సుదీర్ఘ కాలమే  అనారోగ్యంతో మంచాన పడి  తన దయిన జీవితం -just    జీవించి -(సాధించకుండానే) చాలా త్వరగానే చాలించారు. 

మా నాన్న , ఒక సందర్భంలో  ఉద్బోధించిన మాటలతో వ్యాసం ముగిస్తాను.."గతం గతః -మీ జీవితంలో ఎలా ఉండాలో మాత్రమే కాదు ఎలా ఉండకూడదో అనేదానికి కూడా తల్లితండ్రులే ఆదర్శం-పిల్లలు ,తమ తల్లిదండ్రుల పై ప్రేమ వల్ల వారిలో ఉన్నతత్వం ఆశిస్తారు ,కానీ తమ తల్లి దండ్రులూ మామూలు మనుషులే ననీ ,పైనించి దిగొచ్చిన దేవతలు కాదనీ,వారూ రాగ ద్వేషాలకు అతీతులేమి కాదని తెలుసుకుని, వారు  మీతో ఎలా ప్రవర్తించి వుంటే బావుండునని అనుకుంటారో అలా మీ పిల్లలను తీర్చి దిద్దుకోవడమే మీ పరమావధి. ".

వేయి వికృత హేలలు మీ మనసును దగ్ధం చేసి ఉండ వచ్చు గాక  -ఒక దెబ్బ తిన్నంత  మాత్రాన మొత్తం మాన వాళి మీదే నమ్మకం కోల్పోకండి,మా నాన్న లాంటి వ్యక్తుల కోసం వెదకండి.
 


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech