పుస్తక ఆవిష్కరణం

శేషేంద్ర శిఖరం పుస్తక ఆవిష్కరణం

రంజని ఆధవర్యంలొ ఏర్పాటైన సభలొ 'శేషేంద్ర శిఖరం' పుస్తకావిష్కరణ దూరదర్శన్ సంచాలకులు డా పి.మధుసూదనరావు చేతులమీదుగ జరిగింది విప్లవ ఉద్యమ భావాలతో తెలుగు కవిత్వం వూగిపొతున్న కాలంలో భావుకతకు శిల్పానికి, అభివ్యక్తికి ప్రాధన్యం కల్పించిన కవి గుంటూరు శేషేంద్ర శర్మ అని ఆవిష్కర్త అన్నారు. సంప్రదాయవాదుల్లొ ఆధునికిడు, ఆధునికుల్లొ సంప్రదాయవాది అని వెలిచాల కొండలరావు కొనియాదారు. దాక్టర్ కె. పూర్ణప్రఙ్యభారతి పుస్తక సమీక్ష చేసారు. సభాద్యక్షత రంజని అధ్యక్షులు చీకొలు సుందరయ్య వహించారు

ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్తు 35 వ వార్హికోత్సవం హైద్రాబాద్ లోని ఆంధ్ర సారస్వత పరిషత్తు లోని దేవులపల్లి రామనుజరావు కళామందిరంలో నిర్వహించారు. ఆధ్యక్షులు సినారె ప్రసంగిస్తూ ఆనాటి నిజాం కాలంలొ ఉర్దు లొ చదువుకొన్నప్పటికి తాను కవిగా మారడానికి పల్లెపాటలు హరికథలు మొదలైన జానపద సాహిత్యమే స్ఫూర్తి అన్నారు.

జానపద సాహిత్య పరిషత్తు వ్యవస్థాపక ఆధ్యక్షులు ఆచార్య నాయని కృష్నకుమారి జ్యొతి వెలిగించగ ప్రస్తుత అధ్యక్షులు అచార్య డా.సి .వసుంధర సభాద్యక్షత వహించారు. ఈ సంధర్భంగ ' సంక్రాంతి సంబరాలలొ వెల్లివిరిసె కళారూపాలు - సంప్రదాయలు ' గ్రంధ రచయిత్రి కవయిత్రి అయిన డా. సుబ్బలక్ష్మి ని రామరాజు జానపద విఙ్నాన బహుమతితొ సత్కరించారు.

******************
  • డా.పి. శివరామక్రిష్ణ రచించిన 'కొండకొనల్లొ తెలుగు గిరిజనులు ' గ్రంధం తెలుగు పాఠకులకు చేరువ అయ్యింది. డా. నాయని కృష్ణకుమారి ఆవిష్కరించిన ఈ పుస్తకం ఆంధ్ర ప్రదెశ్ లొని గిరిజనుల ఉనికి, స్ఠానం, ప్రస్ఠానం , వనసీమల్లొ వారి జీవన వికాసం, తెలుగు సంసృతి లొ గిరిజనుల భూమిక, సామెతలు, వెషభాషలు మొదలైన అనేక విషయాల సమహారమని సాహిత్య విమర్షకులు వాడ్రేవు చిన వీరభద్రుడు విశ్లెషించారు.

  • కవి, అధ్యపకుడు , పరిశొధకుడు డా. మాడుగుల భాశ్కరశర్మ రచించిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర శతకం ఆవిశ్కరణ, అంకిత సభ కళా సుబ్బారావు కళావెదిక ప్రంగనం లొ 'కవి సమయం' 'త్యాగరాయ గానసభ ' సంయుక్తాధ్వర్యంలొ జరిగింది. డా.సి. నా.రె పుస్తకాన్ని అవిష్కరిస్తూ కృతికర్త ప్రాచీనాంధ్ర మహావుల వృత్తిచాలన నిపునతని ప్రదర్శించిన కవితా సాధకుదు చేయి తిరిగిన పద్యకవి అని అన్నారు. కొన్ని వృత్తాల యెత్తుగడల్లొ పూర్వ కవుల ముద్ర కనిపింపచేస్తూ విసుర్లు దెప్పిపొడుపులు చమత్కారంతొ ఒక చక్కని పఠనీయ గ్రంధంగా ఈ శతకం రూపొందినదని అన్నారు. కె. యస్ . శర్మ అంకితం పొందారు.

నివాళి

యువకళావాహిని, త్యాగరాయ గానసభల సంయుక్తాధ్వర్యంలొ పులికంటి కృష్ణారెడ్డి సంస్మరణ సభ జరిగింది.నవంబరు లో తెలుగు బాష బ్రమ్హోత్ష్వాంలొ తాను అందుకొవలసిన సత్కారం అందుకొకముందె కీర్తిశేసులైన పులికంటి కృష్ణారెడ్డి యేటా అయిదుగురు సాహితీ ప్రముఖులను గత ఏడేల్లుగ సత్కరిస్తున్న విషయం చాలా కొద్దిమంది సాహితీ ప్రియులకే తెలుసు. ప్రఖ్యాత కథారచయిత మధురాంతకం రాజరాం ప్రేరణతొ కథారచనను చెపట్టిన పులికంటి ఈప్రక్రియలొ ఆయనకే సమస్కందుడుగా యెదిగారని వక్తలు కొనియాడారు.ప్రముఖ సాహితి విమర్శకుడు డా. ద్వా. నా. శాస్త్రి అద్యక్షతన జరిగిన ఈ సభలొ డా.సి. నా. రె నివాళులు అర్పిస్తూ కథ, గేయం నవల వంటి ప్రక్రియల్లొ పులికంటి ఉత్తమ ప్రమాణాలు పాటించి రాణించారని అన్నారు. దూరదర్శన్ ప్రయోక్త వోలెటి పార్వతీశం విశాలాంధ్ర సంచాలకులు లక్శ్మి నారాయణ తదితరులు ఈ సభలొ పాల్గొన్నారు.

తెలుగు విశ్వవిద్యాలం 2007 విశిష్ట పురస్కారం

ప్రముఖ జానపద విఙ్ఞాన పరిశోధకుడు ఆచార్య బిరుదురాజు రామరాజుకు 2007వ సంవత్సరానికిగాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 'విశిష్ట పురస్కారం ' అందజేసింది. మంత్రి బుద్ధప్రసాద్ ముఖ్య అథిది ప్రసంగం చెస్తూ తెలుగుదనానికి జనపదసాహిత్యమే మూలమని, ప్రపంచ వెదికపై తెలుగు విశిస్ఠతని కాపడుకొవలసిన అవసరం వుందని అన్నారు. విశిష్ట పురస్కార గ్రహేత ఆచార్య బిరుదురాజు రామరాజు స్పందిస్తూ సురవరం ప్రతాపరెడ్డి, ఆచార్య ఖండవల్లి లక్శ్మిరంజనం తన జీవితాన్ని మలుపు తిప్పారని అన్నారు. విద్యర్థులు ప్రదర్షించిన 'మహాకథ ' నాటిక సమకాలీన తెలుగు భాషకు యెదురవుతున్న అనేక ప్రతికూలాంశాలను దృశ్యమానం చేసింది.

ఇజ్రాయెల్ వర్సిటిలొ తెలుగు పీఠం

ఈ వ్యవస్థాపక దినోత్సవానికి అధ్యక్షత వహించిన తెలుగు విశ్వవిద్యాలం విసి ఆవుల మంజులత ఇజ్రాయెల్లొని హిబ్రూ విశ్వవిద్యాలయంలొ వచ్చె ఫిబ్రవరిలొ తెలుగు పీఠం ప్రారంభం కానుందన్నారు.

ముషాయిరా

దూరదర్శన్ ప్రసారం కొసం రవీంద్రభారతి వెదికమీద సంగీత, సాహిత్య సమ్మెలనా ప్రక్రియ ముషాయిర జరిగింది. నవకవులనుంచి ఉద్దండ ఉర్దు కవుల వరకు అనెక మంది ఈ ముషాయిరాలొ పాల్గొని కాదేది కవితకనర్హం అంటూ చెట్టు ,పుట్ట , రెమ్మ, వసంతం, పాపాయి నవ్వు, నవదంపతుల సిగ్గుల సింగారం , లెలెత ప్రెమ వంటి అంశాలలొ కవితాగానం చెసారు

బ్రహ్మీలిపి శాసనం

గుంటుపల్లి బౌద్ధ్హగుహాలయంలొ క్రీస్తు శకం అరుదైన బ్రహ్మీలిపి శాసనం లభ్యమైంది. చారిత్రిక సంఘటనలే కాకుండ మన తెలుగు భాషకు సంబదించి అప్పుడప్పుడె రూపొందుతున్న తెలుగు నుడికారలు, గుణింతాల రూపాలను ఈ ఫలకం ఆవిష్కరించింది

కేంద్ర సాహిత్య పురస్కారం

ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులని ప్రకటించారు. తెలుగులొ గడియారం రామకృష్ణశర్మని ఈ అవార్డు వరించింది. శర్మ గారి స్వీయచరిత్ర ' శతపత్రం 'కి ఈ అరుదైన గౌరవం లభించింది. రాయలసీమ అనంతపురంలొ జన్మించి తెలంగానలొని మహబూబ్ నగర్లొ స్థిరపడిన గడియారం 2006 జులై లొ తుదిశ్వాస వదిలారు. గడియారం సాహితీ విశేషాలు ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యులు తెలంగాణ చరిత్ర సంస్కృతులపై పరిశొధన హళెకన్నడ (నన్నయకి పూర్వమున్న కన్నడభాష) లొని రన్నకవి 'గదా యుద్ధం ' పద్య కావ్యాన్ని తెలుగులొకి అనువదించగా దీనికి అంధ్రప్రదేశ్ అవార్డు లభించింది. ఆంధ్ర సాహిత్య అకాదమి తరపున 'కేయూర బాహు చరితము ' సింహాసన ద్వాత్రిశంకలను పరిష్కరించారు. 1950-1953 లొ 'సుజాత ' సాహిత్య మాసపత్రిక సంపాదకులు. 2004 లొ తన ఆత్మకథ 'శతపత్రం ' వెలువరించారు.

సాహితి పురస్కారాల ప్రదానం

2006 సంవత్సరానికి వచన కవిత, పద్యకవిత, కథ, నవల, నాటకం, సాహిత్య విమర్శ, బాలసాహిత్యం, అనువాదాలు ఇత్యాది ప్రక్రియల్లో ఎంపికైన ఉత్తమ గ్రంధకర్తలకి తెలుగు విశ్వవిద్యాలయం సాహితి పురస్కరాలను ఆర్థిక మంత్రి శ్రీరొశయ్య చేతులమీదుగ అందచేసింది. సభాద్యక్షత డా.సి.నా.రె

అవార్డులు పొందిన గ్రంధాలు

  • పునర్యానం: వచన కవిత : వాడ్రేవు చినవీరభద్రుడు
  • మల్లెమాల రామయణం : పద్య కవిత : డా.మల్లెమాల
  • అమ్మమనసు : బాలసాహిత్యం : దాసరి వెంకటరమణ
  • పులికంటి కథావాహిని : కథానిక : పులికంటి కృష్ణారెడ్డి
  • జోగిని : నవల : వి.శాంతి ప్రభోద
  • తెలుగు కథ - నాడు నేడు : సాహిత్య విమర్శ : కోడూరి శ్రీరామ మూర్తి
  • పద్య నాటక త్రయం : నాటకం : డా. మీగడ రామలింగస్వామి
  • నగ్మె ఆబ్ : అనువాదం : రహమత్ యూసుఫ్ జయీ

రంగవల్లి పురస్కారం

ప్రజల మౌలిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే తపనతో రచనలు చెస్తున్న వారికి ఇచ్చే రంగవల్లి పురస్కారాల ప్రదానం సుందరయ్య కళానిలయంలో జరిగింది. ఈ 8వ వార్షిక పురస్కార సభకి ముఖ్య అతిధిగా ప్రముఖ పాత్రికేయుడు ఏ.బి.కె.ప్రసాద్ విచ్చేసారు. పురస్కార గ్రహీతలు. 1)విశిష్ఠ మహిళా పురస్కారం : కాత్యాయనీ విద్మహే 2) విశిష్ఠ కథానిక : ఎస్.శ్రీదెవి (ఎంతెంత దూరం కథ)

పద్యసాధన సభ

పావని సెవాసమితి వారు నిర్వహించిన పద్యసాధన2007 సభకి సహజకవి మల్లెమాల ముఖ్య అథిధిగా విచ్చేసారు. పిల్లలకి భర్తృహరి నీతిశతకం పద్యాల మౌఖిక పరీక్ష నిర్వహించారు.

అఖిల భారత తెలుగు కథా, నవలా రచయితల సదస్సు

విశ్వసాహితి సంస్థ నగర కేంద్రగ్రంథాలయం లొ 'అఖిల భారత తెలుగు కథా, నవలా రచయితల సదస్సు ' నిర్వహించింది. కృష్ణాపత్రిక సంపాదకుడు పిరాట్ల వెంకటేశ్వరులు ప్రారంభోపన్యాసం చెస్తూ రచయితలు ప్రామాణికంగా రచనలు చేయడానికి నిరంతర అధ్యయనం అవసం అని అన్నారు. సదస్సులో పాల్గొన్న యితర ప్రముఖులు. డా. పోతుకూచి సాంబశివరావు, డా.పోరంకి దక్షినామూర్తి , సలాం , భీశెట్టి లక్ష్మన రావు.

తెలుగు వ్యాసరచన పొటీలు.

అంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం విద్యార్థులకు, ఉపధ్యాయులకు తెలుగులో వ్యాసరచన పొతీలను నిర్వహిస్తున్నారు. అధ్యక్షులు ఎ.బి.కె.ప్రసాద్ ఈ విషయం ప్రకటిస్తూ ' తెలుగు భాషా సంస్కృతుల వారసత్వం కాపాడుకోవడం ఎలా? ' అనే అంశం మీద డిసెంబర్ 31 లోగా వ్యాసాలను రాసి పంపవచ్చని తెలిపారు.

స్క్రీన్ ప్లే లో శిక్షణ

తెలుగు విశ్వవిద్యాలయం 5 రోజుల పాటు తెలుగు లో స్క్రీన్ ప్లే లో శిక్షణ శిబిరం నిర్వహించింది. ప్రముఖ సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ బొధకులుగా వ్యవహరించారు.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)