Sujanaranjani
           
  కవితా స్రవంతి  
  నైర్మల్యం
 

రచన: -డా.అయాచితం నటేశ్వర శర్మ

 
 

చదివీ చదివీ కళ్ళు అలసిపోతాయి
హృదయం అలసిపోదు
పదిలపరచుకొన్న అనుభూతులతో
ప్రతిక్షణం స్పందిస్తుంది కోరికలతో
ఎన్నని చెప్పాలి ఊహల సంగతులు?
ఒక్కొక్కటీ ఒక్కొక్క మహాకావ్యానికి నాంది
దిక్కుల అంచుల దాకా విస్తరించిన
ఈ ధరిత్రికి దర్పణం
ఎదలో ఉన్న రమ్యభావనలన్నీ
ఎదుటే కనబడుతున్నాయి ప్రకృతి రూపంలో
నేనెప్పుడూ ప్రకృతిలో ప్రకృతినే చూస్తాను
నేనెప్పుడూ వికృతిలో ప్రకృతిని చూడను
లోన వికృతవేషాలు దాల్చిన వాళ్ళు
బాహ్యంలోనూ దాని ప్రతిబింబాన్నే కంటారు
మాటలకూ చేటలకూ మూలం మనస్సే
అది నిర్మలంగా ఉంటే కనబడేది ఉషస్సే
పసివాని ప్రవృత్తే దానికి శ్రీరామరక్ష
పగలతో అది రగిలిందో
ప్రపంచానికి తప్పదు శిక్ష!


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 







సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech