సారస్వతం - పుస్తక పరిచయం
ప్రయాణానికే జీవితం
- మణి వడ్లమాని

నిజం అసలు మానవ జీవితమే ఒక ప్రయాణం పుట్టక నుంచి చావు వరకు. ఆ పేరే ఈ పుస్తకానికి పెట్టడం జీవితాన్ని గురుంచి తెలుసుకోవడమే అన్న భావం తో పెట్టారేమో రచయిత అనిపించింది. ఒక సాహితీ సదస్సు లో కలిసినప్పుడు రచయత సోమశంకర్ ఈ పుస్తకాన్ని ఇచ్చారు. ఇచ్చి బహుశా ఆరు నెలలు అయి ఉండచ్చు. అది ఇప్పటి పూర్తి చేసాను. ఆ వెంటనే పుస్తకం చదివిన అనుభవం అందరి తో పంచుకోవాలన్న అభిలాషతో మన సుజనరంజని పత్రిక ద్వారా తెలియచేస్తున్నాను.

మొదటగా ఆ పుస్తకం చదవడమే ఒక అద్భుతంగా అనిపించింది. మన కళ్ళు తెలియకుండానే అక్షరాల వెంట ,ఆ యా ప్రదేశాల వెంట పరుగులు తీస్తాయి. మూలం లో (One life to ride Ajit Harisinghani). అజిత్ హరి సింఘాని రాసారు. జీవితమే ప్రయాణంగా భావించే యాత్రికుడు అతను మోటార్ బైక్‌పై ఆయన చేసిన సాహసయాత్ర, ని మన తెలుగు లో రాసినప్పుడు రచయత సోమశంకర్ తనే అజిత్ ిలా మారి పోయి ఆ అనుభూతిని, అనుభవాలన్నీ తనదిగా చేసుకొని తను ప్రయాణం చేస్తూ మనలని కూడా వెంట తీసుకుని వెళతాడు.

ఆ ప్రయాణంలో ఎందరో అతనికి ఎదురవతారు, ఎన్నో అనుభవాలు కలుగుతాయి కొత్త ప్రదేశాల్లో ఉండటం అక్కడ ఉండే మనష్యుల జీవనవిధానం, గమనిస్తూ , వారిని కలుస్తూ, పలకరిస్తూ వాళ్ళతో పాటు వాళ్ళ మనిషిగా సాగిన అపూర్వమైన ప్రయాణం ఇది. అక్కడి వాతావరణాలకి తగ్గట్టుగా మెలగడం, ఊహించని ప్రమాదాలకి సిద్ధ పడటం కొన్ని సందర్భంలో స్నేహంతో నెగ్గుకురావడం వంటివి ఇలాంటి సాహస యాత్రలు చేసే వాళ్ళకి తెలియవలసిన ముఖ్యమైన విషయాలు.

పూణే నుండి జమ్ము వరకు సాగిన సాహసయాత్ర. దారిలో అతనికి ముఖ్యంగా చండీగఢ్ నుండి హిమాచల్ కి వెళ్ళే దారి లో కిరాతపూర్ నుండి కసోల్ మీదుగా పార్వతీ నదిని దాటి అక్కడ్ నుండి రోహంతాంగ్ కనుమలు దాటినప్పుడు మన భారత దేశపు జీవన విధానాన్ని తలచుకొని అనుకుంటాడు ఆహ! నాదేశం ఎంత సందడిగా,సజీవంగా ఉంటుందో అని. అలా ప్రయాణిస్తూ హిమాచల్ నుంచి లడక్ వెళ్లి దారి లో సూరజ్ తాల్ అనే ఒక అద్భుతమైన సరస్సు అతనికి కనిపిస్తుంది. అదో ప్రాకృతిక దృశ్యం అని వర్ణిస్తాడు. అక్కడ నుంచి లేహ్ వెళ్ళినప్పుడు అక్కడి ఎత్తయిన పర్వతం ఖర్జుంగ్ దగ్గరకి వెళ్ళడం అక్కడి గాలి లో అతను ఓంకార నాదాన్ని వినడం అద్భుతంగా అనిపించింది.

ఎందుకంటె మేము ఉత్తరాఖండ్ లోని శివాలిక్ పర్వత శ్రేణులు కి వెళ్ళినప్పుడు అదే భావం. ఎక్కడ చూసినా ఆ పవిత్రభావం శంకరుడు అక్కడే ఉంటాడు అని. ఝంఝా మారుతంగా వీచే గాలి లో ఓంకారం వినిపిస్తూనే ఉంటుంది అని.లేహ నుండి అతని ప్రయాణం కాశ్మీరు లోయ వైపు కి , సాగుతుంది. అక్కడ వారు క్షణం క్షణం బతుకు తో జరిపి పోరాటం దగ్గరనుంచి చూసేవారికి తెలుస్తుంది. మనం సేఫ్ గా ఉండటం కోసం వాళ్ళు సర్వస్వం కోల్పోతున్నారని. అందుకే అంటారు రచయత ఒక్క క్షణం నాకు అపరాధభావన కలిగింది అని.

అక్కడ నుంచి చివరగా ఇంటికి తిరిగి వెళ్లి పోయేటప్పుడు ఒక అనుభవం ఎదురవుతుంది . దాన్ని అతను అత్యంత ప్రమాదకరమైన ది గా అంటారు. అది ఒక టిసి యొక్క మూఢ భక్తి, ఆలోచించకుండా పాటిస్తే - అది ఎంత గుడ్డిదో ఎంత ప్రమాదకరంమైనదో అని అంటారు.

ఈ రచన చదివిన తరువాత నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే రచయత రాసిన కాశ్మీరు అనుభవాలు ఇంచు మించుగ మాకు ఎదురయ్యాయి.మేము కార్గిల్ యుద్ధం అయిన మూడు నెలలకి శ్రీనగర్ చూడటానికి వెళ్ళాము.వెళ్ళినతరువాత గాని అక్కడి నిజపరిస్థితి తెలియలేదు.

ఎక్కడ చూసినా,పోలీసులు,సైనికులు,సామాన్య ప్రజా మొహం లో బతుకు భయం, గుల్మార్గ్ లో మా దగ్గర ఉన్న న్యూస్ పేపర్స్ ని తీసుకున్న సైనిక సోదరులు, బోటు హౌస్ లో మాకు ఆతిధ్యం ఇచ్చిన కాశ్మిరులు, మేము దక్షిణాది వాళ్ళమని తెలిసి మమ్మల్ని కలవడానికి వచ్చిన ఇద్దరు తెలుగు తెలిసిన తమిళులు,ఇలా ఎన్నో అనుభవాలని గుర్తుకు తెచ్చిన రచన ఇది.

ఈ పుస్తకం చచదివిన తరువాత ఎవరికైనా నిజంగానే జీవితాన్ని ప్రయాణనికే ఇచ్చేయాలి అని అనిపిస్తుంది.

అందరూ ఒక్కసారైనా చదవతగ్గ పుస్తకం

ఇది కినిగే లో కూడా దొరుకుతుంది

ప్రతులకు:

K. Soma Sankar
1-30-28, Tirumalanagar,
Kanajiguda, Secunderabad 500 015.
ధర : రూ: 120.00
మొబైల్ ఫోను: +91 99484 64365
email somasankar@gmail.com


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)