Sujanaranjani
           
  కవితా స్రవంతి  
  చిన్ని కవితలు 
 

- రచన :   - ఎస్.కె.వి. రమేష్

 
 

వాస్తవాలు
శీర్షాసనమేసిన ఊహలే
జీవితాల్లో సింహభాగపు
వాస్తవాలు.
*****

భవిష్యత్తు
భవిష్యత్తుకై
అయితే గుడిలో రాయిని
లేకుంటే వేలికి పెట్టుకునే రాయిని
నమ్ముతున్నాడీ మనిషి.
******

స్మశానం
కాలము, ఋతువులు
అనుకూలించినా అనుకూలించకపోయినా
భస్మరాసులను దిగుబడిగా
సాధించుకు పోతూనే
ఉంటుందా స్మశానం.
******

బార్
చెమట అత్తరు రెండూ
తమ వైభవాన్ని
కోల్పోయే చోటా బార్.
తెల్లవారాక ఆ పచ్చిక అద్దాలపై
సింగారించుకుంటున్న
ఆ ఆకాశాన్ని ఓ సారి చూడవోయ్
సప్తవర్ణాలు నీ కళ్ళలోనూ
సప్తస్వరాలు నీ మనసులోనూ
ఒలికించకపోతే నన్నడుగు.
*********

చేసి చూపడమంటే ఏమిటో
ఆ మేఘానికి తెలిసినట్లు
ఇంకెవరికి తెలుసు
చూడు తాను కరిగి
ఆ మట్టినెలా కరిగించుకు పోతోందో
మనసులైనా .......
*********

ఓ చిన్నపాటి ఇసుకరేణువు కూడా
గాలిలో ఎగురుతూ
ఓ సరస శృంగార కావ్యాన్ని
రాయగలదా బృందావనాన
అనడంలో అతిశయోక్తి లేదేమో.


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 






సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech