కవితా స్రవంతి
నేలరాలుతున్న పత్రహరితాలు!
- బిక్కి కృష్ణ

నింగివైపు చూస్తున్న
రైతుల చూపులదారాలు తెగి..
కనురెప్పల నల్లనిమేఘాల నుండి
కన్నీటి చినుకులు రాలిపడ్డాయి
ప్రపంచీకరణ పెనుతుఫానుదెబ్బకు
పచ్చనిచెట్టులా నేలకొరిగాడు రైతన్న
నేలతల్లి నుదుట పచ్చబొట్టుపెట్టిన
రైతుభార్య తాళిబొట్టు పుటుక్కున తెగిపడింది
గూడుచెదిరిన గువ్వల్లా దిక్కులేనివారయ్యారు పిల్లలు
రైతుల ఆత్మహత్యలు సహజమరణాలని కూసాయి రాజకీయనక్కలు!
పత్తిరైతుల చేనేతకార్మికుల మరాణాల లెక్కలను
తేల్చలేకపోయాయి బూర్జువాలపత్రికలు ...
పరామర్శలు ఎక్స్ గ్రేషియాలు షరా మామూలే....
పంటపొలాలపై సెజ్ రాబందుల కాలిగోళ్ళగురుతులు కనిపించవు
వేపచెట్టుపై వాలిన డంకెల్ డేగనుచూసి
బెదిరిపోయిన పల్లెప్రజల ప్రాణ పక్షుల రెక్కలచప్పుడు వినిపించదు
చీఫ్ లిక్కర్ తో పాటు చిల్లరకొట్టులోకి ప్రాకిన పెప్సీ కోకోకోలా విషనాగులు
చిమ్మిన కాలకూటవిషం కూలీల కుటుంబాల్లో కడుపుకోతను మిగిలించింది
నట్టింట టీ.వీలో కులవృత్తుల్ని మింగేసి
ఆవులిస్తున్న గ్లోబల్ కొండచిలువ విషసంస్కృతి రంగులదృశ్యాలు!
ఇక్కడ మట్టిమనిషిని ఏనాడో మట్టిలో కలిపేశారు!
రైతుల చావుకు కారణపైన ప్రభుత్వాలు పార్టీలు సిగ్గుపడటంలేదు..
ఉద్యోగులకు జీతాలుపెంచి ఓట్లబ్యాంకును కాపాడుకుంటున్నాయి
ఏలికలస్వార్థం నిర్లక్ష్యం పురుగుల మందుగా మారి
గుట్టుచప్పుడు కాకుండా రైతుల ఉసురుతీశాయి !
నేరస్తులు నాయకులే... వారినిశిక్షించే దెవరు?
ఎలాగో చావాలని నిర్ణయించుకున్న రైతులు
తమచావులకు కారకులైన వారిని
ఎందుకు చంపిచావరో.. అర్థంకాదు...!

(ఆత్మ హత్యలు చేసుకుంటున్న రైతులశవాలు రోజూ పత్రికల్లో చూసి ..చలించి)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)