సోడా - తల్లాప్రగడ

తల్లాప్రగడ రావు గారిచే రచించబడి, శాయి మానాప్రగడ గారిచే స్వరపఱచబడి, ఆలాపింపబదిన పాట ఈ నెల గజల్...

ఈ పాటను వినడానికి ఈ క్రింద మీట నొక్కండి:

అందరి ముందర విందుగ గడపర, మందెంతుంటే నేమి!
తక్కువ పడితే సోడా కలపర, --- --- అది, --- -- పలుచగనుంటే నేమి!
అందరి ముందర విందుగ గడపర, మందెంతుంటే నేమి!
తక్కువ పడితే సోడా కలపర, --- --- అది, --- -- పలుచగనుంటే నేమి!

సుష్టుగ జరిపి కష్టము కరిగే, ద్రవమేదైతే నేమీ,
మాయని గురుతులు మదువే కడుగుర,--- మరి ------- నురగెంతుంటే నేమీ,
తక్కువ పడితే సోడా కలపర, --- --- అది, --- -- పలుచగనుంటే నేమి!
అందరి ముందర విందుగ గడపర, మందెంతుంటే నేమి!

తాగేవోడికి నీతులు చెప్పరు, వారి గొప్పెంతైతే నేమీ
నోటిని తడుపుకు ముద్దగ పలకర, --- అది, ----- --- నాటకమంటే నేమీ!
తక్కువ పడితే సోడా కలపర, --- అది, ----- --- పలుచగనుంటే నేమి!
అందరి ముందర విందుగ గడపర, మందెంతుంటే నేమి!

రామ చంద్రుడికి పెగ్గును కలపర, చాకలి ఏమంటె నేమీ!
పానకమొదలి పెగ్గులు పీకడ, --- --- అది, --- --- చేదెంతుంటే నేమీ!
తక్కువ పడితే సోడా కలపర, --- అది, ----- --- పలుచగనుంటే నేమి!
అందరి ముందర విందుగ గడపర, మందెంతుంటే నేమి!

అందరి ముందర విందుగ గడపర, మందెంతుంటే నేమి!
తక్కువ పడితే సోడా కలపర, --- అది, ----- --- పలుచగనుంటే నేమి!శాయి మనాప్రగడ గారు, తన తండ్రి స్వర్గీయ నరసింహ మూర్తి గారి నుంచీ వారసత్వంగా సంగీత స్వర సంపదను పొందారు. రేడియో లోనూ దూరదర్శన్ లోనూ అనేక సార్లు పాడారు. రాష్ట్రపతీ భవన్ లో జాతీయ సమైక్యతా అవార్డును పొందారు. కె.వి. మహదేవన్, ఇళయరాజాలకు రంగస్థలం పై కీ బోర్డ్ సహకారం అందించారు. కొన్ని సినిమాలకి కూడా సంగీత సహకారం అందించారు. అనేక వాణిజ్య ప్రకటనలకు కూడా సంగీత సహకారం అందించారు.
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)