Sujanaranjani
           
  సారస్వతం  
 

త్రోలాన్కవితా ప్రక్రియ 

 

                                                                - పరిచయకర్త:    బొల్లిముంత వెంకట రమణారావు

 
 
 

 త్రోలాన్ కవితా ప్రక్రియ నాలుగు భాగాలుగా వుంటుంది. ఒకొక్క భాగం నాలుగు వరుసలు కలిగి వుంటుంది. ప్రక్రియను  వాలెరీ పీటర్సన్ బ్రౌన్‌. కవితలో ప్రాస విధానం ఉన్నప్పటికి భావ సౌలభ్యం కోసం తెలుగులో ప్రాసను వినియోగించలేదు.

మొదటి భాగంలో నాలుగు వాక్యాలు  అనంతరం .....

రెండవ భాగంలో ---- మొదటి భాగంలోని మొదటి వరుస రెండవ అక్షరంతో మొదలు పెట్టాలి. అలా రెండవ భాగం నాలుగు వాక్యాలు ప్రతి వాక్యం మొదట ఉపయోగించిన అక్షరంతోనే వ్రాయాలి

మూడవ భాగంలో --- రెండవ భాగంలోని మొదటి వాక్యం రెండవ అక్షరంతో మొదలు పెట్టాలి. అలా రెండవ భాగం నాలుగు వాక్యాలు ప్రతి వాక్యం మొదట ఉపయోగించిన అక్షరంతోనే వ్రాయాలి

నాలుగవ భాగంలో ---- మూడవ భాగంలోని మొదటి వాక్యం రెండవ అక్షరంతో మొదలు పెట్టాలి. అలా రెండవ భాగం నాలుగు వాక్యాలు ప్రతి వాక్యం మొదట ఉపయోగించిన అక్షరంతోనే వ్రాయాలి

గమనిక రరరర 

భాష సౌలభ్యం కోసం సంయుక్త అక్షరాలు/ ద్విక్తాక్షరాలు బదులుగా  వర్ణము భావానికి అనుగుణంగా వ్రాయడం జరుగుతుంది.

తెలుగులో తొలిసారిగా త్రోలాన్ కవితా ప్రక్రియను పరిచయం చేస్తున్నాను

- - -

అంతరంగం !

మనిషి మనిషిని మరిచిపోతున్న సందర్భం

రొకరు నవ్వుతారు, వేరొకరు ఏడుస్తారు

మోసపోతున్నమంటూ మోసపోతారు

మరణం వరకు మనిషి చివరి పాట

 

నిలకడలేని మనస్సులు తలరాతంటూ

నిట్టూర్పుల సెగతో మిగిలే అసంతృప్తి

నిజం నగ్నంగా బజారుపాలయిందని

నిద్రపోని కళ్ళ కలవరింతల అలజడి

 

లతలా అల్లుకొన్న అవలక్షణం లెక్కలు

లేదు కాదు అన్న ధోరణి అన్న లోపం

లోకాన్ని నిందిస్తూ సమర్ధిస్తారు

లోకంనాడి తెలియదు, లోగుట్టు తెలియదు

 

తన దాకా వస్తే తగువులాట

తలవంచుకుంటే తోపులాటలా వుంటుంది

తప్పు నిప్పులా రగిలి చల్లారినట్లున్నా

తలగడ క్రింద త్రాచులా అది బుసకొడుతుంది !


 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 




సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech