భారత జాతీయ జెండా రూపకర్త - శ్రీ పింగళి వెంకయ్య

ప్రతీ భారతీయుడూ ఆదరించి, అభిమానించే మువన్నెల జెండా, భారత దేశ జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య. భారత స్వాతంత్ర పొరాటంలో చురుకుగా పాల్గొని, విభిన్న ఆందోళనలలో భాగస్వామ్యుడై, నిస్వార్ధ సేవానురక్తుడై, దేశ స్వతంత్రానుక్తుడై, నిబద్దతతో జీవనం సాగించి, మంచి ఉపన్యాసకుడిగా, వ్యవసాయ క్షేత్రాభివృద్ధికి తోడ్పడిన వ్యక్తిగా జన బాహుల్యానికి పరిచయమైన వారు శ్రీ పింగళి వెంకయ్య.

శ్రీ పింగళి 1876, ఆగస్టు 2న కృస్ణా జిల్లా దివి తాలూకలోని భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి హనుమంత రాయుడు, యార్లగడ్డ గ్రమానికి కరణంగా ఉండేవారు.

రాజకీయ, అర్ధశాస్త్రం అధ్యయనం కోసం కొలంబో విశ్వవిద్యాలయంలో చెరారు. ఆ తరువాత జాపనీస్, సంస్కృతం, ఉర్దూ భాషలు నేర్చుకున్నారు. ఈ భాషలు కూడా అనర్గళంగా మాట్లాడ గలిగేవారు. పింగళి వెంకయ్య ఇజయవాడ వాస్తవ్యుడు.

దక్షిణ ఆఫ్రికా నుంచి తెరిగి వచ్చి, చెన్నైలో ప్లేగ్ వ్యాధి నిరోధక ఇన్స్పెక్టర్గా శిక్షణ పొంది, బళ్ళారిలో ప్లేగ్ నిరోధక అధికారిగా ఉద్యోగం చెసారు. అటుపిమ్మట, ఉన్నత విద్యా అభ్యాసాణార్ధం, కొలంబో విశ్వవిద్యాలయంలో అర్ధశాస్త్ర విభాగంలో చెరారు.

1906 లగాయితు, 1947 స్వాతంత్రం లభించే దాకా యేదో ఒక ఉధ్యమంలొనో, అందోళనలో పాల్గొంటూ వచ్చారు. ఈ కాలక్రమంలో పలు కష్టాలను అనుభవించారు.

1913 లో జరిగిన ప్రప్రధమ ఆంధ్ర మహాసభల్లో పింగళి పాల్గొన్నారు.

శ్రీ పింగళి మంచి వక్త. అనర్గళంగా మాట్లాడ గలిగేవారు. తన భషా పటిమతో సభికుల్ని ఆశ్చర్య పరిచేవారు. 1906-11 మధ్య, మునగల రాజ తో మంచి సంపర్కం యేర్పడి, వ్యవసాయ రంగంలో కొన్ని పరిశోధనలు చేసి సన్నని నూలు అందించే కొత్త ప్రత్తి వంగడాలని రూపొందించేరు. తన వ్యసాయ రంగ అనుభవాలను ఓ పుస్తక రూపంలో క్రొడీకరించేరు. వెంకయ్య చేసిన వ్యసాయ పరిశొధనలకు గాను బ్రిటన్ లోని రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ ఆయనకి సభ్యత్వం ఇచ్చి గౌరవించింది.

1911-1919 మధ్యకాలంలో కృస్ణా జిల్లా, మచలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలలో వ్యవసాయ అధ్యాపకుడిగా పనిచేసారు. ఇంతేకాక భారత దేశ ఖనిజ సంపద పట్ల మంచి విజ్ఞానం కలిగి వుండేవారు. నేటి కర్ణాటకలోని హంపి, వజ్రకరూర్ ప్రంతాలలో అబ్రకం (మైకా) ఘనుల అన్వేషణ చేసి అప్పటి ప్రభుత్వానికి నివేదిక పంపించారు.

శ్రీ పింగళికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. కొన్నాళ్ళు మద్రాసులో రేయిల్ గార్డుగా పనిచేసారు. భళ్ళారిలో ప్లేగ్ వ్యాది నిరోధక అధికారిగా మరి కొంతకాలం పనిచేసారు.

1921 మార్చి 31 న విజయవాడలో జరిగిన భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జెండాను రూపొందించి అందించారు పింగళి గారు.

త్రివర్ణ పతాకం

త్రివర్ణ పతాకంలో:

కేసరి - ధైర్య, సాహసాలకు ప్రతీతి
తెలుపు - శంతి, సత్యాలకు
ఆకుపచ్చ - విశ్వాస, సౌర్యాలకు ప్రతీకలుగా పేర్కున్నారు

ఈ జెండాయే స్వాతంత్రోధ్య ఉధ్యమంలో యెంతో ప్రాముఖ్యం సంతరించుకుంది.

జాతీయ జెండాగా ప్రవేశ పెట్టినప్పుడు రట్నం బదులు, సార్నాథ్ లోని అశోక ధర్మ చక్ర ను పెట్టేరు. బ్యురో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిభందనల మేరకు భారత జాతీయ జెండా కొలతలు - 21' X 14'; 12' X 8'; 6' X 4'; 3' X 2'; 9' X 6' (సైజ్) లో ఉండాలి.

చివరి దశ

నిరాడంబరంగా, నిజాయతీగా ఉండి, స్తిరచరాస్తులు యేమి కూడబెట్టుకుపోవడంతో, తనకంటూ యేమి మిగిల్చుకోక పోవడంతో, దుర్భర దారిధ్యాన్ని అనుభవించారు. 1963 జనవరిలో ఆయన అభిమానులు శ్రీ కొండా లక్ష్మణ రావు, శ్రీ జి ఎస్ రాజు తదితర ప్రముఖులు ఓ నిధిని యేర్పాటు చేసారు. కాని అందుకునే భాగ్యం లేకపోయింది పింగళి గారికి. 1963 జులై 4న దుర్భర దారిద్యాన్ని, అంతిమ స్వాశా విడిచి అనంత లోకాలకు వెళ్ళిపోయారు.

చివరి కోరికగా, తన మ్రుతదేహానికి జాతీయ జెండా కప్పి స్మశాన వాటికకి తీసుకు వెళ్ళి, సమీపాన చెట్టుకి జెండాని కట్టాలని వారు అడిగేరు. దేశం కోసం ఇన్ని త్యాగాలు చేసిన వాడికి, దేశం తిరిగిచ్చినింది యేమీ లేదు. (పింగళి వెంకయ్య ను, జెండా వెంకయ్య గా గుర్తుంచుకుంటే అదే పదివేలు.)

పింగళి వెంకయ్య గౌరవార్ధం, హైదరాబాద్ టాంక్ బండ్ వద్ధ ఆయన విగ్రహం స్తాపించారు. పింగళి మీద తీసిన "డాకుమెంటరీ"లో - ఉప్పులూరి మల్లికార్జున శర్మ పింగళి పాత్రపోషణ చేసి, ఆయన జీవితానికి నిలువుటద్ధం పట్టేరు.

పింగళి స్మృత్యర్ధం, బెజవాడలోని, విక్టోరియా జుబిలీ ప్రదర్సనశాల (మ్యుజియం) వద్ధ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించేరు. భారతీయ మువన్నెల జెండా పట్టుకునే ప్రతీ పౌరుడికీ పింగళి వెంకయ్య స్పురణకు వస్తే అదే ఆయనకి అర్పించే అసలు నివాళి.

జై హింద్!.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)