పద్యం – హృద్యం

పాఠకులకునూతనసంవత్సరశుభాకాంక్షలు!

నిర్వహణ :పుల్లెల శ్యామసుందర్

ఈ క్రింది "ప్రశ్న"కు పద్య రూపములో జవాబు పంపాలి. మీ జవాబులు విద్యుల్లేఖ ద్వారా ( e-mail : padyam_hrdyam@yahoo.com) మాకు 20వ తారీఖులోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. ఈ శీర్షికలో ప్రచురించడానికి పాఠకులనుండి పూరణలు మాత్రమే కాకుండా ప్రశ్నలను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రశ్నలువీలున్నంతలో తేట తెలుగులో ఉండి, సమకాలీనములైతే బాగుంటుందని మా అభిప్రాయము.

మాసంప్రశ్న:

సమస్య: తప్పులుఁజేసెడిమనుజుడెధన్యుండిలలో

తమాసం ప్రశ్న:

నిషిద్ధాక్షరి (ఇచ్చినఅక్షరములువాడకుండాపద్యంవ్రాయవలెను):
'ర' మరియు 'మ' అక్షరములు (వానిగుణింతములు) వాడకుండాశ్రీరామునిస్తుతిస్తూపద్యమువ్రాయవలెను.

ప్రశ్నకుమాకుఅందినక్రమములోపూరణలు ఇలా వున్నాయి.

టేకుమళ్ళవెంకటప్పయ్య, విజయవాడ

విష్ణువంశనజనియించివిల్లుబూని
దానవాంతకదీక్షనుదాల్చితాను
సకలజనులెల్లలోకాలచల్లగుండ
దేశపాలనగావించిదేవుడయ్యె!

గండికోటవిశ్వనాధం, హైదరాబాద్‌.

భానుకులోధ్భవున్‌, సుగుణవంద్యుని, పాలితసత్యసంధునిన్‌
ధీనిధి,జానకీవిభుని, దివ్యయశస్విని, నీతికోవిదున్‌
దానవభంజనున్‌, అభయదాతను, పూజితపావనాఖ్యునిన్‌
ధ్యానవిశేషభక్తినుతతత్వవిధిన్‌, భజియించిగొల్చెదన్‌.

కందిశంకరయ్య, హైదరాబాదు
ఇనకులదుగ్ధాంబుధిశశి!
ఘనశివకోదండభంగ! కాశ్యపిజపతీ!
దనుజాంతక! సజ్జనహృ
ద్వనజాదిత్యా! నుతింతు, దయఁగనుఁగొనవే!

సూర్యకుమారివారణాసి, రాలి, నార్త్కెరొలిన

యజ్ఞసాఫల్యతనాదివిష్ణువునీవె
కౌశల్యసుతుడైతివిశ్వవిభుడ
ఇనకులతిలకుడైఇలతల్లిదండ్రుల
ఆనతితలదాల్చు తనయుడైతి
కౌశికుతోడనుకాననకేగితి
కోదండపాణివై సదయహృదయ
శివధనువునుద్రుంచిసీతనుపెండ్లాడి
పెద్దలదీవెనలందుకొంటి
కపులతోడజనిలంకాధిపతినిజంపి
దనుజపీడనుబాపిఘనుడవైతి

సత్యవాక్పాలనయునేకపత్నియన్న
జానకీవల్లభా! సదాజగతిజనులు
నిన్నుభగవంతుడనిసల్పు! నిత్యపూజ
ప్రభువ! సితాపతీగతిప్రగతినీవె

భానువంశజుడవుభానుతేజుండవు
అవనినిన్నుగొలుచుఆంజనేయ
భక్తపాలనీదుపాదధూళినహల్య
ధన్యజీవియగుచుతనువుదాల

బులుసువేంకటసత్యనారాయణమూర్తి, రాజమండ్రి

వీలగునాబాలునకని
చాలకుతుకపడిభటులకుజనకుడుచెప్పన్
వేలాదిభటులుతేగా
శూలాయుధుధనువుత్రుంచిసుదతినిపొందెన్

డా.రామినేని రంగారావు యం.బి,బి.యస్,పామూరు,ప్రకాశం జిల్లా.

గాధేయు యజ్ఞంబు కాపలా చేపట్టి
విఘ్నాలు లేకుండ వేది కాచె
బండయై శాపాన పడియున్నహల్యనే
పాపంబు తొలగించి పతికొసంగె
నావపై జనులను నదిని దాటించెడు
గుహునితో నెయ్యంబు కూడగట్టె
వాలిని వధియించి వాని తోబుట్టునే
సింహాసనం బెక్క చేయినిచ్చె
వసుధ పుత్రిక దండకావని వసింప
పంక్తికంఠుడు వంచించి పట్టుకెళ్ళ
కోతిబంటుల సాయాన కూల్చి వాని
జానకిని తెచ్చె,పాలించె జనులు పొగడ

జంధ్యాలకుసుమకుమారి, హైదారాబాదు

జనకాజ్ఞాపాలనవిధి
ననుజుండుసతియునడుగుననడుగిడిసాగన్
వనవాసగతుండాయెన్
ఘనకౌసల్యాసుతుండఘవిఘాతిభువిన్

సమవర్తి, హైదరాబాదు

జనకునివాక్కునిల్పగనిజాంగనయున్సహజుండుతోడుగా
ఘనవనవాసివైదనుజకాండకృతాంతుడవై తపస్వివై
వనధినిసీతకైగడచిబాలిశుదానవుజంపిలోకముల
నినువినుతింపగాచితిదినేశకులాగ్రణి!నిన్నుగొల్చెదన్!!

శివప్రసాద్చావలి,సిడ్నీ
వేవేలుపలుకనేలన్
శ్రీవిష్ణునుతిన్! బదులుగ, ప్రీతిగవైదే
హీవిభునీశుపలుకుగన్
కైవల్యంబుకుతలచిన, కలుగునదికలిన్!

నేదునూరిరాజేశ్వరి, న్యూజెర్సీ

సీతాపతినేకొలిచిన
నేతావుననున్నగానినేతగతానై
ఆతాటకివధచేయగ
పాతకనాశనుడనుచుభక్తిగబొగడన్

విజయ్భాస్కర్, మలక్పేట్, హైదరాబాద్.
ఆతడెలవకుశజనకుడు
ఆతడెసీతకుపతియైఆనతినిల్పెన్
ఆతెడెలంకనుకూల్చెను
ఆతడెసులువుగబాపెనుఆపదలెల్లన్

సుమలతమాజేటి, క్యూపర్టీనొ, కాలిఫోర్నియా

కంజహితకుల,నీలంపుకాంతిదేహ
పంకజాక్ష, పాటనయుతపల్లవపద
సకలదేవతావందిత, సత్యభాష
జానకీవల్లభ, నినునేసన్నుతింతు
నొసగవెయభీష్టసిద్ధులన్నూత్నసాలు

డా||అయాచితంనటేశ్వరశర్మ, కామారెడ్డి, నిజామాబాదుజిల్లా

జానకిపెండ్లియాడితివిచక్కనివైనగుణాలునిండగా
పూనికతోడసత్యమునుబూనివనమ్ములనైననిచ్చతో
పోనడువంగనెంచితివిపూజ్యమునీకథభూమికెప్పుడున్
నానతులైత్తునీకుననునవ్యపథమ్ములసాగజేయవే!

జానకిపోలికజగతిని
పూనుచుకాపాడవయ్య! పూజ్యగుణయుతా!
ధీనిధి!జనులనుసుగతుల
పోనడువగజేసి, లోకభూషితదీప్తిన్!

ఇంద్రగంటిసతీష్కుమార్, చెన్నై

అలవిష్ణువుసతితోడన్
ఇలదిగెకౌసల్యతనయునిగ, గుణనిధిగా!
బలలంకేశునిగూల్చిభు
విలోనశాంతినెలగొల్పెవిశ్వవిభుండై!

రాజతల్లాప్రగడ, సిడ్నీ

(కవిత)
పాహిపాహియనుచుచేతులెత్తి
నినుగొలిచెదనోయిజానకీవల్లభ
దయజూపగజాగేలసేతువయ్యా
ఓ కౌసల్యతనయా,సీతానాయకా

 




మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)



పేరు:
ఇమెయిల్:
ప్రదేశం:
సందేశం:
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 


గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.


(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)