Sujanaranjani
           
   

తొలిపలుకు

 
 

రచన : రావు తల్లాప్రగడ   

   
   సంపాదకవర్గం:
ప్రధాన సంపాదకులు:
రావు తల్లాప్రగడ 

సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
సి. కృష్ణ

వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ, హైదరాబాద్.
 

 

నీ బ్యాంకులో దొంగ పడ్డాడయ్యా అని ఎవరైనా చెబితే, నీకేమి తెలుసు, నీ క్వాలిఫికేషను ఏమిటి అని ఎవ్వరూ ప్రశ్నించరు. ఒక విమానంలో బాంబు పెట్టారని అనుమానం వుంది అని అంటే చాలు, వెంటనే విమానమంతా వెతుకుతారు కానీ, చెప్పిన వాడిని పరిహసిస్తూ అసలు విషయాన్ని పక్కన పెట్టి ఎవ్వరూ కూర్చోరు. ఇలా సమాచారము పసికట్టి చెప్పేవారిని ఆంగ్లంలో విజిల్ బ్లోవర్స్ అంటారు. నేరపరిశోధనలలో విజిల్ బ్లోవరుల పాత్ర ఎంతో కీలకమైనది. వారి ద్వారా తెలిసేవన్నీ నిజాలే అని కాదు. వారు చెప్పేవాటిలో చాలా చాలా తప్పులు వుండవచ్చు. కొన్ని ఒప్పులు వుండవచ్చు. వారు పసికట్టిన ఆ ఒకటి రెండు మంచి క్లూలు చాలు, వారిని ఎత్తి అందల మెక్కించడనికి. విజిల్ బ్లోవరులు చెప్పిన విషయం పైన నేరపరిశోధన ముఖ్యం కానీ, వాడి ప్రేరేపకము ఏమయ్యి వుంటుంది అన్నది కాకూడదు. నేరము జరగడములేదని లేదని నిర్థారించుకోవడం ముఖ్యం. జరగకుండా ఆపడం ముఖ్యం. పరిశోధనలలో విజిల్ బ్లోవర్లను అంతమటుకే పరిగణలోకి తీసుకోవాలి కానీ, వాడి అర్హతేమిటి అంటూ విచారణ వాడి పైకి మళ్ళించకూడదు. అలా చేస్తే దాన్ని ద్రోహమంటారు కానీ, న్యాయము అని అనరు.
తాజమహలు పైన విశ్లేషణ ఈ నెలతో దాదాపుగా ముగుస్తోంది. తాజమహలు ఒక శివాలయమే అని చెప్పడానికి అనేక ఋజువులు దొరుకుతున్నా; ఈ విషయం పైన పరిశోధన జరపడానికీ ప్రభుత్వం ప్రొత్సాహం ఇవ్వకపోయినా; కనీసం సహకరించక పోవడం, శోచనీయమే. పై పెచ్చు విజిల్ బ్లోవరులను పక్కకు నెట్టి, వారికి ఏమీ తెలియదంటూ, అసలు విషయాన్ని గాలికి వదిలేయడంలో ఉన్న అంతరార్థం, అసలు ప్రశ్నను మరింత బలపరుస్తోంది. నిరూపణ బాధ్యత (Burden of Proof) ప్రభుత్వానిదే అవుతుంది కానీ, విజిల్ బ్లోవరుది ఎప్పుడూ కాదు, కాకూడదు. చేతనైతే ప్రభుత్వమే ముందడుగువేసి విస్త్రుతపరిశోధన చేసి, ఋజువులతో అందరి నోళ్ళూ మూయించాలి కానీ, విజిలు బ్లోవరులు ఫలానా సంస్థకు చెందినవారు అంటూ అక్రమ దోషాలు అంటగట్టడంలో అర్థంలేదు. ప్రభుత్వము ఈ విషయంలో తాను బహిరంగంగా పరిశోధన చేసి చూపించదు, మరొకడితో సహకరించదు. చేసేవాడికి తెలియదు అని కొట్టివేస్తుంది. తాజమహలు క్రింది అంతస్తులు తెరవదు, ఎవర్నీ చూడనివ్వదు. నిజంగా విజిలు బ్లోవరు తప్పే అయితే, అంతకన్నా కావలసినదేమున్నది? అందరికీ సంతోషమే! పి.ఎన్ ఓక్ కూడా కోరుకుంది కూడా అదే. నిజానికి ప్రతి విజిలు బ్లోవరు కోరుకునేదీ అదే. ఒక్క రోజైనా అన్ని అంతస్తులనూ తెరిచి బహిరంగంగా పరిశోధన జరపొచ్చుకదా? ఈ ముసుగులో గుద్దులాట దేనికి?
జులై మాసం నుంచీ బ్రహ్మశ్రీ క్రిష్టిపాటి విశ్వ ప్రసాద్ శాస్త్రి గారు మాసఫలాలు శీర్షికను మనకు అందించనున్నాను. వీరు వైదిక కుటుంబములో జన్మించి తమ తండ్రిగారైన శ్రీ సుబ్బరామయ్య గారి వద్ద తొలిపలుకులు ప్రారంభించి, కేంద్రీయ సంస్కృత విశ్వ విద్యాలయములో పూజ్య గురుదేవులు శ్రీపాద భట్ గారి వద్ద సిద్ధాంత జ్యోతిషశాస్త్రాన్ని అభ్యసించి, తెలుగు విశ్వ విద్యాలయములో ఫలిత జ్యోతిషము నందు ఉత్తీర్ణులై, గత పుష్కర కాలముగా ఆంధ్ర దేశమున జ్యోతిషపరమైన ముహూర్త, జాతక, సాముద్రిక మరియు వాస్తు శాస్త్ర సేవలందించుచున్నారు. వీరి శీర్షికను కూడా ఎప్పటిలాగే ఆదరించగలరని కోరుకుంటూ, ఈ నెలనుంచీ వారి శీర్షికను ప్రవేశపెడుతున్నాము.
నమస్తే!


మీ
రావు తల్లాప్రగడ


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

 
     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech