Sujanaranjani
           
  సారస్వతం  
  పుస్తక పరిచయం - 2

           వైవిధ్య భరితమయిన కధలు ''నిప్పుల తుఫాను"

 
 

                                                                - పరిచయకర్త:    శైలజామిత్ర

 
 
 

కధలు ఎన్ని రకాలుగా మనకు ఎదురైనా ఆస్వాదించడం తెలుగు వాడి లక్షణం. రామాయణ మహాభారత కధల నుండి కూడా చందమామ కధలు, భేతాళ కధలు, మానవీయ కొణం కధలు, కాశీ మజిలీ కధలు, ఇలా అనేక కధలు తెలుగువారి సొంతం. ఇక కొత్తదనం కోసం పాకులు ఎదురుచూస్తే కేవలం నిరాశే ఎదురవుతోంది. గురుజాడ వారి 'దిద్దుబాటు' నుండి నేటి వరకు ఎన్నో కధలు మన ఆధునిక సాహిత్యంలో చోటుచేసుకున్నాయి. అయితే ఎలా రాస్తే కదా అవుతుంది అంటే మాత్రం కదా ఇలా అనే కొలమానం, ఇలానే ఉండాలనే సరిహద్దు లేదు.    

అదే ధోరణిలో సాగిపోతున్న తెలుగు కధా అభిమానులకు నూటికి నూరు పాళ్ళు  సరికొత్త కోణంలో దర్శనమిస్తాయి ఎస్. గణపతిరావు గారి " నిప్పుల తుఫాను"  సంపుటి అనే విషయంలో సందేహం లేదు అతిశయోక్తి అంతకన్నా కాదు. సమాజాన్ని మార్చడానికి కధలు అవసరమా, ? లేక ఉనికి చాటుకోవడం కోసం కధలు అవసరమా అని వీరి కధలు చదివాక తెలిస్తోంది. తల్లి తండ్రులను పిల్లలు చూసే విధానం పట్ల, అవసరమయితే చంపడానికి  కూడా వెనుకాడని జీవితాలను ద్దం పట్టిన "చిట్టచివరి మెట్టు". మనసనేది పూర్తిగా మట్టి ముద్దయితే ఇలాంటి ప్రవర్తన కనిపిస్తుందేమో అనిపిస్తుంది. తాము సంపాదించుకున్న సంపదను తాము అనుభవించాలని కోరుకున్న అయిదుగురు తండ్రులలో నలుగురు తండ్రులు తమ బిడ్డచేతిలో చనిపోతారు. ఒకడు మాత్రం బతికి బయట పడతాడు. పనివాడు రాజు చివరికి దిక్కై వెంకటప్పయ్యను కాపాడుతాడు. రాజు వెంకటప్పయ్యకు తల్లిలా, తండ్రిలా కనిపిస్తాడు. ప్రేమను కోల్పోయిన మనసుకు ఏమి కావాలో అది రాజు ద్వారా  పొందడంతో కధ  ముగుస్తుంది

''నిప్పుల తుఫాను'' అనే కదా చాలా కొత్తగా ఉంది. ఒక స్త్రీని అవమానించి , హింసించిన ఒక ఆసామిని కరిచి బుద్ది చెప్పాలని కుక్కలు నిర్ణయించు కుంటాయి. తల్లి లేని ఒక పిల్లిని తన పాలతో పెంచిన కుక్క స్నేహితులై తిండికి పిలిచి కడుపు నిండకుండా అన్నం పెట్టిన ఒక ఆసామిని ఒక పేద స్త్రీ నిలదీస్తే..ఆమెను కాళ్ళతో తొక్కి క్రూరంగా  ప్రవర్తించడంతో వీరి స్నేహితుడైన ఒక గజ్జి కుక్కతో మాట్లాడి కరిపించడం కధలో కొత్తగా ఉంది. ఒక విధంగా ఎంత మంచి పని చేసింది అనిపించేలా ఉంది. అమానవత్వం పెచ్చుపెరిగిపోతున్న మానవులకు బుద్ది చెప్పాలని జంతువులు అనుకోవడం కొత్తగా ఉంది. ఒక విధంగా హాయిగా కూడా ఉంది. ఇది నిజమయితే ఎంత బావుంటుంది అనే ఆలోచన ఉంది. జంతువుల మనో భావాలను కొత్త ధోరణిలో రచించి మనుషులు జంతువుల కంటే హీనమని నిరూపించిన అద్భుతంగా ఉంది. రచయితను అభినందించాలి.

మానవ సంభందాలను సరికొత్త కోణంలో తెలియజేసి సమాజంలో ఎదురయ్యే వాస్తవ సంఘటనలకు అరికట్టడానికి మనుషులు వారిలో మహనీయులు అక్కరలేదు జంతువులు పక్షులు కుడా తమ వంతు కర్తవ్యాన్ని తెలుపుతాయని నిరూపించిన కధకులు చాలా మంచి రచయిత అని చెప్పడంలో సందేహం లేదు. ఎక్కడో ఒకటి రెండు సంఘటనల మినహా  ప్రతి థా, ప్రతి కవిత, నవల అన్నీ రచయిత వ్యక్తిత్వాన్ని చూపుతాయి అనేది నిజం.  విషయంగా ఆలోచిస్తే గణపతిరావు గారి వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమయినదని కధల ద్వారా మనకు అర్థమవుతుంది.

తెలుపు నలుపు రంగు తేడాలు మనుషుల్లో జాతి సంఘర్షణకి దారితీస్తున్నట్లే, కోయిల స్వరం వినగానే కాకి తన బిడ్డ కాదని కాళ్ళతో బయటకు నిర్దాక్షిణ్యంగా గెంటే సే వైనం కనిపిస్తుంది. జాతి వైరుధ్యం పెచ్చు మీరుతున్న నేటి సమాజంలో  తెల్లవాడు దొంగని తరిమి తరిమి కొట్టి చంపే నల్లవారికి నడుమ సాగే కధ ''పసుపు కుంకుమ, కారం'' . ఒక అపురూపం. ఎందుకంటే పోలీసులకు, తీవ్రవాదులకు మధ్య జరిగే మాటలు, సంఘటనల తీరును కళ్ళకు కట్టించిన వైనం ఎంతో ఆసక్తిగా నడిచింది.

రచయిత గణపతి రావు గారు ఎన్ని కధలు రాసారో కాని కధలు మాత్రం ఒక కొత్త కోణాన్ని మనకు  చూపించాయి.  ప్రేమ, పెళ్లి, విడాకులు, సంప్రదాయాలు, స్త్రీ సహనం లాంటి కధలు ఎందఱో చెప్పుకొచ్చారు. వాటి మూలంగా ఎందరు మారారో కాని వీరి కధలు మాత్రం సరికొత్త గా ఆవిష్కరింప బడ్డాయి. మనిషి మారినా లేకున్నా కొన్ని తెలియని ఎన్నో సంఘటనలు మాత్రం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి.

తీవ్రవాదం కంటే అవినీతి ఎంతో ప్రమాద కరమయినది అని తెలిపిన న్యాయవాదిని చంపినా రాజకీయ గుండాలను గురించి ఇతివృత్తంగా తీసుకుని సంఘంలో  న్యాయంపై పోరాడే పెద్దవారిపై తీర్చుకునే పాత కక్షలకు  పసిపిల్లలు ఎంతగా కోల్పోతారో తెలిపే కధ  "పాల బుగ్గలు"  కంటనీరు తెప్పించింది. శిధిలాల కింద చావు బతుకుల మధ్య పది ఉన్న అమ్మ నాన్న, మరో చోట బొమ్మలతో డుకుని అమ్మ నాన్న వస్తారని తనని ఎత్తుకుని ఆడిస్తారని ఎదురుచూస్తున్న ఒక బిడ్డ మధ్య నడిపిన థానిక హృదయానికి హత్తుకుంది

అన్యాయానికి తిరబడని జాతికి  సరిహద్దుల్లో సైన్యం కాపలా ఎందుకు? అనే ఇతివృత్తంతో నడిపే ఆణిముత్యం లాంటి కధ ''తలలూపే గడ్డి పరకలు''  ఒక వైపు తమ సంసారాన్ని వదులుకుని, పూర్తిగా నా అన్నవారికి కాదనుకుని చేసే మూఢ  ప్రజలకోసం సరిహద్దుల్లో కాపలా  కాస్తుంటే ఇక్కడ మనం హాయిగా నిద్రపోతూ అవినీతిని, మూడ  విశ్వాసాలను రేకెత్తిస్తూన్న ప్రజల కోసం అసలు కాపలా ఎందుకు అనే విషయాన్ని ఆవేశంగా, ఆవేదనగా తెలిపిన తీరు ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. అంటే అన్నీ సమ కోణాల్లో ఉండాలి అని తెలియపరిచే కధలుగా మనసుకు దగ్గరగాకధలు ఉన్నాయి అనేది వాస్తవం

అలాగే '' మాఫియా రాజకీయం, మేనరికం మాయ, తెల్ల కాగితం, దేశంలో ఉన్నాడా '' అనే కధలు సగటు మానవ జీవితానికి ఎంతో దగ్గరగా ఉన్నాయి.  ఇందులో ప్రతి కధ  కమనీయమైన శైలి, కధనం, భాషపై పట్టు, నిర్మాణ విశిష్టత కలిగి ఉన్నాయని నిస్సంకోచకంగా చెప్పవచ్చు.  సమాజ ధోరణులు అన్నీ పెదా దోవ పడుతుంటే కలిగే సామాన్యుని ఆవేదన స్వరూపం '' నిప్పుల తుఫాను'' . చదివి దాచుకోదగిన పుస్తకం ఇది. ఎంతో విషయ పరిజ్ఞానం అందించే కధలు కూడా  అనేందుకు సందేహం లేదు. ఇంత మంచి కధలు అందించిన వీరికి అభినందనలు..

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech