కవితా స్రవంతి  
      సంక్రాంతి సంబరాలు
 

 రచన: వేదుల బాలకృష్ణమూర్తి

 
 
 
 

సీ.||వేయికిరణముల వేల్పు రవి మకర - రాశిని చేర సంక్రాంతి అయ్యె
తలయంట్లు, భోగిమంటలు పాలపోంగలి -బొమ్మల కొలువులు భోగి పళ్ళు
చెక్కభజనలును చెంచుపాటలు జగ - దంబ పలుకు బుడబుక్కు మాట
గంగిరెద్దుల ఆట కవిగాయకుల పాట - పగటి వేషము కోడి పందెములును
కొడుకులు కూతుళ్ళు క్రొత్త యల్లుండ్రతో - ఆనందముగ విందులారగింప

తే.గీ.|| మాసరాజంబులున పుష్యమాసమందు
ఆంధ్రులకు పెద్ద పండగ యనగ వచ్చె
భోగి సంక్రాంతి కనుమలు ముక్కనుమయు
తెలుగు లోగిళ్ళ సరిక్రొత్త వెలుగు నింప

   

 

 

 

 

 


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech