తొలిపలుకు  
     రచన : రావు తల్లాప్రగడ  
   సంపాదకవర్గం:
ప్రధాన సంపాదకులు:
రావు తల్లాప్రగడ 

సంపాదక బృందం:
తమిరిశ జానకి
కస్తూరి ఫణిమాధవ్
సి. కృష్ణ
తాటిపాముల మృత్యుంజయుడు

వెబ్ రూపకల్పన :
సి.కృష్ణ, హైదరాబాద్.
 

 

ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

"తాజమహల్ షాజహానే కాట్టాడా" అనే వివాదం ఈ నాటిది కాదు. కానీ ప్రభుత్వ సహకారం లేకపోతే ఇది నిర్థారించడం కొంచెం కష్టమైన పనే. కానీ ఈ విషయంలో ప్రభుత్వ సహకారం సాధించడం అంత సులభమేమీకాదు.ఇక నిజానిజాలు తేల్చుకోవాలంటే మన దర్యాప్తులు మనం చేసుకోవలసిందే. గతమాసం సుజననీయంలో తాజమహల్లో పైపైన కనపడే హైందవ చిహ్నాలను గమనించాం. పీ.ఎన్.ఓక్ గారు అందించిన చారిత్రాత్మక ఆధారలతో పాటు మిగితా ఆధారాలను కూడా కలిపి ఈ మాసపు సుజననీయంలో చూద్దాం.ఈ నెల షాజహాన్ పైన జరిపిన ఈ చారిత్రాత్మక విశ్లేషణలో మరికొన్ని ఆధారాలను సేకరించి, రాబోయే మాసాలలో సాంకేతిక ఆధారాలను పరిశిళిద్దాం. షాజహాన్ పుట్టింది, చనిపోయింది రెండూ జనవరిలోనే కనుక, ఇతడు గతంలో మనలను పాలించిన చక్రవర్తి కనుక, మన తాజమహల్ కి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించి పెట్టినవాడు కూడా ఇతడే కనుక, ఇతడికి నివాళులర్పించుకుంటూ ఈ సంచికను షాజహాన్ ముఖచిత్రంతో, ఒక సుజననీయంతో విడుదల చేస్తున్నాము.అందరూ ఆదరిస్తారనే ఆశిస్తున్నాము.

అలాగే ఒక పక్క ఈ మతపరమైన చర్చ కొనసాగిస్తూ, అసలు "దేవుడున్నాడా" అనే మరొక చర్చను కూడా ధారావాహికంగా ఈ కొత్త సంవత్సరం నుంచీ మొదలు పెడుతున్నాము. సుజనరంజనిలో అన్ని రకాల భావాలనూ వివిధ కోణాలలో పరిశీలించి చూపడమే ఇందులోని ముఖ్యోద్దేశం. ఈ వ్యాసపరంపరని ముత్తేవి రవీంద్రనాథ్ గారు అందిస్తున్నారు. రవీంద్రనాథ్ గారు సుజనరంజనిలో గత రెండు మాసాలుగా భట్టారక సాంప్రదాయం పైన వ్యాసాలు వాసి మనకు పరిచయమయ్యారు. వీరి 'తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన' అన్న తొలి రచనే కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ పొందింది. వీరు 'శ్రమ వీరులు' పేరిట కొన్ని శ్రామిక సామాజిక వర్గాల చరిత్ర, స్థితిగతులపై ఓ పరిశోధనాత్మక గ్రంథం రాశారు. జనరంజకమైన హరికథా రూపంలో దైవ ప్రస్తావన లేకుండా ' మహాకవి శ్రీ శ్రీ - సిరి కథ' అనే రచన చేశారు. 'పాండురంగ మాహాత్మ్యము-పరిచయం','మన ప్రాచీనుల ఆహారం,ఆరోగ్యం, వైద్యం' వీరి ఇటీవలి రచనలు.

దీనికి తోడుగా, కమ్యూనిజం పైన వనం జ్వాలానరసింహా రావుగారు వ్రాసిన ప్రత్యేక విశ్లేషణాత్మకమైన వ్యాసం కూడా ఈ సంచికలో చదువగలరు. అలాగే "బెజవాడ అంటే ఇదా" అంటూ భండారు శ్రీనివాస రావు గారు వ్రాసిన వ్యాసం వార్తా-వ్యాఖ్యలో తప్పక చూడాల్సినదే.

ఇవే కాకాకుండా, డా. ఏల్చూరి మురళీధరరావు గారి "వాఙ్మయచరిత్రలో వ్యాసఘట్టాలు" అనే కొత్త పరిశోధనావ్యాస పరంపరను ఈ మాసం నుంచీ ధారావాహికంగా ప్రవేశపెడుతున్నాము. ఈ నెల వారు వ్రాసిన "భీమేశ్వర పురాణంలో శ్రీనాథుని గాథాసప్తశతి లోని పద్యం" అన్న అంశంపైన వారు జరిపిన విశ్లేషణ, సాహిత్యాభిలాషులను ఆలోచింపచేయడమే కాక అనేక కొత్త విషయాలను బయటకు తీస్తుంది.

ఇలా ఈ కొత్త సంవత్సరంలో ఎన్నో వైవిధ్యభరితమైన శీర్షికలను మీ ముందుకు తెస్తూ, మళ్ళీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుకుంటూ..

మీ
రావు తల్లాప్రగడ


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech