Sujanaranjani
           
  కవితా స్రవంతి  
 

ప్రియతమ

 

 

రచన: - వర్ధాన్ 

 

 
 

ఎదో  రాద్దామని  కూర్చున్న ఆలోచనలు  ఆగిపోయ్ నిస్తెజంగ  కూర్చున్న ఇంతలో మీరు !!!

కాదు కాదు నీవు ఇదే ఇలా పిలవడమే ఇష్టం  కదూ .

రోజు నిన్ను చూసి ,

అబ్బ మీరు నవ్వితే కలువ పూవు విచ్చుకున్నట్టు ,

రోజులు గుర్తుకొస్తే ఇప్పటికి నా వొళ్ళు పులకిస్తుంది ,

మనసంత మధురభావన .

ఎన్ని కలలు ,

ఇంకెన్ని ఆశలు ,

నీవు నా వొళ్ళో పడుకొని చెప్పిన ఊసులు ,

చేసిన బాసలు అన్ని అన్ని నాకు ఇంక బాగా గుర్తు .

నా ఎద పై తల పెట్టి నేవు పాడిన పాట  ఇప్పటికీ  ఎప్పటికి ఎలా మర్వగలను .

ప్రియతమ నీ కౌగిలి లో కరిగి , నీ కురులతో ఆడి ,

నా చేతులారా నీ మొహాన్ని దగ్గరగా తీస్కుని అబ్బ .............ఆపేయనా .

కానుక నీ కియ్యాలి

కోరిక నిను కోరాలి ,

నీవే కానుకవి ,

నీవే కోరికవి ...............

చెలి..

విధి ఆడిన నాటకం లో దూరమైనా  

నా ఎద లోతుల్లో జ్ఞాపకమై నా గుండె

సవ్వడి వై  , నా నోటి నవ్వు వై , నా కళ్ళలో రూపమై ,,,,,,,,,,,,,,,,

అలా అని కట్టుకున్నదానికి అన్యాయం చెయ్యట్లేదు

నాకిద్దరు పిల్లలిప్పుడు" అమ్మాయి అబ్బాయి "

నా బాధ్యత సక్రమంగానే నేరవేరుస్తున్నాను,

సంసార జీవితం లో అన్ని ఉన్నాయ్

నీవు తప్ప అన్నీ ఇప్పుడు 

నీవు రమ్మంటే నేను రాలేను .

ఎప్పుడైతే మూడు ముళ్ళు వెసానో బాధ్యత ఛత్రం లో బంధీనయ్యాను .

మగాడిగా

మనిషిగా

భర్తగా

తండ్రిగా ,

అన్నిటికంటే మించి నా తండ్రి పెంపకానికి కనుక గా ,,,,,,,,,,,,,

భార్య ఆశయాలు నెరవేర్చే  భర్తగా,

వృద్దాప్యం లో అమ్మానాన్న కి తోడుగా ,

నా పిల్లలని మంచి పౌరులుగా తీర్చిదిద్దే తండ్రిగా ,

నా కోసం నా లక్ష్యం దిశగా .........................

చాలా బాధ్యతలున్నై ,

అవి నెరవేర్చడం లో ఎనలేని ఆనందముంది ,

అలసటే రాని కష్టముంది .

నీవు కూడా నీ బాధ్యతల్ని నెరవేర్చి మనలని విడదిసినందుకు విది  సిగ్గుపడేలా చెయ్ .

నీవు గుర్తుకోస్తావ్ ,

 

నీ ప్రేమ ,,,,, నీ కాటుక కళ్ళు ,

నీ నుదుటిన బొట్టు , 

మీ ఏంటి పక్కన మల్లె చెట్టు ,

నీ చేతికి నేను ఇప్పించిన ఎర్ర గాజులు ,

నీ సిగ లో తురిమిన సన్నజాజులు ,

నీ తలపై పోసిన బంతి రెమ్మలు

నీ చెవి కి పెట్టిన బంగారు కమ్మలు

నీకు కోసిచ్చిన మామిడి పిందెలు

నీకై దొంగిలించిన జామకాయలు ....

అన్ని అన్ని గుర్తుకొస్తాయి కాని బాధ్యతల ముందు చిన్న బోతాయ్ .

సరే మరి.... నీ జ్ఞాపకాల దొంతరలో నీ ప్రేమికున్నే .

కాని బాధ్యతల బడి లో నేను మహారాజు ని

ప్రియా

సెలవా మరి , అప్పుడప్పుడు రా

జ్ఞాపకమై

మలయా మారుతమై

చిరు జల్లువై

పండు వెన్నెలవై

నా కలవై

మంచి ఆలోచనవై ..

నీవే కాదు నెనూ వస్తా .

నీ సిగ లో పూవునై

నీ నుదిటిన బొట్టునై

కళ్ళ  కాటుకనై

నీ పెదాల రంగునై

నీ ఎద లోతుల్లో ఆశ నై .......................

ఉంటా మరి !!!!!!!!!!!!!!!!


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech