Sujanaranjani
           
  కవితా స్రవంతి  
  ఎగరనీ శాంతి కపోతాన్ని
 

 - రచన:  తమిరిశ జానకి

 
 

విశ్వమంతా తాను ఎగరాలని తపన్ పడుతున్న
శాంతికపోతాన్ని బందీనిచేసి
విశ్వమంతా తానై గుబాళించాలని ఆరాటపడుతున్న
మానవత్వపు మొగ్గని చిదిమివేసి
విశ్వమంతా వెలుగునిండాలని పరుచుకుంటున్న
క్రాంతి కిరణాల ప్రసరించనీక తలుపుమూసి
కులమతాల నిప్పురవ్వలు చెరిగి
మారణహోమాల మంత్రాలు చదివి
ఎర్రబరుస్తావెందుకు శ్వేతకపోతాన్ని?
నెత్తురుచుక్కలు నేలమీద చిమ్మి
బుగ్గిపాలైతే పచ్చని బతుకులు
ఏమని చెప్తావు మనస్సాక్షికి
ఎలా జీవిస్తావు పడిపోయిన కట్టడాలమధ్య?
పగిలిన గోడల్లో మొలుచుకొచ్చి మొక్కలు ప్రయోజనమేముంది?
చాపితే స్నేహ హస్తం కురుస్తుంది అమృతధార
చిగిర్చేను సమతామమతల మొలక
మానవత్వపు చిరునామాకు నీ మది ఆవరణగా
మరణించడమో మరొకరిని మట్టుపెట్టడమో కాదు గొప్ప
బతకడం ఇతరులని బతకనివ్వడం కావాలి ధ్యేయం
పంచుకోవాలి విజ్ఞానం కలిసికట్టుగా
పారద్రోలాలి అజ్ఞానం పట్టుదలగా
అందుకే ఎగరనీ విశ్వమంతా శాంతికపోతాన్ని
గుబాళించనీ విరబూసి మానవతా కుసుమాన్ని
ప్రసరించనీ క్రాంతికిరణాలు
మూఢత్వపు తలుపుల అంధకారాన్ని
పటాపంచలు చేసి!


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech