పెయ్యేటి శ్రీదెవినీళ్ళు లేవంటారేం?
ఎక్కడబడితే అక్కడనీళ్ళు!
మనం నడిచేది నీళ్ళమీంచే!
నల్లాగొట్టాలు చిల్లులు పడి
రోడ్లమీద వద్దన్నా వినక
వృధాగా, విచ్చలవిడిగా, సర్పనాట్యం చేస్తూపోయే
నీళ్ళమీంచే కదూ మనం నడుస్తున్నాం?
మేము తక్కువా అన్నట్లు
మరో పక్క డ్రైనేజిగొట్టాల్లోంచి కూడా
పొంగిపొర్లిపోయి,
తప్పించుకుపోదామన్నా కుదరక
పాదాలను తాకుతూ దుర్గంధాన్ని వెదచల్లుకుంటూ పోయే
మురికినీటిలోంచి కాదూ.
'ఛీ!&' అనుకుని ముక్కు మూసుకుంటూ మనం నడుస్తున్నాం?
మనసులోని బాధని అణచిపెట్టుకుని,
వాటికి అలవాటు పడిపోయి,
ఎవరికి వారే 'మనకెందుకులే' అనుకుంటూ
పట్టించుకోకుండా అందరూ వెళ్ళిపోతుంటే,
నా కంట్లో వచ్చే కన్నీటిని ఆపుకోలేక,
ఓ వెర్రినవ్వోటి నవ్వుకొని,
'ఇండియా ఈజ్ మై కంట్రీ'
అనుకుంటూ నేనూ సాగిపోయా!
నీళ్ళు లేవంటారేం?
రోడ్లమీద నీరు!
కంట్లో ఆగని కన్నీరు!
కాని నల్లాల్లో నీరే ఉండదు!
తాగటానికి, వాడకానికి పనికిరాక,
నేలమీద వ్ర్ధాగా పోయే నీరు
ఎంతుంటే మాత్రం ఏమిటి?
ప్రజల కళ్ళనుంచి వచ్చే కన్నీటికి
మంత్రుల కంట్లో కన్నీరు వచ్చేనా?
వారి మనసులు కరిగేనా?
ప్రజల దాహం తీరేదెప్పుడో!
మనసు చల్లబడేదెప్పుడో!
డబ్బు నీళ్ళలా ఖర్చు చేయకూడదనేవారూ!
నేడు నీళ్ళు డబ్బులా ఖర్చు చేసే రోజులు!
డబ్బులు పోసి నీళ్ళు కొనడమా!
అన్నట్లు నీళ్ళ కవితలో పడి మర్చిపోయా.
నల్లా వచ్చే టైమయిందని బిందె పట్టుకుని
కింద పడ్డ వర్ద్షపు నీళ్ళలోంచి
నడుచుకుంటూ వెళ్ళి చూస్తే
అప్పుడే నల్లా బందయిందని చెప్పారు!
నల్లాలో నీటిని రప్పించలేం!
కంట్లో కన్నీటిని ఆపలేం!

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)