Sujanaranjani
           
  శీర్షికలు  
       మాస ఫలాలు
 

- రచన : బ్రహ్మశ్రీ క్రిష్టిపాటి  విశ్వ ప్రసాద్ శాస్త్రి గారు        

 

బ్రహ్మశ్రీ క్రిష్టిపాటి విశ్వ ప్రసాద్ శాస్త్రి గారు వైదిక కుటుంబములో జన్మించి తన తండ్రిగారైన శ్రీ సుబ్బరామయ్య గారి వద్ద తొలిపలుకులు ప్రారంభించి, కేంద్రీయ సంస్కృత విశ్వ విద్యాలయమున పూజ్య గురుదేవులు శ్రీపాద భట్ గారి వద్ద సిద్ధాంత జ్యోతిషమును అభ్యసించి, తెలుగు విశ్వ విద్యాలయము నందు ఫలిత జ్యోతిషము నందు ఉత్తీర్ణులై గత పుష్కర కాలముగా ఆంధ్ర దేశమున జ్యోతిష పరమైన ముహూర్త, జాతక, సాముద్రిక మరియు వాస్తు శాస్త్ర సేవలందించుచున్నారు .వీరు ప్రస్తుతము కాలిఫోర్నియా ఫ్రీమాంటు హిందూ దేవాలయంలో అర్చకులుగా సేవలను అందిస్తున్నారు.

   

 

 

            మేషరాశి

అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు , కృత్తిక 1 వ పాదము

ఈ రాశి వారికి ఈ మాసంలో నేర పనుల యందు జాగ్రత్త అవసరం ఇతరులతో వైరములు కలుగుటకు  అవకాసం.  తీర్ధయాత్రలు చేయుటకు అవకాసం ఉన్నది. వృత్తి ,వ్యాపారము ,ఉద్యోగమూ నందు అధిక లాభాలు వచ్చుటకు అవకాశం ఉన్నది .ప్రమోషన్స్  కొరకు ప్రయాణాలు చేయవలిసి ఉంటుంది.తలచిన కార్యాలపై  ఒక అడుగు ముందుకు వేస్తారు .ఆరోగ్య విషయంలో మిశ్రమ పలితాలు వచ్చుటకు అవకాసం ఉన్నది. ప్రారంభంలో అధికారుల వత్తిడి,స్త్రీ జన వ్యయము ,వాహన ప్రాప్తి,గృహ లాభము,ప్రమోషన్స్ వచ్చుటకు అవకాశం ఉన్నది.మాసం మధ్యలో శత్రువులచే బాధలు, వ్యతిరేక వాదులు ఎక్కువ అవుటకు అవకాశం ఉన్నది. మాసాంత్యంలో శుభ కార్య ప్రాప్తి.కుటుంబ గౌరవ వృద్ధి ,ధర్మ రక్షణ,ఉన్నత పదవి ,దూర ప్రాంత గమనము  కలుగుటకు అవకాసం ఉన్నది.

                                        ఈ రాశి వారు గురు దత్తాత్రేయ స్వామి  పూజలు చేయుట  మంచిది .
   
 

వృషభరాశి

కృత్తిక  2 ,3 ,4  పాదములు,  రోహిణి    4 పాదములు ,  మృగశిర    1  ,  2   పాదములు 

ఈ రాశి వారికి ఈ మాసం లో కుటుంబం లో ఆస్తి వ్యవహారాలు చర్చకు వచ్చుటకు అవకాశం ఉన్నది.గృహాలంకారముల  కొరకు ఖర్చు చేసి సుందరంగా తీర్చు దిద్దుతారు,ఇతరుల వ్యవహారములలో తల దూర్చి సమస్యలు కొని తెచ్చుకొంటారు.అనుకొన్న సమయానికి అనుకొన్న పనులు కాక చీకాకు పడతారు.స్థాన చలనము కలుగుటకు అవకాశం ఉన్నది.వ్యాపారము నందు హటాత్తుగా ధన లాభములు కలుగుటకు అవకాశం ఉన్నది.  మాస ప్రారంభంలో విధ్యా  విజయము,శారీరక ,మానసిక శ్రమ అధికంగా ఉండును.సంతాన సుఖంకలుగుటకు అవకాసం ఉన్నది. మాసం మధ్యలో ఉద్యోగాభివృద్ధి ,విలాస విశేషాలు ,గొప్పవారి దర్శనము,వాహన యోగము,దాంపత్య సౌఖ్యము  కలుగుటకు అవకాసం ఉన్నది.మాసాంత్యంలో విద్య విజయము,ప్రమాదాలు,ధన ప్రాప్తి,ప్రశంసలుధన లాభాలు కలుగుటకు అవకాసం ఉన్నది.

                      ఈ రాశి వారు అంగారక  పూజలు చేయుట మంచిది .
 
   
 

మిథునరాశి

మృగశిర 3 ,4  పాదములు,  ఆరుద్ర  4 పాదములు , పునర్వసు  1 , 2 ,3   పాదములు 

ఈ రాశి వారికి ఈ మాసంలో మానసిక ఆందోళనలు  ఉన్ననూ ఆరోగ్యరీత్యా  శుభంగా ఉంటుంది.నూతన కార్యాలు చేయుటకు  అవకాశం ఉన్నది.ఆకస్మిక ధనలాభాములు కలుగుటకు అవకాశం ఉన్నది .శుభ వార్తలు వింటారు.పదోన్నతి కొరకు చేసే ప్రయాణాలు కలిసి వచ్చును. ప్రయాణాలు  చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. మాసం ప్రారంభంలో భోజన సౌఖ్యము,యాత్ర దర్శనము,ధన వృద్ధి,అనారోగ్యము,అధికారుల కోపమునకు గురి అగుటకు అవకాశం ఉన్నది . మాసం మధ్యలో వ్యాపారము నందు ఋణములు హెచ్చును.నీచు లతో,దుర్మార్గులతో కలహములు కలుగుటకు అవకాశం ఉన్నది. అధికారుల ఒత్తిడి ,ఉద్యోగ విజయము ,స్థాన చలనము కలుగుటకు అవకాశం ఉన్నది. మాసాంత్యంలో కలహములు ,గృహమునందు ఋణములు ,,భోజన సౌఖ్యము,యాత్ర సందర్శనములు చేయుటకు అవకాశం ఉన్నది.

                        ఈ రాశి వారు దక్షిణామూర్తి,సాయి బాబా పూజలు . అభిషేకాలు చేయుట మంచిది
   
 

కర్కాటక రాశి

పునర్వసు  4  వ  పాదము, పుష్యమి  4 పాదములు , ఆశ్లేష  4 పాదములు

ఈ రాశి వారికి ఈ మాసంలో వ్యాపారము కొంచం తగ్గును.ఉద్యోగమునందు మిశ్రమ స్పందన లభించును.పలు దేవాలయాల దర్శనములు చేయుటకు అవకాశం ఉన్నది. ఒకరి మాటలు ఇంకొకరికి చెప్పటం వలన కొన్ని సమస్యలు వచ్చుటకు అవకాశం ఉన్నది.నీచ స్త్రీ సాంగత్యం  చేయుటకు అవకాశం ఉన్నది.స్థాన చలనమునకు సంభందించి ఆలోచనలు చేయుటకు అవకాశం ఉన్నది.  మాస ప్రారంభంలో శుభ కార్యానుకూలత ,దూరప్రాంత గమనము.బంధు, మిత్ర కలహము.వాహన యోగము కలుగుటకు  అవకాసం ఉన్నది . మాసం మధ్యలో ధన వృద్ధి, ఆరోగ్యలోపము,కార్యహాని,వినోదములు,వృత్తి యందు సంతోషం, విద్యాగోష్టి చేయుటకు అవకాశం ఉన్నది. మాసాంత్యంలో ఉద్యోగంలో ప్రమోషన్స్ ,మానసిక శ్రమలు ,కొన్ని చోట్ల ధన లాభములు  కలుగుటకు అవకాశం ఉన్నది.

                               ఈ రాశి వారు సుబ్రమణ్య స్వామి పూజలు  మంగళవారం  రోజున చేయుట మంచిది.
   
 

సింహరాశి

మఖ  4 పాదములు,  పుబ్బ   4 పాదములు, ఉత్తర    1 వ  పాదము

ఈ రాశి వారు ఈ మాసంలో ఆత్మ విశ్వాసంతో ధనార్జన చేస్తారు.ఋణములు తీర్చే పనులు కొన్ని చేయుటకు అవకాశం ఉన్నది. తలచిన పనులు సాధిస్తారు. దాన గుణంతో వ్యవహరించుట మంచిది.వర్తమానం శుభంగా ఉండును.ధనాదాయము తృప్తినిస్తుంది. మాస ప్రారంభంలో వ్యాపారము,వృత్తి,ఉద్యోగముల యందు లాభములు పొందుటకు అవకాశం ఉన్నది.వ్యసనములచే దుర్వ్యయముశారీరక శ్రమ. కలుగుటకు అవకాశం ఉన్నది. మాసం మధ్యలో వాహన యోగము, స్త్రీలకు మానసిక  ప్రశాంతత లోపించుటకు అవకాశం.కోర్టు వ్యవహారములు,దేశ సంచారం పొందుటకు అవకాశం ఉన్నది. మాసం చివరలో ఇంటి యందు భార్యతో సమస్యలు,నీచులతో,దుర్మార్గులతో కలహములు,మాతృ  సౌఖ్యము  పెరుగుటకు అవకాశం ఉన్నది.

                                   ఈ రాశి వారు రుద్ర  పారాయణము చేయుట మంచిది.
   
 

కన్యా రాశి

ఉత్తర   2 ,3 ,4  పాదములు, హస్త   4 పాదములు ,  చిత్త  1  ,  2   పాదములు 

ఈ రాశి వారు ఈ మాసంలో దూరంగా ఉన బంధువులను కలుసుకొని ఆనందంగా గడుపుటకు అవకాశం ఉన్నది.శత్రువుల వలన కొంచం బాధలు కలుగుటకు అవకాశం ఉన్నది .ఎదుటి వారితో వాదనలు చేసేటప్పుడు కొంచం శ్రద్ధ వహించండి.వ్యాపార విషయంలో  స్వల్ప  ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉన్నది. మాస ప్రారంభంలో వివాహాది శుభకార్యా చర్చలు ,స్థాన చలనము ,ప్రభుత్వ సమస్యలు,అధికార ప్రాప్తివైరములు వచ్చుటకు అవకాసం ఉన్నది. మాస మధ్య మందు దుష్టసాంగత్యము,ఉద్యోగాభివృద్ది, ప్రయత్నకార్య సిద్ధి ,వివాహ ప్రాప్తికలుగుటకు అవకాసం ఉన్నది.మాసాంత్యంలో కోపము,శారీరక,మానసిక ఒత్తిడి,శత్రు బాధలుఋణములు తీర్చుటకు అవకాశం ఉన్నది.

                           ఈ రాశి వారు శనివారం శనైశ్చరునికి పూజలు,పంచాక్షరీ జపం చేయుట మంచిది.
   
 

తులారాశి

చిత్త  3 ,4  పాదములు, స్వాతి   4 పాదములు , విశాఖ   1 ,  2,3  పాదములు 

ఈ రాశి వారికి ఈ మాసంలో నూతన గృహ నిర్మాణాలు చేయుటకు అవకాశం ఉన్నది .కుటుంబంలో ఆరోగ్య పరిస్తితి మెరుగ్గా ఉండును,దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం.కోర్టు వ్యవహారములు సామాన్యముగా సాగును.ధార్మిక ఇబ్బండులువచ్చుటకు అవకాశం ఉన్నది. స్థిరాస్తుల విషయాలు చర్చకు వస్తాయి. మాస ప్రారంభంలో స్త్రీ మూలక సమస్యలు,వృత్తి యందు ధన లాభములు,రోగ బాధలు,కలుగుటకు అవకాశం ఉన్నది . మాసం మధ్యలో భార్యతో సమస్యలు,మాత్రు సౌఖ్యము,గృహము నందు చీకాకులు,ఇష్ట కార్య సిద్ధి,విద్య,వివాహ లాభములు కలుగుటకు అవకాశం ఉన్నది. మాసాంత్యంలో ప్రశాంతత ,మనోల్లాసము,వృత్తి యందు వ్యతిరేకతలు,అధికార కోపము,హృదయ సంకటం,మనోధైర్యము కలుగుటకు అవకాశం ఉన్నది.

            ఈ రాశి వారు శనివారం నాడు విష్ణు సహస్ర నామ పారాయణ  చేయుట మంచిది.
   
 

వృశ్చికరాశి

విశాఖ  4  వ  పాదము, అనూరాధ   4 పాదములు , జ్యేష్ట   4 పాదములు

ఈ రాశి వారికి  ఈ మాసంలో ధన వ్యయము అధికముగా ఉండును. ఇంటిలో వారిపై కోపముతో దేశ సంచారం చేసెదరు.వస్త్రాలు,ఆభరణముల కొరకు డబ్బు ఖర్చు చేయుదురు.తోటి ఉద్యోగస్తులతో కలిసి ప్రభుత్వముపై వాదములు చేయుదురుభాగస్వామితో కొంచం కలహాలు కలుగుటకు అవకాశం ఉన్నది. మాస ప్రారంభంలో ధనమునకు అన్వేషణ చేయుదురు,సోమరితనము,స్థాన చలనము,హృదయానందం కలుగుటకు ఆకాశం ఉన్నది. మాసం మధ్యలో సాహస యాత్రలు,దైవచింతన ,గొప్పవారి దర్శనము,అనుకొన్నది సాధించలేక పోవుటకు  అవకాశం ఉన్నది. మాసం చివరిలో కొద్ది అనారోగ్యము,దాంపత్య సౌఖ్యము,రాజ దండనలు,తనకన్నా తక్కువ వారితో వైరములుకలుగుటకు అవకాశం ఉన్నది.

          ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి కి పూజలు, అర్చనలు చేయుట మంచిది .
   
 

ధనూరాశి

మూల  4 పాదములు,  పూ.షా   4 పాదములు,  ఉ.షా    1 వ  పాదము

ఈ రాశి వారికి ఈ మాసంలో విదేశ ప్రయాణం చేయుటకు అవకాశం ఉన్నది.తీర్ధ యాత్రలు చేయటకు అవకాశం ఉన్నది.భాగస్వామ్య  వ్యాపారంలో జాగ్రత్త అవసరం .ఉద్యోగస్తులకు స్థాన చలనము కలుగుటకు అవకాశం ఉన్నది. మాస ప్రారంభంలో సామాన్య ధన లాభములు,దేశ సంచారం చేయుట,స్త్రీ లచే బాధలు,గృహ లాభము,సకాల భోజనము,నేత్ర బాధలు,అధికారుల ఒత్తిడిఋణములు చేయుటకు  అవకాశం ఉన్నది. మాసం మధ్యలో వ్యాపారము తగ్గును,అధికారుల ఒత్తిడి,స్త్రీ మూలక సమస్యలు,అనారోగ్యము కలుగుటకు అవకాశం ఉన్నది .మాసాంత్యంలో వాహన యోగము,మనోల్లాసము,ఋణాలు వచ్చుటకు అవకాశం ఉండును,కార్య విజయము,  కలుగుటకు అవకాసం ఉన్నది.

                           ఈ రాశి వారు రాహు-కేతు   పూజలు చేయుట మంచిది .
   
 

మకరరాశి

ఉ.షా  2 ,3 ,4  పాదములు, శ్రవణం   4 పాదములు , ధనిష్ఠ    1  ,  2   పాదములు 

ఈ రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం,సంసారిక జీవితంలో కొన్ని లోపాలు వచ్చుటకు అవకాశం ఉన్నది.షుగర్ వ్యాధి ఉన్నవారు జాగ్రత్త అవసరం.ఇంటిలో వాతావరణం మీకు బాభ కలిగించును.ధనాదాయము సామాన్యముగా ఉండును.  మాస ప్రారంభంలో వ్యతిరేకతలు వచ్చుటకు అవకాశం.బంధు, మిత్రుల సమాగమనము ,మనోవేదన,శుభ కార్య లాభములు కలుగుటకు అవకాశం ఉన్నది. మాస మధ్యమందు సామాన్య ధన లాభములు,మనోధైర్యము,వాహన యోగము,ఇంటిలో భార్యతో సమస్యలు వచ్చుటకు  అవకాశం ఉన్నది. మాసాంత్యంలో దేశాంతర ప్రయాణాలు చేయుట,విద్యార్దులకు అధిక శ్రమ కార్య సాధన,దైవ చింతన ,శుభ  కార్య ప్రాప్తి కలుగుటకు అవకాశం ఉన్నది .

                                  ఈ రాశి వారు అంగారక పూజలు  చేయుట మంచిది .
   
 

కుంభరాశి

ధనిష్ఠ     3 ,4  పాదములు, శతభిషం   4 పాదములు ,  పూ.భా   1  ,  2 ,3  పాదములు 

ఈ రాశి వారికి ఈ మాసంలో ఆర్ధిక లావాదేవీ లలో నష్టములు వచ్చుటకు  అవకాశం ఉన్నది. పిల్లలకి సంబంధించి సమస్యలు వచ్చుటకు అవకాశం,ప్రేమ వ్యవహారములలో జాగ్రత్త అవసరం,గతంలో ఏర్పడిన కుటుంబ కలహాలు సమసి పోవును,పిల్ల విద్యా విషయంలో జాగరూకత అవసరం .బ్యాంకు సంబంధించి సమస్యలు వచ్చుటకు అవకాశం ఉన్నది. మాస ప్రారంభంలో వివాహాది శుభ కార్య ప్రాప్తి,శక్తి,సామర్ధ్య గుర్తింపు,గృహ లాభములు,స్త్రీ  లచే బాధలుకలుగుటకు అవకాశం .మాసం మధ్యలో కుటుంబం లో స్వల్ప పాటి సమస్యలు,ధన వృద్ధి,ఉద్యోగాభివ్రుద్ది కలుగుటకు అవకాశం.మాసాంత్యంలో వాహన యోగము,గృహ సౌఖ్యము,భోజన సౌఖ్యము,యాత్ర దర్శనము,శత్రు బాధలుకలుగుటకు ఆకాశం ఉన్నది                                ఈ రాశి వారు దుర్గా దేవికి  అర్చనలు ,పూజలు చేయుట మంచిది.

   
 

మీనరాశి

పూ.భా    4  వ  పాదము, ఉ.భా   4 పాదములు ,  రేవతి   4 పాదములు 

ఈ రాశి వారు ఈ మాసంలోధార్మిక చింతనతో పుణ్య క్షేత్రాలు సంచరిస్తారు.వ్యాపారము నిమిత్తము దూర ప్రయాణాలు చేయ వలిసీ వచ్చును. ధనాదయములో మిశ్రమ ఫలితము వచ్చుటకు అవకాశం ఉన్నది. ఉద్యోగంలో మా పనితనాన్ని చూసి మీ అధికారులు అభినందాన్ని పొందే  అవకాశం ఉన్నది. ఆనందంగా  ఉంటారు. మాస ప్రారంభంలో సంతాన సమస్యలు,గౌరవ మర్యాదలు పొందటం,ఉద్యోగులకు ధన లాభం, శుభ కార్యాలు ,దైవ చింతన ,బుద్ధి చాంచల్యం ,ధార్మిక చింతన , కలుగుటకు అవకాశం..మాసం మధ్యలో  ,శత్రు బాధలు ,యత్న కార్య జయము,స్థాన చలనము,శారీరక,మాసిక బాధలు కలుగుటకు  అవకాశం ఉన్నది. మాసాంత్యంలో ధన ప్రాప్తి, విలాస జీవితమూ,ధర్మ రక్షణ,వ్యాపార లాభములు, వాహన యోగము,శుభ కార్య ప్రాప్తి  కలుగుటకు అవకాశం ఉన్నది.

                             ఈ రాశి వారు ఆదిత్య హృదయ పారాయణ చేయుట మంచిది.
   
   

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
 
 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech