కలువకొలను లచ్చి

మదిలో రస స్ఫూర్తి ఇనుమడించిన వేళ, ప్రపంచంలో తనకున్న శక్తియుక్తులన్నిటినీ కూడదీసుకుని ఏకాగ్రచిత్తంతో కళాకారుల మనస్సు కళా సృష్టి చేస్తుంది. కొన్ని వందల భావాలు ఒకే చిత్రంతో చెప్పడానికి తన కుంచెను సర్వ రీతుల్లో ఆనందనర్తనమాడిస్తారు చిత్రకారులు. సరిగ్గా ఆ సంగతులను తెలుసుకుని ఆనందిచేదే రసజ్ఞ హృదయం. కుంచె కొసల నుండి జాలువారే వేలాది భావాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నమే ఈ శీర్షిక. ప్రతి నెలా శ్రీ శేషగిరి రావు గారి చిత్రాలకు వెనుక కథ ఇందులో మీకోసం.....


ఆ వైకుంఠపురానికి అవతల మందారవనం.

అందులో...ఓరోజు ఆ ఆదిదంపతులు, స్థితి సంపద కారకులిరువురు, ఈ లోకాన్ని గూర్చి, కుమారుని సృష్ఠి మర్మాలను గూర్చి చర్చించుకుంటున్న సమయంలో మానవలోకం - అందులోను పల్లెసీమల ముచ్చట వచ్చింది. చూసి వద్దామా గుమ్మడీ అన్నాడు ఆ సుందరుడు. ఆహా! మీరు వద్దు. ముందునే వెడతా. తదుపరి మీరు రండి అంది సముద్ర రాజ తనయ!

సరే పయనం ఆరంభమయింది. ఒక్కతే వస్తే మరి రాచమర్యాదయేముంది చెప్పండి.

చెలికత్తెలు - చంపకాలయ్యారు. అమరులు - అరవిందాలయ్యారు. సంపదలు -

సంపెంగలయ్యాయి. మరి ఆది లక్ష్మికి ఆలోచన కలిగింది. అందరూ సుమమార్గాలనే ఎంచుకొంటే, తనకేం దారి అనుకొంది!

అనుకొంటూ ఆలోచిస్తుండగా అల్లంత దూరంలో ఓ కొలనూ, ఆ కొలనులో సద్దులేని జలరాసులు కనబడేసరికి-తన తల్లి గుర్తుకొచ్చింది.తల్లి ఒడిలో సేదతీరుదామనుకొనేసరికి, మదిలో ప్రశ్నకు జవాబు దొరికింది. తాను కూడ ఒక సుమమైతే తన నాధుని ప్రవర్తన చూడాలనుకొంది. ఆత్మభవుని ఆనందంగా తలుచుకొంది

అంతే...

ఆ కొలనులో కలువై నిలిచింది.

ఆ విష్ణువు తన తన్మయ దృష్టిలొ చూసి, భ్రమరమై ఆమెతోనే ఉండిపోయాడు.

పరమేశ్వరుని సృష్టి - సర్వం జగదమృతం.

సర్వభూతహితం - లోకకల్యాణం.

ఆమె సౌందర్యలహరి - అతడు సూత్రధారి.రచయిత : శ్రీ కె. ఎస్. ఎస్. శాస్త్రి

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)