Sujanaranjani
           
  శీర్షికలు  
       తెలుగు తేజోమూర్తులు
 
 

- రచన : ఈరంకి వెంకట కామేశ్వర్.     

 

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టతనాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరాకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాంటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందుపరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం


రిమోట్ సెన్సింగ్ విశిష్ట శాస్త్రవేత్త - పద్మశ్రీ డాక్టర్ బులుసు లక్ష్మణ దీక్షుతులు

భారత దేశ ప్రతిష్టాత్మక సంస్థ - ఎన్ ఆర్ ఎస్ సంచాలకుడిగా భారత దేశాన్ని రిమోట్ సెన్సింగ్ క్షేత్రంలో అంతర్జాతీయ టలంలో పెట్టడమే కాకుండా, శాస్త్ర సంకేతిక రంగాలలో ప్రపంచంలో కేవలం ఐదు దేశాల సరసన నిల్చోబెట్టారు. శిఖరాగ్ర స్థానాన్ని ఆపాదించడానికి మిక్కిలి కృషి చేసారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా (ఇమేజ్ ప్రాససింగ్ ద్వారా) భారత దేశ వనరుల పఠలాలను విభిన్న వర్ణాలలో చిత్రీకరించి, వాటి పర్యవేక్షణకు తోడ్పడ్డారు. క్యరాజ్య సమితి (యు ఎన్) సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ ఆసియా అండ్సిఫిక్ సంచాలకుడిగా వ్యవహరించారు. అతి విశిష్ట క్షేత్రాంశాలైన - సెర్వో మెకానిక్స్, ఇమేజ్ ప్రాససింగ్, కంట్రోల్ సిస్టంస్, ఆటోమేషన్ లో శిక్షణా, అధ్యయన సంస్థలు నెలకొల్పి క్షేత్రాభివృద్ధికి తోడ్పడ్డారు. అంతే కాక భావి శాస్త్రవేతాలని రూపొందించి దేశానికి అందించారు. ఎస్ ఆర్ (ఇస్రో) - రెమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ అధ్యక్షుడిగా పనిచేశారు. భారత దేశంలో ప్రప్రధమంగా గ్రే స్కేల్, కలర్ (రంగు) స్కానర్లను రూపొందించారు. ఇమేజ్ డిజిటైజషన్ కోసం స్పాట్ స్కానర్ ని ఆవిష్కరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత దేశానికి " ఇన్ ది స్కై " (ఆకాశంలో కన్ను) ఏర్పరిచారు - పశ్చిమ అగ్రగామి దేశాలకు దీటుగా నిలిచారు - అతి విశిష్ట శాస్త్రవేత్త డాక్టర్ బులుసు లక్ష్మణ దీక్షుతులు గారు.

శాస్త్రీయ పరిజ్ఞానం ప్రయోజనాలు సామాన్య మత్స్య కారులకి అందించే దిశగా " పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్ " లు కనిపెట్టి సామాన్యులకు ప్రయోజనాలు చేకూర్చారు.

వీరి కృషి ఫలితంగా భారత ప్రభుత్వం - ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ సెర్వీసెస్ ( ఎన్ సి ఎస్) సంస్థ నెలకొల్పింది.  

విశిష్ట శాస్త్రవేత్తగా ..... :  

భారత దేశాన్ని రిమోట్ సెన్సింగ్ (టెక్నాలజీలో) సాంకేతిక క్షేత్రంలో అంతర్జాతీయ పటలంలో పెట్టడమేకాక నేడు క్షేత్ర రంగంలో ఐదు అత్యుత్తమ దేశాలలో ఒకటిగా తీర్చిదిద్దారు. క్రమశిక్షణ, ఓర్పు, నేర్పు, పరిజ్ఞానం సమ్మేళణం విజయానికి దారి తీసింది.

భూ ఉపరితళంలో జరిగే మార్పులను పర్యవేక్షించారు డాక్టర్ బి ఎల్ గారు. దేశంలో ప్రాంతంలో పంటలు పండిస్తున్నారో ప్రప్రధంగా, శాస్త్ర సాంకేతిక, ఉపగ్రహ వీక్షణా చిత్రాలను నిర్మించారు. ప్రపంచంలో కేవలం ఐదారు దేశాలకే ఘనత దక్కింది. అందులో ఒకటిగా భారతావనిని నిల్చోపెట్టడం వెనుక ఎంత అవిరళ కృషి, సాధనా, నైపుణ్యం ఉన్నాయో చెప్పకనే తెలుస్తోంది.

1968 కాలంలో భారత దేశ ప్రతినిధిగా నాటి యు ఎస్ ఎస్ ఆర్ (నేటి రష్యా) సందర్శించి - ఎస్ సి లో " స్కూల్ ఆఫ్ ఆటోమేషన్ " నెలకొల్పటానికి క్రీయాశీలక పాత్ర పోషించారు.

1992 లో మెరైన్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (మార్సిస్) రూపొందించారు శ్రీ దీక్షుతులు గారు. ఇది ప్రస్తుతం భారతీయర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ - డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ అనుభందంగా ఉంది. " హై టెక్నాలజీ ఓషన్ రిమోట్ సెన్సింగ్ " ని సామాన్య మత్స్య కారులకి తీసుకు వచ్చారు. దీనికి అనుసంధానంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. పొరుగు దేశాలకీ సహాయం అందించారు.

సముద్ర ఉపరితల గ్రీష్మం, సముద్రం రంగు, క్లొరోఫిల్ తదితర విషయాలను పరిగణంలోకి తీసుకుని కొలిచే పరిజ్ఞానాన్ని రూపొందించి, ఇతర శాస్త్రవేత్తలకు దిశామార్గం చూపించారు.

శాస్త్రీయ పరిజ్ఞానం ప్రయోజనాలు సామాన్య మత్స్య కారులకి అందించే దిశగా " పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్ " లు కనిపెట్టి సామాన్యుల ప్రయోజనాలు చేకూర్చారు.

వీరి కృషి ఫలితంగా భారత ప్రభుత్వం - ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ సెర్వీసెస్ ( ఎన్ సి ఎస్) సంస్థ నెలకొల్పింది. సంస్థ పాలక మంలి అధ్యక్షుడిగా - సముద్ర స్థితి గతులను వ్యూహాత్మకంగా చిత్రీకరించడం, ఇండియన్ ఓషన్ మోడలింగ్ ఇత్యాది అంశాల మీద క్షేత్ర స్థాయి పరిశోధనలు చేసి - ప్రయోగాలు అందించిన విశిష్ట శాస్త్రవేత్త.

చదువు, కొలువు:

1936 లో జన్మించారు బులుసు లక్ష్మణ (బి ఎల్) దీక్షుతులు గారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి క్ట్రికల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రులై, ఎం పూర్తి చేసి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి 1964 లో పీ హెచ్ డి అందుకున్నారు. అత్యుత్తమ పీ హెచ్ డి అందించినందుకు మార్టిన్ ఫోస్టర్ పతకం అందుకుని రానున్న కాలంలో ఎలాంటి కార్యలు సాధించ గలరో పరిచయం చేసారు. 1965 లో ఎస్ సి ఉప ఆచార్యుడిగా పనిచేసారు. 1970 నుండి 1976 దాకా ఆచార్యుడిగా వ్యవహరించారు. 1971-72 తరుణంలో బి ఎం వాట్సన్ రిసర్చ్ సెంటర్ (అమెరికా) సందర్శక శాస్త్రవేత్తగా పనిచేశారు. 1976 లో నేష్నల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ ఆర్ ఎస్ ) - టెక్నికల్ విభాగాధిపతిగా పనిచేసి 1982 లో సంస్థ సంచాలకుడిగా పదవీ భాద్యతలు శ్రీకరించారు.

1996 వరకూ ఎన్ ఆర్ ఎస్ విశిష్ట శాస్త్రవేత్తగా, సంచాలకుడిగా సేవలందించి రెటైర్ ఐయ్యారు. 1994-97 మధ్య - ఇండియన్ జెఒ స్పియర్ బయో స్పియర్ ప్రోగ్రాం అధ్యక్షులుగా వ్యవహరించారు. శాస్త్రీయకరమైన ఫలితాలని ఉపగ్రహ డాటా తో కలిపి అధ్యయనం చేసి - భూమి, సముద్రం, పర్యావరణం మధ్య అన్యూన్య చర్యలు కూడా పరిగణంలోకి తీసుకుని మెరుగైన పరిణామాలు అందించారు. 150 పైగా పరిశోధనా పత్రాలు (రిసర్చ్ పేపర్స్) ప్రకటించారు. వరంగల్ లోని నేష్నల్ న్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యక్షులుగా వ్యవహరించారు.

వీరి పర్యవేక్షణలో 18 మంది డాక్టరేట్ పట్టాలు అందుకున్నారు. ఎం టెక్ విద్యాభ్యాసంలో 50 మంది విధ్యార్ధులు డెసర్టేషన్లు పూర్తి చేసారు. రిమోట్ సెన్సింగ్ డెటా విశ్లేషణ, ఇమేజ్ ప్రాససింగ్ న్యూరల్ నెట్ వర్క్స్ క్షేత్రాంశాలు వీరికి ప్రీతిపదమైనవి.

హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయ కంప్యూటర్ డిపార్ట్మెంట్ లో ఆచార్యుడిగా పనిచేశారు. ఇమేజ్ ప్రాససింగ్, మషీన్ లర్నింగ్, న్యూరల్ నెట్ వర్క్ అంశాలలో పరిశోధనలు చేశారు. డిజిటల్ రిమోట్ సెన్సింగ్ పుస్తకానికి ముందుమాట వ్రాశారు. జే ఎన్ టి యు కాకినాడ గౌరవ ఆచార్యుడిగా వ్యవహరించారు. జియో కాటో ఇంటర్నేషనల్ పత్రిక సంపాదక సభ్యుడిగా ఉన్నారు.

గౌరవ, పురస్కారాలు:

డాక్టర్ బులుసు లక్ష్మణ దీక్షుతులు గారు అనేక గౌరవ, సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు:

అత్యుత్తమ ఇంజినీర్ గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డు (1984)

ఎన్ ఆర్ ది సి పురస్కారం

డాక్టర్ బిరెన్ రాయి స్పేస్ సైన్స్ అవార్డు (1988)

1991 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అందుకున్నారు

శివానంద విశిష్ట పౌర పురస్కారం (1998)

తైలాండ్ రిమోట్ సెన్సింగ్ సంస్థ నుండి బూన్ ఇంద్రాంబర్య బంగారు పతకం

ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా - నుండి లైఫ్ టైం అచీవ్ మెంట్ గా ఆర్యభట్టా అవార్డు (2002)

ఆచార్య, హైద్రాబాద్ విశ్వవిద్యాలయం

ఆచార్య బ్రహ్మ ప్రకాష్ జ్ఞాపక పతకం

ఫెల్లో ఇండియన్ నేష్నల్ సైన్స్ అకాడమి

ఫెల్లో

ఫెల్లో ఆంధ్ర ప్రదేష్ అకాడమి ఆఫ్ సైన్సెస్

ఫెల్లో తార్డ్ వోల్డ్ అకాడమి ఆఫ్ సైన్సెస్ (ఇటలీ)

ఫెల్లో ట్

ఎస్ సి " డిస్టింగ్ విష్డ్ అలుమ్నై " పురస్కారం (2006)

ఫెల్లో ఇండియన్ జియో ఫిజికల్ యూనియన్ ( జి యు)

డిస్టింగ్ విష్డ్ ఫెల్లో, ఆస్ట్రొనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా

ఆస్థాన విద్వాన్ పురస్కారం, దత్త పీఠం

ఫెల్లో ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్

ఫెల్లో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా

సాస్వత సభ్యుడు, బయో మెడికల్ ఇంజినీరింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా

జీవిత సభ్యుడు, ఇండియన్ ఫిజిక్స్ అస్సోసియేషన్

ఫెల్లో, ఇండియన్ మీటియరోలాజికల్ సొసైటీ

జీవిత సభ్యుడు, ఇన్స్ట్రుమెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా  

అటు దేశ ప్రయోజనాలు, ఇటు ప్రజా ప్రయోజనాలు సాధించ గలిగారు డాక్టర్ దీక్షుతులు గారు. ప్రతిష్టాత్మక విజ్ఞాన సంస్థలైన - ఎన్ ఆర్ ఎస్ , మార్సిస్, ఇస్రో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. భారత దేశానికి " ఇన్ ది స్కై " (ఆకాశంలో కన్ను) ఉపగ్రహాలు ఏర్పరిచారు - పశ్చిమ అగ్రగామి దేశాలకు ధీటుగా నిలిచారు - భారత దేశ స్వప్రయోజనాలను కాపాడుతూ, పెంపొందిస్తూ వచ్చారు అతి విశిష్ట శాస్త్రవేత్త డాక్టర్ బులుసు లక్ష్మణ దీక్షుతులు గారు.


 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech