ఎగిరే పావురమా (నవల)

సమీక్ష: తాటిపాముల మృత్యుంజయుడు

రచన: కోసూరి ఉమాభారతి

ఆధునిక జీవితంలో, స్పీడు యుగంలో నవలలు రాసేవాళ్లు, వాటిని చదివేవాళ్లు తగ్గుతున్నారని బాధకలుగుతున్న కాలంలో తెలుగు సాహిత్యంలో నవలలు రావడం ఎంతగానో హర్షించదగ్గ విషయం. అందునా, ఈ మధ్యకాలంలోనే రచనారంగంలోకి అడుగిడిన కోసూరి ఉమాభారతిగారు 'ఎగిరే పావురమా' నవల రాయడం సంతోషాన్ని కలిగిస్తున్నది. ఈ నవలలో ముఖ్యపాత్ర పుట్టగానే అవిటిరాలు కాబడ్డా ఆడపిల్ల. నవలంతా ఉత్తమ
పురుషలో చెప్పబడుతుంది. ప్రముఖ నాట్యకారిణిగా అటు తెలుగుభూమిలో, ఇటు అమెరికాలో పేరు తెచ్చుకొన్న ఉమాభారతి ఈ అంశాన్ని ఎత్తుకోవడానికి కారణం కొద్ది సంవత్సరాల క్రీతం భారతదేశంలో ఆడపిల్లల మీద అమానుషంగా జరిగిన భ్రూణహత్య, శిశుహత్యలు కావచ్చు.చాలావరకు ఈ నవల గ్రామంలో ఉండే దేవాలయ నేపథ్యంలో సాగుతుంది. తెలుగువారందరికి సుపరిచితమైన ఆలయ పూజారి, పూజారి కుటుంబం, దేవాలయానికి సేవచేస్తూ బ్రతికే మనుషులు, పండగలు, ఉత్సవాలు వీటన్నింటిని కళ్లకుకట్టినట్టుగా చిత్రీకరించడంలో సఫలీకృతమైంది రచయిత్రి. సులభంగా చదివించే వాక్యనిర్మాణతో కథనం సాగుతుంది. అవిటిరాలైన బాలిక గాయత్రి మనసులో చెలరేగుతున్న భావాలను మనసుకు
హత్తుకునే విధంగా వర్ణించబడ్డాయి. అయితే పాఠకులు ఊహించే మలుపులు, ఎత్తుగడలు ఈ నవలలో చోటుచేసుకోలేదు. ఏకబిగిన సులభంగా చదివేటట్టు ఉంది. నవల మొత్తం రెండు ముఖ్యపాత్రల చుట్టు, ఇంకో నాలుగైదు సహాయపాత్రల చుట్టు సాగుతుంది. మధ్య మధ్యలో వచ్చే పెన్సిల్ తో వేసిన బొమ్మలు చూడముచ్చటగా ఉన్నాయి.

అంతర్జాతీయంగా తెలుగు సాహిత్యాభివృద్ధికి సేవ చేస్తూ, కొత్త రచయితలను ప్రోత్సాహిస్తున్న వంగూరి ఫౌండేషన్ ఈ నవలను ప్రచురించింది. వలభోజు జ్యోతి పబ్లిషర్సు ద్వారా ముద్రించబడింది.

దొరకు చోటు:

నవోదయ బుక్ హౌస్, హైద్రాబాదు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (vangurifoundation@gmail.com, ramarajuvamsee@yahoo.co.in)
కోసూరి ఉమాభారతి (ukosuri@hotmail.com)

వెల: Rs. 100/-
మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)