తెలుగు తేజోమూర్తులు - రచన : ఈరంకి వెంకట కామేశ్వర్.

సుప్రసిద్ధ కధా రచయిత ముళ్ళపూడి వెంకట రమణ

పదహారణాలా తెలుగు తనం చాటిన మహా రచయిత రమణ. తెలుగు వాడు మరచిపోలేనట్టుగా " అప్పా రావు ", " బుడుగు - చిచ్చర పిడుగు " పాత్రలను సృస్టించారు. జన మనస్సులను ఆకట్టుకున్నారు ముళ్ళపూడి వెంకటరమణ (వెంకట రావు).
నీతీ నిజాయాతీ, సహజ శైలీ, సామాజిక సృహ, జనాల ఉనికిడి, లోతైన భావాలోచనలు చమత్కార సంభాషణలు వీరి రచనా కౌసలానికి నిదర్శనాలు. వీరి కధ చదివినా, తెర మీద చూసినా - అవి చెరగని ముద్రలే. మనస్సుల్లో నిలచిపోతాయి. ఇవి వెంకటరమణ గారి రచనా పటిమకు నిదర్శనాలు. వీరి కధలకి, బాపు గారి బొమ్మ తోడవుతే అవి జన రంజకం కాక మానవు. వీరి - " అప్పా రావు ", "గోపాలం", "కాంట్రాక్టర్ " పాత్రల రూపకల్పనలు అతి విశిష్ఠమైనవి. ఆ పాత్రల ద్వారా, వారు చెప్పే డయలాగులుల ద్వారా నిగూడ, నిక్షిప్తార్ధలను జన మన్స్సుల్లో నాటారు. ఇవి వారి సామాజిక సృహ సూచికలు. రచయితకి ఇంతకంటే సార్ధకత ఉండదు. రచనా సంకల్ప ప్రయోజనం సాధించి నట్టే.
ఆరు దశాబ్దాలపాటు బాపు - రమణలు తెలుగు వారిని అలరిస్తూ వచ్చారు. తెలుగు వారికి నిండు తెలుగు దనం ఆపాదించారు.

నిగూడ సత్యాలు:
అనేక నిగూడ సత్యాలు వ్రాశారు. ఉదాహరణకి " ఈ భూప్రపంచంలో ఎదుటివాడిలో కృతజ్ఞత ఆసించే కన్నా ఆంధ్ర రాజకీయ నాయకుల్లో ఐకమత్యాన్ని ఆశించు" అని రాశారు. నిజం నిప్పు లాంటింది. వీరి రచనా శైలి సూటిగా ఉంటాయి.

వీరి పందా లో రెండు ప్రత్యేకతలు ఉంటాయి - ఒకటి "పదహారణాలా తెలుగు తనం ", రెండవది - " చమత్కారం " (సున్నిత వ్యంఘ్యాశాస్త్రాలు వేస్తూ ఉంటారు). ఇది అనుభవజ్ఞులకే చెల్లింది.

"మడిసి అన్న తరువాత కాస్త కలా పోసణ ఉండాలయ్యా ", " తిని తొంగ్గుంటే మనిషికి గొడ్డుకి తెడా ఏముటుంది ", " ఆం యాం యాం " (లంచం కావాలి అని చెప్పడానికి నిర్వచనం), " నాకు అదో తుత్తి " ఇలాటి సందర్బోచిత పద ప్రయోగాలను చేసి తన ఉనికి చాటేరు, పాత్రలకు జీవం పోశారు. ఈ సినిమా "కతలు", సంభాషణలు, మాటలు - భాషా కేళి రమణ కలాపం.

జూన్ 28, 1931 లో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు. ధవళేశ్వరం లో పెరిగారు. వీరికి ఓ సోదరి, ఓ సోదరుడు. తన తొమ్మిదవ ఏట తండ్రి మరణాంతరం చెన్నై చేరారు. తల్లి ఆదిలక్ష్మి గారు సంసారాన్ని నెట్టుకొచ్చారు. రమణ గారి తదుపరి విద్యాభాసం అక్కడే కొనసాగించారు.


ఆంధ్ర పత్రిక లో రెపోర్టర్ గా ప్రారంభమైయ్యింది వారి సారస్వత కృషి. ఈ దరిమిళా అనేక మేటి సాహిత్యకారులతో సంపర్కం ఏర్పడింది. ఈ పరిచయాలు వీరి జీవితానికి దిశా మార్గాలైయ్యాయి.

బాపు - రమణలు:
వీరిరువురి అనుభందం ఆరు దశాబ్దాల పైమాటే. 1942 పి ఎస్ హై స్కూల్ లో వీరికి పరిచయం ఏర్పడింది. తరువాత కేశరి హై స్కూల్లోనూ కొనసాగింది. వీరి ప్రధమ రచన - " అమ్మ మాట వినకపోతే ". దీనికి చిత్రాణుగణం అందించింది బాపు గారు. ఇలా వీరిద్ధరి సాహితీ పయనం మొదలై అనేక మైలు రాళ్ళు నెలకొల్పి తెలుగు సాహిత్యాభిమానులకు కొత్త పందాను అందించాయి. తెలుగు తనం అంటే ఇది - అని అనుకునేట్టు చేశాయి. ఇలా రచయిత చేయగలిగాడంటే అది వారి రచనా సాఫల్యానికి నిదర్శనం. రమణ గారి కధలకి, కళ్ళకి కట్టి నట్టు ఉండేవి బాపు గారి బొమ్మలు. వీరిద్ధరి స్నేహం తెలుగు సాహిత్య చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం గా నిలచిపోతుంది.

సాహిత్య రచనలు:

1953 లో " ఆంధ్ర పత్రిక " రెపోర్టర్ గా చేరారు. ఇలా వీరి సాహిత్య పదం ఆరంభమైయ్యింది. వెంకటరమణ గారి రచనలలో కొన్ని ముఖ్య మైనవి:

4 ఎనబై రోజుల్లో భూ ప్రదక్షిణం
4 బుడుగు (చిచ్చర పిడుగు)
4 కోతి కొమ్మచ్చి
4 కదంబ రమణీయం
4 ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వం - కధా రమణీయం
4 ముక్కోతి కొమ్మచ్చి
4 శ్రీ కృష్ణ లీలలు
" కోతి కొమ్మచ్చి " లో తనదైన శైలిలో, వ్యంగ్యాస్త్రాలతో తన జీవితానుభవాలను తెలిపారు.
" భక్త కన్నప్ప ", " సంపూర్ణ రామాయణం ", " సాక్షి ", " ముత్యాల ముగ్గు ", " శ్రీనాధ కవి సార్వభౌమ ", " మనవూరి పాండవులు " వంటి జన రంజక చిత్రాలను అందించారు. బాలరాజు కధ (పిల్లల సినిమా) - వ్రాశారు. ఇది మరో ఆణి ముత్యం. ఓ చిన్న కుర్రాడు ప్రగాడమైన ఆత్మ విశ్వాసం, నమ్మకం తో కుటుంభ పోషణ చేస్తాడో, కష్టాలను ఎలా అదిగమిస్తాడో కళ్ళకి కట్టి నట్టు బాపు - రమణులు చూపించారు.
చరిత్ర పట్ల తమకున్న ప్రగాడ మమకారాన్ని ఇందులో తొణికిసలాడుతుంది.


రాజలక్ష్మి అవార్డు అందుకున్నారు. అంతకు మునుపు రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు రమణ గారు.

ఫిబ్రవరి 23, 2011 లో అనంత లోకాలకు వెళ్ళి పోయారు వెంకటరమణ గారు. వీరి రచనలు - కధలు, మాటలు, చిత్రాలు జన హృదయాలలో మెదులుతూనే ఉంటాయి. ముళ్ళపూడి వెంకటరమణ గారు తెలుగు "కతా" ఇతిహాసంలో చిరస్మరనీయుడు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech