ధారావాహికలు
విశ్వామిత్ర 2015 - నవల ( 7వ భాగము )
- యస్ యస్ వి రమణారావు

మునిసిపల్ కమీషనర్ శివకుమార్ తన క్లోజ్ కాన్ఫిడెంట్స్ తో మీటింగ్ హోటల్ బ్లాస్ట్ విషయమై మీటింగ్ పెట్టాడు.

"మనకందరికీ తెలుసు ఆ హోటల్ నాలా స్థలాన్ని కబ్జా చేసి కట్టినది అని. హోమ్ మినిష్టరేనా చెయ్యగలిగింది మేం మాత్రం చెయ్యలేమా అని కొన్ని రాజకీయపార్టీల దన్నుతో కొన్ని లేబర్ కాలనీలు కూడా అక్కడ వెలిశాయి. ఆశ్చర్యకరమూ, నవ్వూ వచ్చే విషయం ఏమిటంటే అసలు ఈ హోటల్ కి టూరిస్ట్ లు ఎక్కువమంది రావట్లేదనే ఆ నాలాలోనే ఉన్న ఒక లేబర్ కాలనీని, అశుభ్రంగా ఉందనీ, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందనీ హెల్త్ డిపార్ట్మెంట్ చేత నోటీసులిప్పించి ఖాళీ చేయించాడు హోమ్ మినిష్టర్. ఇప్పుడు ఆ హోటల్ నే ఎవరో కూల్చేశారు. ఇదే మంచి అదను టు గెట్ బాక్ ద లాండ్ లాస్ట్. ఈ ఒక్క నాలాయే కాదు ఈ సిటీలో ఇంకా ఇలా ఆక్యుపై చేసిన నాలాలు ఇంకా చాలా ఉన్నాయి. అందరికీ నోటీసులు పంపండి. నోటిమాటగా ‘ఇన్వెస్టిగేషన్ నెపంతో పోలీసులు మాటిమాటికీ వచ్చి విసిగిస్తారు. ఖాళీ చేసి వెళ్ళిపోతే మంచిది’ అని చెప్పండి. నిజంగా genuine కేసుల్ని నాదగ్గరకు పంపించండి. ఇదంతా ఎవరు చేశారో, ఎవరి మధ్య పోరాటమో మున్ముందు తేలుతుంది. We will use this situation to our advantage to recover the land lost.Till now the land grabbers ruled the roast.Its our time now."

(సశేషం)


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.




గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)